అమెజాన్ అడ‌వుల్లో అంతు చిక్క‌ని ర‌హ‌స్యాలు..!

మాన‌వుడు.. ఈ భూమ్మీద మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం క‌లిగిన ప్రాణి. ప్ర‌పంచంలోని అన్ని జీవ‌రాశుల కంటే అద్భుత ఆలోచ‌న క‌లిగిన వాడు. త‌న మేధ‌స్సును చ‌రాచ‌ర జీవుల కంటే అత్యున్న‌తంగా ఉప‌యోగించ‌గ‌ల‌డు. జీవ ప‌రిణామ‌క్ర‌మంలో భాగంగా అత్యంత తెలివితేట‌ల‌ను పొందిన‌వాడు. చెట్ల బెర‌డును చుట్టుకుని తిరిగిన వాడు.. ఏసీ గ‌దుల్లో అత్యున్న‌త జీవితాన్ని గ‌డిపే స్థాయికి చేరుకున్నాడు. త‌న ఆలోచ‌న‌ల‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అయినా.. మాన‌వుడికి తెలిసిన విష‌యాలు స‌ముద్రంలో నీటి బిందువంత‌.. ఎడారిలో ఇసుక‌రేణువంత‌.. త‌న ఆలోచ‌న‌కు సైతం అంతు చిక్క‌ని ర‌హ‌స్యాలు ఎన్నో ఉన్నాయి ఈ భూగ్ర‌హం మీద‌. అలాంటి వాటిలో ఒక‌టే అమెజాన్ మ‌హార‌ణ్యం. ఎన్నో ల‌క్ష‌ల ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న ఈ కీకార‌ణ్యం.. మ‌రెన్నో ల‌క్ష‌ల ర‌హస్యాల‌కు నెల‌వు. అందులో కొన్ని అంతు చిక్క‌ని ర‌హ‌స్యాల గురించి ఇప్పుడు మ‌నం ఈ వీడియోలో తెలుసుకుందాం!

అమెజాన్ అడ‌వుల్లో మాత్ర‌మే క‌నిపించే ఓ ప్ర‌త్యేక ప‌క్షి గురించి ఇప్పుడు మ‌నం చూద్దాం.. చెట్టు బెర‌డులో క‌లిసిపోయిన‌ట్లు ఉన్న ఈ బ‌ర్డ్ పేరు పొటో. ఈ ప‌క్షి కేవ‌లం రాత్ర స‌మ‌యంలోనే క‌నిపిస్తోంది. ప‌గ‌టి పూట బ‌య‌ట‌కు వ‌చ్చినా మ‌నుషులు గుర్తు ప‌ట్ట‌లేని విధంగా చెట్ల బెర‌డు ద‌గ్గ‌రే క‌ద‌ల‌కుండా నిల‌బ‌డి ఉంటుంది. ఎలాంటి చ‌ల‌నం లేకుండా గంట‌ల త‌ర‌బ‌డి ఒకే యాంగిల్ లో ఉండ‌గ‌ల‌దు. అందుకే అత్యంత ప‌రిశీల‌న‌గా చూస్తే త‌ప్ప ఈ ప‌క్షిని గుర్తుప‌ట్ట‌లేము. అంతేకాదు.. క‌ళ్ల‌ను పూర్తిగా మూయ‌కుండా బ‌య‌ట ఏంజ‌రుగుతుందో తెలుసుకునేందుకు కాస్త తెరిచే ఉంచ‌డం విశేషం.

ఇక అమెజాన్ కీకార‌ణ్యంలో మ‌రో అద్భుతం న‌డిచే వృక్షాలు.. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇవి ముమ్మాటికీ వాస్త‌వం. వీటి అస‌లు పేరు కాష్మోనా. న‌డిచే వృక్షాలు అన‌గానే మ‌నం మ‌నుషులు న‌డిచిన‌ట్లే న‌డుస్తాయి అనుకుంటాం. కానీ అది వాస్త‌వం కాదు. పొద్దు తిరుగుడు పువ్వులు సూర్యుడి వైపు చూసిన‌ట్లుగానే న‌డిచే చెట్లు సైతం సూర్యుడి దిశ‌గా వెళ్తాయి. అంటే సూర్యడు ప్ర‌కాశించే వైపు చెట్టుకు కొత్త‌వేళ్లు వ‌స్తాయి. పాత వేర్లు ఊడిపోతుంటాయి. ఈ కార‌ణంగా ఒక చోట పుట్టిన చెట్లు కొత్త వేర్లు వ‌స్తూ.. పాత వేర్లు పోవ‌డం మూలంగా ముందుకు జ‌రుగుతాయి. అందువ‌ల్ల వీటిని న‌డిచే చెట్లు అని పిలుస్తారు.

అమెజాన్ అడ‌వుల్లో మ‌రో విశేషం.. అన‌కొండ‌లు. ఈ కార‌డ‌విలో సుమారు వంద ర‌కాల అతిపెద్ద పాముల జాతులున్నట్లు ప‌రిశోధ‌కుల స‌మాచారం. కొన్ని పాములు గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని రేంజిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది ఏండ్ల క్రితం సుమారు 30 అడుగుల పొడ‌వున్న అన‌కొండ అమెజాన్ అడ‌వుల్లో క‌నిపించి హాట్ టాపిక్ గా మారింది. కానీ 2012లో టైట‌నో బోవా అనే అన‌కొండ అస్థిపంజ‌రం 42 అడుగులు ఉండి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ‌కానీ 150 అడుగుల పొడ‌వైన పాములు సైతం ఈ అడ‌వుల్లో ఉన్నాయంటారు అక్క‌డి స్థానిక తెగ‌ల ప్ర‌జ‌లు. పెర్సీ పాసేట్ అనే బ్రిట‌న్ ప‌రిశోధ‌కుడు సైతం అమెజాన్ అడ‌వుల్లోని అన‌కొండ‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేసి అత్యంత పొడ‌వైన పొడ‌వులు ఇక్క‌డ ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. అదే ప‌రిశోధ‌న కొన‌సాగిస్తూ ఆయ‌న కుమారుడు, త‌న మిత్రుడితో పాటు పెర్సీ సైతం అదృశ్య‌మ‌య్యారు.

అమెజాన్ అడ‌వుల్లో వృక్షాలు, జంతువులే కాదు.. మాన‌వులు కూడా ఉన్నారు. అయితే కార‌డ‌వి మ‌ధ్య‌లో కొన్ని ర‌కాల సంచార జాతులున్న‌ట్లు కొన్ని ఆధారాలు ల‌భించాయి. వీరికి బ‌య‌టి ప్ర‌పంచంలో ఎలాంటి సంబంధం ఉండ‌దు. అడ‌వి మీదే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు. వారి భాష‌, వేశం అన్నీ.. నాటి ఆదిమాన‌వుల లాగే ఉన్నాయి. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం బ్రెజిల్-పెరూ స‌మీపంలోని అమెజాన్ అడ‌వి మీదుగా ఓ ట్రైనీ విమానం వెళ్లిన‌ప్పుడు ఈ సంచార జాతుల విష‌యాలు బ‌య‌ట‌కు తెలిశాయి. విమానంలో వెళ్తున్న పైలెట్ ఈ ఫోటోల‌ను తీసి ప్ర‌పంచానికి ప‌రిచయం చేశాడు. ఈ ఫోటోల్లో కొంత మేర‌కు వారి వేషం, వ్య‌వ‌హారం గురించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అమెజాన్ అడ‌విలో ఏలియ‌న్స్ సంచారం మ‌రో ర‌హ‌స్యం. ఈ అడ‌విలో ఏదో తెలియ‌ని వింత మ‌నుషుల సంచారం ఉంద‌నే విష‌యాన్ని అట‌వీ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల విశ్వాసం. 2016లో ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. స‌రిగ్గా కొద్ది రోజుల త‌ర్వాత బ్రిటిష్ టూరిస్టు మైఖేల్ బోలెన్ తీసిన ఓ ఫోటో ఇందుకు మ‌రింత బ‌లం చేకూర్చింది. ఈ ఫోటో వెన‌కాల ఓ ఏలియ‌న్ రూపం, మ‌రో కాంతిని వెద‌జల్లే ఫ్లైయింగ్ సాస‌ర్ రూపం క‌నిపించింది. ఈ ఫోటో, స్థానికుల స‌మాచారం ఆధారంగా బ్రెజిల్ స‌ర్కారు ఏలియ‌న్ల‌పై ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ఆప‌రేష‌న్ క్రిటో పేరుతో చేప‌ట్టిన ఈ ప‌రిశోధ‌న‌లో ఏమీ తేల‌లేదు.

అమెజాన్ ర‌హ‌స్యాల్లో పెర్సీ పాసెట్ అదృశ్యం కీల‌క‌మైన‌ది. బ్రెజిల్ రాజ‌ధానిలోని లైబ్రరీలో పాసెట్ కు ఓ ప‌రిశోధ‌న గ్రంథం ల‌భించింది. గ్రీస్ న‌గ‌రం లాంటింది అమెజాన్ అడ‌వుల్లో ఉన్న‌ట్లు అందులో రాసి ఉంది. వెండి గోడ‌లు.. బంగాలు క‌ప్పుల‌తో ఈ లా సిటీ నిర్మించి ఉన్న‌ట్లు అందులో పేర్కొన్నారు. ఇది వాస్త‌వం అని న‌మ్మిన ఆయ‌న‌..1925లో త‌ప ప‌రిశోధ‌న మొద‌లు పెట్టారు. త‌న కుమారుడు, మిత్రుడితో క‌లిసి అమెజాన్ అడ‌వుల్లో త‌న ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టారు. కొద్ది రోజుల త‌ర్వాత త‌న భార్య‌కు ఓ లేఖ రాశాడు. లా సిటీకి చేరువైన‌ట్లు వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే వీరంతా క‌నిపించ‌కుండా పోయారు. వీరిని వెతికేందుకు బ్రెజిల్ స‌ర్కారు సైన్యాన్ని రంగంలోకి దించింది. క‌మెండోల‌తో ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టినా ఫ‌లితం లేక‌పోయింది. ఆ ముగ్గురు క‌నిపించ‌లేదు స‌రిక‌దా.. ఈ ఆప‌రేష‌న్ లో పాల్గొన్న మ‌రో 100 మంది సైనికులు సైతం అదృశ్యం అయ్యారు. ఇంత‌కీ వాళ్లు ఏమ‌య్యారు అనేది ఇప్ప‌టికీ ర‌హ‌స్యంగా ఉన్న‌ది.

మొత్తంగా ఎన్నో ర‌హ‌స్యాల‌ను త‌న‌లో దాచుకుని ఉంది అమెజాన్ మ‌హార‌ణ్యం. ఇందులోని ఎన్నో ర‌హ‌స్యాలు మా‌న‌వుల‌కే పెను స‌వాల్వి సురుతున్నాయి. వాటిని భ‌విష్య‌త్తు లోనైనా ఛేదిస్తారో.. లేదంటే.. అదంతా ప్ర‌కృతి మ‌హిమ అంటూ వ‌దిలేస్తారో స‌మాధానం చెప్పాల్సింది.. కేవ‌లం కాలం మాత్ర‌మే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles