ఆడవారు ధరించే నగల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

ప్రాచీన కాలం నుండి చూస్తున్నట్లైతే స్త్రీలకు అత్యంత ప్రీతికరమైనవి- ఆభరణాలు. పూర్వకాలంలో వారం రోజుల పాటు రోజుకి ఒకటి చొప్పున ఆదివారం- కెంపులు, సోమవారం- ముత్యాలు, మంగళవారం- పగడాలు, బుధవారం- పచ్చలు, గురువారం- కనక పుష్యరాగం, శుక్రవారం- వజ్రాలు, శనివారం- ఇంద్ర నీలమణులు అని ఏడు రకాల రత్నాలతో పొదిగిన నగలను అనాదికాలం నుండి ధరిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది వద్ద మనం చూస్తుంటాం. పూర్వం స్త్రీలు ప్రతిరోజూ నిండుగా ఆభరణాలను అలంకరించుకొని తయారయ్యేవారు. రోజురోజుకీ వీరి సంఖ్య కనుమరుగవుతుంది. ఇప్పుడు చాలా మంది సన్నగా, నాజూకుగా ఉండే నగలను వాడుతున్నారు. స్త్రీలు ధరించే ఆభరణాలు ఎంత ఉపయోగకరమైనవో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం కొన్ని రకాల ఆభరణాలు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.  

ముందుగా మనం వడ్డాణం గురించి తెలుసుకుందాం:-
శరీర ఆకృతిని తెలియజేసేందుకు నడుముకు ధరించే ఒక ఆభరణం- వడ్డాణం. దీనిని నడుమ గొలుసు లేదా వడ్డాణం అంటారు. ఇవి తరచుగా బంగారం లేదా వెండితో తయారుచేయబడతాయి. వడ్డాణం, భారతదేశంలో 4000 సంవత్సారాల నుండి అంతకంటే ముందు నుండి వాడుకలో ఉంది. చారిత్రాత్మకంగా తూర్పుదేశాలలో ప్రత్యేకంగా భారతదేశంలో పురుషులు, స్త్రీలు ఆభరణాలుగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా సంపదను చూపించడానికి ఈ వడ్డాణాన్ని ధరిస్తున్నారు.


భారతదేశంలో మహిళల్లో వడ్డాణాలు ధరించడం సాధారణం. కొన్ని ప్రాంతాలలో పురుషులు కూడా ధరించేవారు. దక్షిణ భారతదేశంలో రాష్ట్రమైన తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డ వడ్డాణాన్ని ధరించే ఆనవాయితీని అనాదికాలంలో ఉండేది. హిందూశాస్త్ర ప్రకారం శిశువు పుట్టిన 28వ రోజున వడ్డాణం ధరించమని శాస్త్రం చెబుతుంది. భారతదేశంలో మరో రాష్ట్రమైన కేరళ వారు కూడా ఇదే పద్దతిని పాటించేవారు. లక్షద్వీప్లో పురుషులు, స్త్రీలు ఇద్దరూ  వెండి మొలత్రాడును ధరిస్తారు. దోడియా. కధోడియా, కాట్కారి పురుషులు నడుము చుట్టూ ఆభరణాలను ధరిస్తారు. ఇప్పుడు దీని ప్రయోజనాలను గనుక చూసినట్లయితే గర్భం లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా రక్త సరఫరా సజావుగా అయ్యేలా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితాన్ని ఇస్తుందని ఆనాటి పురాణాలు చెబుతున్నాయి. బంగారాన్ని ఏ రూపంలో ధరించినా ఏంతో కంత శక్తి శరీరానికి అందుతుందని తాళపత్ర గ్రంధాలు కూడా చెబుతున్నాయి. పూర్వం రాజులు, పలుచటి బంగారు రేకులు చేయించుకుని వేడి వేడి అన్నంలో వేసుకొని ఆహారంగా తీసుకునేవారు. అందుకే వెండి పళ్లెం మధ్యలో బంగారు పువ్వును వేయిస్తారు. ఇప్పటికీ ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారు. కాని ఇప్పుడు అందంగా కనిపించడానికి మాత్రమే వాడుతున్నారు.      

రెండవది ముక్కెర:-
ముక్కెర ఒక ఆకర్షణీయమైన ఆభరణం అని మాత్రమే మనకు తెలుసు. కానీ దాని వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముక్కెరను ధరించడం వలన మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది.
2. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం అనేది ధ్యానంలో ఒక భాగం.
3. ఆయుర్వేదంలో ఏం చెప్పబడిందంటే ముక్కు ఎడమ భాగం, స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలలో అనుసందానం చేయబడి ఉంటుంది. దీనివలన వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది.
4. ఎడమవైపు ముక్కెరను కలిగి ఉంటే, బిడ్డను ప్రసవించేటప్పుడు కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. అంతేకాకుండా ప్రసవాన్ని సులభతరం కూడా చేస్తుందని గ్రామాల్లో సాధారణ నమ్మకం.
5. ఆయుర్వేద గ్రంధాలలో ఎడమవైపు ముక్కెరను ధరించడం వల్ల ఋతుక్రమంలో కలిగే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని ప్రస్తావించబడింది.
6. ముక్కెరను ధరించడానికి ఒక మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. పార్వతీ దేవిని గౌరవించే మార్గంగా చాలా మంది మహిళలు పెళ్ళికి ముందు ముక్కు కుట్టించుకుంటారు.
7. ముక్కెర గురించి మరో గ్రంధంలో- దీనిని ధరించిన మహిళలు వశీకరన్ లేదా ఇతరులచే నియంత్రించబడటం లేదా మోహింపబడటం నుండి విముక్తి పొందుతారని సూచించబడింది.

మూడవది కాలి మెట్లు:
కాలి మెట్లు, పెళ్ళైన స్త్రీలను సూచిస్తాయి. కానీ వీటి వలన చాలా  ప్రయోజనాలున్నాయి. గర్భాశయంలో ఉన్న నరాలకు కాలి వేళ్ళలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. అందువల్ల పెళ్ళైన స్త్రీలు మెట్టెలను ధరించినట్లైతే ఋతుచక్రం సజావుగా జరిగి గర్భం ధరించడంలో సాయపడతాయని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి.

చంద్రవంక :-      
శిరస్సు పై మధ్యభాగంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుండి మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రమ్మరంద్రం నుండి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ భాగాన్ని చంద్రవంకతో కప్పి ఉంచుతారు.

కంఠాభరణాలు:
మెడకు ధరించే హారాలను కంఠాభరణాలు అంటారు. వీటిని అలంకారం కోసం స్త్రీలు ధరిస్తుంటారు. కాకపొతే వీటివలన కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటంటే – గుండెల మీద ధరించిన బంగారం గుండెకి సంబందించిన వ్యాధులను అరికడుతుందని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles