అఖిల్ సినిమాకి చుక్కలు చూపించి ఊహకు అందని వసూళ్లు సాధించిన శ్రీకాంత్ కొడుకు సినిమా

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత మన టాలీవుడ్ కి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి అని చెప్పుకోవచ్చు,కరోనా వాళ్ళ తీవ్రంగా ఇబ్బంది పడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత విడుదల అయినా ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది, ఇప్పటి వరుకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాకపోయినా , చిన్న సినిమాలు మరియు మీడియం బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షాలు కురిపించాయి,ఇక ఈ ఏడాది అక్కినేని హీరోలకు ఒక్క రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పొచ్చు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన వైల్డ్ డాగ్ చిత్రం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో రాబట్టి కలెక్షన్స్ రాలేదు కానీ, సినిమాకి అయితే మంచి రివ్యూస్ వచ్చాయి,నాగార్జున చాలా కాలం తర్వాత ఒక్క మంచి సినిమా తో మన ముందుకి వచ్చాడు అని అందరూ అనుకున్నారు, ఇక ఆయన కొడుకులు అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ తో చెడుగుడు ఆడేసుకున్నారు, వీళ్లిద్దరు నటించిన లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలు వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి, ఇక ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ వసూలు చేసింది,ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా విడుదల అయ్యి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పెళ్లి సందడి సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి, ఎవరికీ ఎక్కువ లాభాలు వచ్చాయి అనేది ఈ కథనం లో చూడబోతున్నాము.

ముందుగా అక్కినేని నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లైవ్ స్టోరీ అనే సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము, ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్నా సినిమా కావడం , దానికి తోడు ఆ సినిమా నుండి విడుదల అయినా ప్రతి ఒక్క పాట సెన్సషనల్ హిట్ అవ్వడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి చేరాయి, దానికి తోడు ఈ సినిమా టీజర్లు మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను ఒక్క రేంజ్ కి చేర్చాయి, అంతతి భారీ అంచనాలతో విడుదల ఆయన ఈ సినిమా తోలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని అద్భుతమైన వసూళ్లతో తోలి రోజు నుండే ట్రేడ్ కి పూర్వ వైభవం రప్పించింది, ఇక మొదటి వారం లోనే ఈ సినిమా పాతిక కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, ఫుల్ రన్ లో అక్షరాలా 35 కోట్ల రూపాయిలు వసూలు చేసింది, ఈ సినిమా కి ప్రీ రిలీజ్ బిజినెస్ 32 కోట్ల రూపాయలకు జరగగా మూడు కోట్ల రూపాయిల లాభాల్ని బయ్యర్స్ తెచ్చి పెట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒక్కటిగా నిలిచింది.

ఇక లవ్ స్టోరీ సినిమా థియేటర్స్ లో అద్భుతంగా ఆడుతున్న సమయం లోనే నాగ చైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ నటంచిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా విడుదల అయ్యింది, ఎప్పటి నుండో అక్కినేని అభిమానులు ఖిల్ నుండి ఒక్క హిట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వారి ఎదురు చూపులకు తెరపడేలా చేసింది మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా , బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు అయితే లేవు ,కానీ అంత తక్కువ అంచనాలతో వచ్చిన, ఎదురుగ మూడు సినిమాలు కాంపిటీషన్ లో నిలిచినా కూడా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా అద్భుతమైన వసూలు సాధించి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల రిపాయిలకు జరగగా, ఫుల్ రన్ వసూళ్లు మాత్రం ఏకంగా 28 కోట్ల రూపాయిలు వచ్చాయి, అంటే బయ్యర్లకు ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల రూపాయిల లాభాల్ని తెచ్చి పెట్టింది.

ఇక దసరా లో అందరికి సర్ప్రైజ్ ఇచ్చిన సినిమా శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన పెళ్లి సందడి అనే సినిమా,ఈ సినిమా ఐ మొదటి నుండి జీరో అంచనాలు ఉన్నాయి, కానీ ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అంటే, ప్రేక్షకులను థియేటర్స్ వైపు పరుగులు తీయించేలా చేసింది , కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న సినిమా, మొదటి రోజే ఎవ్వరు ఊహించని విధంగా రెండు కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది , ఇక ఫుల్ రన్ లో అక్షరాలా 8 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి బయ్యర్లకు మూడు కోట్ల రూపాయిల లాభాల్ని తెచ్చి పెట్టింది,ఈ సినిమా ఈ స్థాయి లో విజయం సాధిస్తుంది అంబి బహుశా ఎవ్వరేటు ఊహించలేకపోయాయి ఉంటారు,గమ్మత్తు ఏమిటి అంటే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపొయ్యేలా చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles