ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్తున్న పునీత్ రాజ్ కుమార్ చివరి cctv వీడియో

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో రాజ్ కుమార్ ఫామిలీ ని అక్కడి ప్రజలు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాళ్ళు వారి మాతృబాష తర్వాత అంతలా అభిమానించేది రాజ్ కుమార్ ఫామిలీనే, దశాబ్దాల నుండి వీళ్ళ కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమాల ద్వారా అలరిస్తూనే , మరోపక్క ప్రజాసేవ కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు, ఆ కుటుంబం నుండి నేటి తరంలో పునీత్ రాజ్ కుమార్ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ వరుకు, యూత్ నుండి ఫామిలీ ఆడియన్స్ వరుకు పునీత్ రాజ్ కుమార్ సినిమాలకు బ్రహ్మరధం పడుతారు,అలాంటి ప్రజాదరణ ఉన్న పునీత్ రాజ్ కుమార్ కి చిన్న గాయం తగిలితేనే ప్రజలు తల్లడిల్లిపోతారు, అలాంటిది ఇక ఆయన ప్రాణాలతో లేకపోతే తట్టుకోగలరా,ఆయన మరణ వార్త విని ముగ్గురు వీరాభిమానులు గుండె ఆగి చనిపోయారు, ఇక ఆయననే నమ్ముకొని బ్రతుకుంటున్న కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి,కేవలం ఒక్క హీరో గా మాత్రమే కాదు, పునీత్ రాజ్ కుమార్ ని వ్యక్తిగతంగా ఆరాధించే వారి సంఖ్య ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు మరియు తమిళ బాషలలో కూడా అసంఖ్యాకంగా ఉంటుంది,అలాంటి మనిషి ఇక మన మధ్య లేరు అనే వార్తనే ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్ తీవ్రంగా చెయ్యడం వల్ల గుండెపోటు వచ్చి చనిపోయాడు అనే విషయం మన అందరికి తెలిసిందే, వాస్తవానికి ఆయన ముందు రోజు రాత్రి నుండే చెస్ట్ లో కాస్త చిన్నపాటు నొప్పులు వచ్చాయి, కానీ అది సాధారణంగా వచ్చిన నొప్పులే అని పెద్దగా పట్టించుకోలేదు, ఇక ఉదయం నిద్ర లేవగానే జిమ్ చాలా తీవ్రంగా చెయ్యడం తో రాత్రి ఉన్న చిన్న నోపి కాస్త పెద్దది అయ్యింది, ఈరోజు సోషల్ మీడియా లో పునీత్ రాజ్ కుమార్ ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్తున్న సీసీటీవీ కెమెరా లోని వీడియో తెగ ప్రచారం అయ్యింది, తనకి గుండెల్లో తీవ్రంగా నొప్పులు రాగానే బిగ్గరగా అరుస్తూ తన అస్సిస్టెంర్ ని పిలిచాడు, పునీత్ పిలవగానే అసిస్టెంట్ పరుగులు తీస్తూ కార్ ని సిద్ధం చేసాడు, ఇక లోపల నుండి నిదానంగా నడుచుకుంటూ పునీత్ రాజ్ కుమార్ కార్ వద్దకు వచ్చాడు, అక్కడ కాసేపు నిల్చొని డ్రైవర్ రాగానే అతనితో కలిసి నడుస్తూ కార్ ఎక్కాడు, కార్ ఎక్కినా కొద్దీ నిమిషాలలోనే గుండె నొప్పి తీవ్రత హఠాత్తుగా పెరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు, ఇక ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకొని వెళ్లిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని డాక్టర్లు నిర్ధారించారు,ఈ విషయం ని వెంటనే చెప్పకుండా, ప్రభుత్వం కర్ణాటక మొత్తం హై అలెర్ట్ సెక్యూరిటీ విధించిన తర్వాత చెప్పారు.

ఇలా కళ్ళ ముందే నిమిషం క్రితం వరుకు ఉన్న వ్యక్తి మరు నిమిషం లో లేకపోవడం ఒక్క పునీత్ రాజ్ కుమార్ అభిమానులనే కాదు, యావత్తు భారతీయులను శోకసంద్రం లోకి నెట్టేసింది, ఇక కన్నడ ప్రజలు అయితే గుండెలు బాదుకుంటూ ఏడ్చారు,ముందు రోజు తన అన్నయ్య తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడిపాడిన వ్యక్తి ఈరోజు అదే అన్నయ్య చేతిలో విగతజీవిలా పడిఉండడం చూసి అభిమానులే తట్టుకోలేకపోతే ఇక పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే,ఒక్క గొప్ప మనిషికి,తానూ సంపాదించిన సంపాదనా లో సింహ భాగం ప్రజా సేవకి ఉపయోగించిన ఒక్క మహాత్ముడికి ఇలాంటి దుస్థితి రావడం చూస్తుంటే దేవుడు అసలు లేదు అనే అనిపిస్తుంది, పునీత్ రాజ్ కుమార్ గారిని మనమే మర్చిపోలేకపోతుంటే, ఇక అయన పేరు ఎత్తితే పులకరించిపొయ్యి ఈలలు చప్పట్లు కొట్టే కోట్లాది మంది అభిమానులకు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టతరమే, ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని కోరుకుంటూ పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles