రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల ఐయన్పటి నుండి సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి, హీరో ని నెగేటివ్స్ షేడ్స్ లో చూపించడం లేదంటే హీరో కి ఏదైనా లోపం ఉన్నటు చూపించడం సుకుమార్ స్టైల్..

ఆలా వైకుంఠపురంలో సినిమా తర్వాత అల్లు అర్జున్ తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి, ఈ సినిమా లో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తూ ఉండగా ముత్తమశెట్టి మీడియా తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు, ఈ సినిమా కి డీస్పీ మ్యూజిక్ ని అందిస్తున్నాడు, అయితే ఈ సినిమా ని కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.. అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే మొదటి pan ఇండియా సినిమా కావడం విశేషం..

ఖమ్మం జిల్లాలోని సత్యనారాయణ పురం లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది, అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్ వస్తు ఉండగా అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ కి ఆక్సిడెంట్ ఇయింది, ఆక్సిడెంట్ అయ్యే సమయానికి అల్లు అర్జున్ అందులో లేడు, తన మేకప్ టీం మొత్తం కూడా వ్యాన్ లో హైదరాబాద్ వాస్తు ఉన్నారు, అయితే ఈ ఆక్సిడెంట్ లో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు..

అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ ఖరీదు ఏడూ కోట్ల వరకు ఉంటుంది, ఈ క్యారీ వ్యాన్ అంటే అల్లు అర్జున్ కి ఎంతో ఇష్టం అంట, చూడడానికి బస్సు ల కనిపించిన కూడా లోపల మాత్రం టీవీ, సోఫా, బెడ్, వాష్రూమ్ ఇలా అని సౌకర్యాలు ఇందులో ఉన్నాయ్, ఈ బస్సు పైన AA అని రాసి ఉండడం తో ఇది అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ అని గుర్తుపట్టి అక్కడి ప్రజలు ఆక్సిడెంట్ అయన వ్యాన్ దెగ్గరికి వచ్చి పోలీసులకి సమాచారం అందించారు, ఇక ఈ ఆక్సిడెంట్ కి గల కారణాలు పోలీసులు పరిశీలిస్తున్నారు..
