అల్లూరి సీత రామ రాజు జీవిత చరిత్ర

చిమ్మ చీకట్లో సూర్య కిరణం.. భరతమాత చేతిలో స్వర్ణ ఖడ్గం… చెట్లకు యుద్ధం నేర్పిన వీరుడు.. తెలుగు వారికి దేవుడు.. మన్యం పులి.. అల్లూరి సీతారామరాజు..

అనగారి పోతున్న జీవితం లో వెలుగు నింపాడు… అలిసిన బతుకులకు అసలు బ్రతుకు నేర్పాడు… తెల్ల దొరలకి సింహాస్వప్నం గా మారాడు. తెల్లదోరల పాలనలో మగ్గిపోతూ, వారి కి వెట్టి చాకిరీ చెయ్యడమే భారతీయుల పరమావది అని, ఇక జీవితం లో మాకు స్వేచ్ఛ లేదు అనుకున్న మన్యం ప్రజలకు అల్లూరి వెలిగించిన తిరుగుబాటు  అనే దీపం కొత్త ఆశలు పుట్టించింది.1897 జులై 4 న బీమునిపట్నం లో జన్మించాడు. తండ్రి పేరు వెంకటరామరాజు తల్లి సూర్యనారాణమ్మ. సీతరామరాజు అసలు పేరు రామరాజు, ఆయనకు సోదరి ఒక సోదరుడు ఉన్నారు.

రామరాజు ను ప్రేమించిన అమ్మాయి పేరు సీత . సంసార ఛట్రం లో ఇరుకొని ఆధ్యాత్మికతకు దూరం అవడం ఇష్టం లేని రామరాజు ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఆమె ఆ మనస్థాపం తో చనిపోయింది అని అందుకే రామరాజు ఆమె పేరు ను కలుపుకొని సీతారామరాజు అయ్యాడని అక్కడి ప్రజల్లో ఉన్న ఒక్క కధనం.

ఇక అల్లూరి సీతరామరాజు బాల్యం చాలా కష్టం గానే గడిచింది. చిన్నపటి నుండే ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉన్న సీత రామరాజు నీలాద్రి రాజు గారి వద్ద హటయోగం, జ్యోతిష్యం నేర్చున్నాడు. సూరి అబ్బయ శాస్త్రి దగ్గర సంస్కృతం బాషను నేర్చుకొని పురాణాలూ ఇతిహాసలను పారాయణ చేసాడు. వృత్తి రీత్యా ఫోటో గ్రాఫర్ అయినా తండ్రి సూర్యనారాయణ రాజు రాజమండ్రి కి  కుటుంబం తో సహా తరలి వెళ్ళాడు.అయితే సీతరామరాజు 6వ తరగతిలో ఉండగా తండ్రి సూర్యనారాయణరాజు కలరతో మరణించాడు. ఆ  తర్వాత పినతండ్రి రామకృష్ణరాజు ఆదరణ తో రామరాజు పెరిగాడు. కానీ ఎప్పుడు దైవ ధ్యానం లో నే ఉండేవాడు. తుని దగ్గర గోపాల పట్నం దగ్గర ఉన్న రామలింగేశ్వర ఆలయం లో తపస్సు చేసేవాడు. తన స్నేహితుడు పెరిచర్లరాజు తో కొత్త ప్రాంతాలను అడవులను సందర్శించే వాడు .అలా మన్యం అల్లూరికి పరిచయం ఇయింది.

అల్లూరి అన్వేషణ ఉత్తర భారతం వైపు నడిపించింది. మొదట విప్లవ కీల్లా బెంగాల్ వైపు అడుగు వేసిన అల్లూరి అక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ కి అతిధి గా ఉంటూ లక్నో కాంగ్రెస్ సభ కి హాజరు అయ్యారు. అలానే కాశి బద్రినాథ్ కేదారనాథ్ సందర్శించి బ్రహ్మ కపాలం లో సన్యాస దీక్షను తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణదేవపేట దారకొండ దగ్గర తపస్సులో కూర్చున్నారు.  అపుడు చిటికల భాస్కరుడు అని వ్యక్తి రామరాజు గారి తల్లికి అతని జాడను చెప్పడం తో ఆమె కూడా రామరాజు దగ్గరికి వచ్చి ఉండిపోయింది. అక్కడి గ్రామస్థులు అందరూ సీత రామరాజుకు కృష్ణదేవపేట తాండవ నది వద్ద కూటిరం నిర్మించి ఇచ్చారు. సీత రామరాజు ములిక వైద్యం, ముహుర్తాలు పెట్టడం, పురాణాలూ వివరించడం వంటివి చేసేవారు. మధ్యానికి బానిస అయినా చాలా మందిని మార్చి వారి కుటుంబాల్లో వెలుగు నింపాడు.

అదే సమయం లో బ్రిటీష్ ప్రభుత్వం పోడువ్యవసాయాన్ని నిషేదించింది. మన్యం లో చాలా మంది పోడు వ్యవసాయాన్ని తమ ప్రధాన జీవనదారం గా చేసుకొని బ్రతికేవారు. వారికీ ఇపుడు చేసుకోడానికి పని లేకుండా పోయింది. అదే సమయం లో బ్రిటీష్ వారు మొదలు పెట్టిన రైలు మార్గం విస్తరణ రోడ్డు పనులకి తప్పక తక్కువ కూలి కి వెళ్ళవలసి వచ్చేది. తిండి దోరకని రోజు ఆకలిని చంపడానికి పిల్లలకు చింతాంబలి ని పొసేవారు దాని వల్ల చాలా మంది అల్సర్ సమస్యతో ఇబ్బంది పడేవారు. ఇవన్నీ చుసిన అల్లూరికి ఇది అన్యాయం గా తోచింది. లెక్కలు బయటకు తెస్తే రాసే కూలి కి ఇచ్చే కూలీకి తేడాలు బయట పడ్డాయి. కష్టం ఒకరిది దాని ఫలితం ఇంకోరిది ,చదువు రాని అమాయకపు అడవిబిడ్డలని మోసంచేసే గుత్తేదార్ లపై అల్లూరి కన్నెర్రా చేసాడు.

అప్పటికి బ్రిటీష్ వారిమీద తిరుగుబాటు చేసిన వీరయ్య దొర లాగరాయ పితురి లో పట్టుబడి  జైలు లో  ఉన్నారు. పితురి అంటే “తిరుగుబాటు ” “దాడి ” అని అర్ధం. బ్రిటీష్ దొరల మోసలను బయట పెట్టిన అల్లూరి నాయకత్వం లో గాము గంటం దొర, గాము మల్లు దొర, కంకిపాటి ఎండుపటాల్, అగ్గిరాజు వంటి వారు ఒకచోట చేరారు. మొత్తం గా 30,40 గ్రామాలకు అల్లూరి సీతరామరాజు నాయకుడు అయ్యాడు. చింతపల్లి తహషిల్దార్ బస్టియన్ నర్సిపట్నం నుండి లంబాసింగి కి వేసే రోడ్ కాంట్రాక్టు లో కూలీలకు సరిగ్గా కూలి డబ్బులు ఇవ్వకపోవడం తో బస్టియన్ ను నీలదీసాడు. దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక బస్టియన్ పై అధికారులకు ఫిర్యాదు చేసాడు, వారు రామరాజుని కృష్ణదేవపట్నం నుండి దూరం గా నర్సీపట్నం పోలవరం వంటి ప్రాంతాల్లో అధికారుల పర్యవేశక్షణలో ఉండేలా ఆర్డర్స్ పంపారు. కాని ఫజి ఉల్లా ఖాన్ అని డిప్యూటీ తహసీల్దార్ సాయం తో అక్కడ నుండి బయటపడి మళ్ళీ మన్యానికి వచ్చాడు.

ఇక తన తిరుగుబాటు తీవ్రతరం చెయ్యాలని తన తల్లి ని నర్సాపురం కి పంపి అసలు కార్యాచరణ ను మొదలు పెట్టారు. మొత్తం 150 మంది తో దళం ను ఏర్పాటు చేసి 1922 ఆగష్టు 22 న మహా రుద్రాభిషేకం చేసి మొదట చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ పోలీసులను బయటకు పంపి అక్కడ ఆయుధలను తీస్కొని దొంగతనం చేసాడు అని నింద పడకుండా దొరలాగా తీసుకున్న అని అక్కడ రిజిస్టర్ లో అన్ని వివరాలు రాసి మరి తీసుకుపోయేవాడు. అలా ఆగస్టు 23 న కృష్ణదేవపట్నం 24 న రాజా వేమంగి లో ఆయుధాలు తీసుకున్నారు. రాజావేమంగిలో బందిగా ఉన్న వీరయ్యాదొర ను విడిపించారు. మన్యం లో ఆడవాళ్లను పేదలను  హింసిస్తున్న కాబర్ట్ హైటర్ అనే భద్రత అధికారులను గేరిళ్ల పద్దతిలో దాడి చేసి చంపేశారు. అప్పటి నుండి  మన్యం లోనే కాకా బయట ప్రజల్లో కూడా అల్లూరి కి ఆదరణ పెరిగింది రంపచోడవరం లో రామరాజు వస్తున్నాడు అని వేల మంది ప్రజలు పోలీస్ స్టేషన్ వద్ద నిలబడి విప్లవ వీరుడికి నీరాజనాలు పలికారు.

అక్టోబర్ 15 న అడ్డతీగల లో చెప్పి మరి దాడి చేసాడు అల్లూరి. ఇక డిసెంబర్ 06 న జాన్ చర్సీ  సైన్యం తో రామరాజు దలానికి ముఖముకి యుద్ధమే జరిగింది అందులో సీతరామరాజు వర్గానికి చెందిన 4 చనిపోయారు. తిరిగి మళ్ళీ అదేరోజు రాత్రి అల్లూరి స్థావరం మీద దాడి చేసి 8 మందిని చంపారు. ఇక అల్లూరి పని అయిపోయింది అని అనుకున్నారు అంతా. కానీ 1923 ఏప్రిల్ 17 న తన అనుచరులతో మళ్ళీ అన్నవరం లో ప్రత్యక్షం అయ్యాడు అల్లూరి. అక్కడ విలేకరులతో కూడా మాట్లాడాడు. తర్వాత అన్నవరం దేవాలయాన్ని దర్శించుకొని శంఖవరం వెళ్ళాడు అక్కడ అల్లూరికి సాధరస్వాగతం పలికిన ప్రజలు అల్లూరికి హరతులు పట్టి పూజలుచేశారా . ఇది తెలిసి శంకవరం కలెక్టర్ అక్కడి ప్రజలకు 4000 రూపాయల జరిమానా విధించాడు.

అపుడు అల్లూరి నేను శంకవరం లోనే ఉన్నాను దమ్ముంటే రావాలని ఆ కలక్టర్ కి మిరపకాయ టప పంపాడు. కానీ ఆ కలెక్టర్ రాలేదు.1923 జూన్ నుండి దాడులు ఆయుధలా దోపిడీ లతో మన్యం లోని బ్రిటీష్ వారికి గుండెల మీద  బండ గా మారి ఎపుడు అల్లూరి దాడి చేస్తాడో తెలియక చాలామంది పోలీస్ లు ఉద్యోగాలు వదిలి పారిపోయారు.1923 సెప్టెంబర్ లో మద్యం మత్తులో మల్లు దొర పోలీసులకు దొరికి పోయాడు. అతన్ని అరెస్ట్ చేసి అండమాన్ కి పపించారు. అక్టోబర్ 26 గూడెం మీద దాడి జరిగింది. అల్లూరిదెబ్బకు బ్రిటీష్ ప్రభుత్వం లూథరఫోర్ట్ ను 1924 ఏప్రిల్ 17 న ప్రత్యేకంగా అల్లూరిని చేపడానికే మన్యానికి పంపించారు. అప్పట్లో మొత్తం బ్రిటీష్ వ్యవస్థనే భయబ్రాంతులకు గురించేసిన ఘనత అల్లూరిది. ఇక రావడంతోనే రూథర్ కృష్ణదేవ పేట లో ఒక మీటింగ్ పెట్టి తెల్లవారే కళ్ళ అల్లూరిని అప్పగించకపోతే గ్రామాలకి గ్రామాలను కాల్చేస్తా అని బెదిరించాడు. ముంప గ్రామ మునసాబును కూడా బెదిరించాడు. మీరు మాట వినకపోతే మళ్ళీ ఇంకో జాలియన్వాలాభాగ్ మన్యం లో చూస్తారు అని హెచ్చరించాడు, పట్టిస్తే 10000 రూపాయల నాజరాన అల్లూరి మీద ఉంది. దాంతో ముంప మునసాబును ను అల్లూరి కలిసి నావల్ల మాములు ప్రజలకు ఏమి అవ్వొద్దని. తనను అప్పగించమని చెప్పాడు కానీ ఆ మునసాబు అంగీకరించలేదు. ఇక లాభం లేదు అనుకోని మే 7 1924 లో పశువుల కాపరి ద్వారా బ్రిటిష్ పోలీస్ లకి ఈ విషయం అందేలా చేసాడు అల్లూరి సీతారామరాజు.

సమాచారం అందడమే ఆలస్యం సైన్యం తో తరలివచిన రూథర్ ఫోర్డ్ ఒక్కడే సంద్యావందనం చేస్తున్న అల్లూరిసీతారామరాజు గుడాల అనే అధికారి ద్వారా కల్పించి చంపారు. చనిపోయిన అల్లూరి సీతరామరాజు ఫోటో తీసి దహనం చేసి ఆస్థికలు నదిలో కలిపేశారు. 26 ఏళ్ళ వయస్సులో భారతమాత నుదిటి సింధూరం ల వెలుగుతూ అమరుడయ్యాడు సీతారామరాజు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles