ఆ హిట్ చిత్రాన్ని నాగార్జున ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రయత్నాల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ కోసం ..ఒకే ఒక్క హిట్ కోసం అహర్నిశలు శ్రమిస్తారు హీరోలు. ఎంట్రీ కి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా కీలకమే. కానీ నిలదొక్కు కోవాలంటే మాత్రం హార్డ్ వర్క్, లక్ రెండూ ఉండాలి. ఒక్క హిట్ వస్తె అంచనాలు మారుతాయి. ఒక్క ఛాన్స్ కోసం అహర్నిశలు శ్రమించి న హీరోలు తాము చేయబోయే తరువాత సినిమాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. స్టోరీ లైన్ దగ్గరనుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, మిగిలిన అన్ని విభాగాలలో నిపుణులైన వారిని పెట్టుకుంటారు. జయాప జయాలు ఎలా ఉన్నా సరే తాము తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఇలా.. వివిధ కారణాలతో రిజెక్ట్ చేసిన సినిమాలు తరువాత ఆయా సినిమాలు వేరే హీరోలతో విడుదలై తిరుగులేని హిట్స్ గా నిలిచాయి. మరి..టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున రిజెక్ట్ చేసిన చిత్రాలు..ఆ తరువాత ఆ చిత్రాలు సాధించిన విజయాలపై ఓ లుక్కేద్దాం రండి.

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రేక్షకులకు ఎన్నో చిరస్మరనీయమయిన విజయాలు అందించారు. తొలి చిత్రం విక్రమ్ తోనే శత దినోత్సవ చిత్రాన్ని అందించి అక్కినేని అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు. భారతీయ సినీ పరిశ్రమలో తిరుగులేని క్లాసిక్ చిత్రాలు శివ, గీతాంజలి, అన్నమయ్య లాంటి చిత్రాలు అందించి ఎలాంటి పాత్రలో అయినా సరే ఇట్టే పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కొత్త టేలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున తన కెరీర్ లో చాలా చిత్రాలకు కొత్త దర్శకులే కీలక భూమిక పోషించారు. ఇప్పటికీ కూడా వన్నె తరగని చరీస్మాతో అత్యధిక లేడీస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోగా ఈ జనరేషన్ హీరోతో పోటీ పడుతున్నారoటే అతిశయోక్తి లేదు.కథల విషయంలో గానీ, సాంకేతికంగా వస్తున్న మార్పులను అడాప్ట్ చేసుకోవడంలో కానీ, ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో గాని నాగ్ కు సాటేవ్వరూ రారు. మరి అంతటి బాక్సాఫీస్ క్యాలెక్యులేశన్స్ తెలిసిన నాగార్జున సైతం అనుకోకుండా కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు చేజేతులా రిజెక్ట్ చెయ్యాల్సి వచ్చింది. అలా వదుకున్న బ్లాక్ బస్టర్ మూవీ బద్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన బద్రి చిత్రానికి డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

తెలుగు సినిమాల్లో హీరో పాత్రలకు సరికొత్త ఫార్మాట్ క్రియేట్ చేసిన పూరీ జగన్నాథ్ తొలి చిత్రం బద్రి.అప్పటి వరకు మూస ధోరణితో వెళ్తున్న ప్రేమ కథలకు చెక్ పెట్టీ సరికొత్త జానర్ లో బద్రి చిత్రాన్ని రూపొందించారు. ఈ బద్రి మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి వైవిధ్యమైన ప్రేమ కథను కింగ్ నాగార్జున కోసమే రాసుకున్నారట పూరి. మరి..ఇంతటి డిఫరెంట్ స్టోరీ మన కింగ్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే అప్పట్లో నాగ్ వరుస సినిమాలతో యమ జోరు మీధున్నారు. అందుకోసమే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారట.
సో..ఆ తరువాత నాగ్, పూరి కాంబోలో శివమణి, సూపర్ చిత్రాలు వచ్చి అలరించిన విషయం తెలిసిందే.

ఇక..కింగ్ నాగ్ వదులుకున్న రెండవ చిత్రం కలిసి వుందాం రా మూవీ. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యువతను విపరీతంగా ఉర్రూతలూగించింది.
ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2000 లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటైంటెనర్ లో విక్టరీ వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ఉత్తమ తెలుగు చిత్రం గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అలాగే వెంకటేష్ కు ఉత్తమ నటుడుగా నంది బహుమతి వరించింది. అయితే. . ఈ చిత్రాన్నిధర్శకుడు ఉదయ్ శంకర్ నాగార్జునతో తీద్దామని అనుకున్నారట. అప్పటికే నాగార్జున ఆవిడే మా ఆవిడ, చంద్రలేఖ, సీతారామ రాజు లాంటి ఫ్యామిలీ జానర్ చిత్రాల్లో నటించడం వల్ల రొటీన్ అయిపోతుందని ఈ కలిసి ఉందాం రా చిత్రాన్ని స్మూత్ గా రిజెక్ట్ చేశారట.

ఇక.. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారితో నాగార్జున కలిసి నటించాలనుకున్న చిత్రం మెగా స్టార్ చేతికి వెళ్ళింది. ఆ మూవీ యే మెకానిక్ అల్లుడు. ఏయన్నార్ , మెగాస్టార్ కాంబోలో 1993 లో వచ్చిన ఈ మూవీకి బి.గోపాల్ డైరెక్షన్ చేశారు.ఈ మూవీని ఫస్ట్ అక్కినేని నాగార్జున, నాగేశ్వరావు గారి కాంబినేషన్ అనుకున్నారట.కానీ ..అప్పటికే ఈ తండ్రి కొడుకుల కాంబినేషన్ లో చాలా మూవీస్ రావడంతో నాగార్జునే స్వయంగా చిరంజీవిని కలిసి మూవీ చెయ్యమని అడగడం జరిగింది. సో..ఈ విధంగా మెకానిక్ అల్లుడు చిత్రాన్ని నాగార్జున వదులుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

ఇక.. స్టార్ డైరెక్టర్ మణిరత్నం చిత్రాన్ని కూడా నాగార్జున వదులుకోవాల్సి రావడానికి కారణం కేవలం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడమే. ఈ మూవీ నే తెలుగు , తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మౌన రాగం.ఈ చిత్రం మణిరత్నం కు స్తార్డం ను తీసుకు వచ్చింది.

1988 సంవత్సర కాలంలో అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ క్రేజ్ తారా స్థాయిలో ఉండేది.వీరిద్దరి కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తీడ్డామనుకున్నరు దర్శకుడు మణిరత్నం.అయితే ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేక హీరో ప్రభు, కార్తీక్ ల వద్దకు వెళ్ళింది. ఆ చిత్రమే బ్లాక్ బస్టర్ ఘర్షణ. 1988 లో వచ్చిన ఈ మూవీ సౌత్లో ఓ ఊపు ఊపేసింది.ఈ ఘర్షణ మూవీ లో అమల ఓ హీరోయిన్గా చేయడం విశేషం. ఒకవేళ ఈ వెంకీ, నాగ్ కాంబో సెట్ అయి ఉంటే ఓ ట్రెండ్ సెట్ ఫిల్మ్ అయ్యేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles