అల్లు అర్జున్ అభిమానులకు గుండెలు ఆగిపోయ్యే వార్త చెప్పిన డైరెక్టర్ సుకుమార్

ఈ ఏడాది తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున సినిమాలలో ఒక్కటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, రంగస్థలం వంటి సెన్సషనల్ హిట్ తర్వాత సుకుమార్ మరియు అలా వైకుంఠపురం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు సాధారణంగానే భారీగా ఉంటాయి, దానికి తోడు ఈ కాంబినేషన్ లో గతం లో వచ్చిన ఆర్య మరియు ఆర్య 2 సినిమాలు ఆడియో పరంగా కానీ, సినిమాల పరంగా కానీ ఒక్క రేంజ్ లో హిట్ అయ్యింది, ముఖ్యంగా ఆర్య 2 లోని పాటలు ఇప్పటికి మన ప్లే లిస్ట్ ని రూల్ చేస్తూనే ఉంటాయి, సుకుమార్ , అల్లు అర్జున్ మరియు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే డీడ్లీ కాంబినేషన్ అని అందరూ అంటూ ఉంటారు, దానికి ఉదాహరణనే నేడు పుష్ప సినిమా పై జనాల్లో ఉన్న అంచనాలు , ఇక ఈ సినిమా నుండి ఇప్పటి వరుకు విడుదల అయినా పాటలు మరియు టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, యూట్యూబ్ లో వీటికి వచ్చిన వ్యూస్ చూస్తే మైండ్ పోవాల్సిందే.

పుష్ప మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు , హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల చేద్దాం అనుకున్నారు, అల్లు అర్జున్ కి నార్త్ సైడ్ బాగా క్రేజ్ ఉండడం తో ఒక్క ప్రముఖ నిర్మాత ఈ సినిమా హిందీ హక్కుల పైన కన్నేసి అడ్వాన్స్ కూడా పే చేసారు, కానీ ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటి అంటే ఈ సినిమా హిందీ వెర్షన్ ని నేరుగా యూట్యూబ్ లో విడుదల చేస్తారు అనే వార్త అల్లు అర్జున్ అభిమానులలో తీవ్రమైన అసహనం రేపుతోంది, అసలు విషయం ఏమిటి అంటే ముందుగా పుష్ప సినిమా హిందీ హక్కులను ఒక్క ప్రముఖ నిర్మాత కొనుగోలు చెయ్యాలనే ఆలోచన తో మైత్రి మూవీ మాకెర్స్ కి అడ్వాన్స్ ఇచ్చారు, కానీ రోజు రోజుకి పుష్ప మూవీ పై పెరుగుతన్న ఆదరణ చూసి మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఫాన్సీ ఆఫర్స్ తో పుష్ప మూవీ మాకెర్స్ ముందుకి వచ్చారు, కానీ వాళ్ళు మొదట అడ్వాన్స్ తీసుకున్న వారికి నో చెప్పలేక, వచ్చిన ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి ఎస్ చెప్పలేక తీవ్రమైన సందిగ్ధం లో పడ్డారు, దీనితో భవిష్యత్తులో దీని వల్ల జరగబొయ్యే వివాదం ని దృష్టిలో పెట్టుకొని ముందు అడ్వాన్స్ పే చేసిన ప్రొడ్యూసర్ కి తిరిగి ఇచ్చేసి, డైరెక్టుగా థియేటర్స్ లో కాకుండా నేరుగా హిందీ వెర్షన్ ని యూట్యూబ్ లో దించేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అట నిర్మాతలు.

ప్రస్తుతం అయితే ఇది చర్చల దశలోనే ఉన్నది,డిసెంబర్ 17 వ తారీఖున ప్రపాంచా వ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న పూష సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు, మరో విషయం ఏమిటి అంటే ఈ ఏడాది వకీల్ సాబ్ సీనియా తర్వాత విడుదల అవ్వబోతున్న ఏకైక పెద్ద సినిమా ఇదే, దానికి తోడు మంచి క్రేజ్ కూడా ఈ సినిమా పై ఏర్పడడం తో ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోతాయి అని ట్రేడ్ వర్గాలు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నాయి, ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే , ఇక పుష్ప పార్ట్ 2 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది, పుష్ప పార్ట్ 1 లో కమెడియన్ సునీల్ విలన్ గా నటిస్తుండగా, పుష్ప పార్ట్ 2 లో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు, వీళ్లకిదారి పాత్రలు సినిమాకి హైలైట్ గా ఉండబోతుంది అట.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles