ఇద్దరు ప్రపంచ సుందరిలతో నటించిన ఏకైక తెలుగు హీరోగా రికార్డ్

విక్టరీ వెంకటేష్‌ కి మంచి పేరు తీసుకువచ్చి.. కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచిన సినిమాల్లో ప్రేమించుకుందాం రా ఒకటి. ఈ చిత్రానికి జయంత్ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్‌ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ద్వారా అంజలి ఝవేరి కథానాయికగా పరిచయం అయ్యింది. ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా నచ్చేసింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. లవ్ సీన్స్ అన్ని కొత్తగా ఉండడంతో… ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అందుకే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వెంకీ – అంజలి ఝవేరి జంట చూడముచ్చటగా ఉండడంతో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యింది.

అయితే.. ఈ సినిమాలో ముందుగా కథానాయికగా ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ని తీసుకోవాలి అనుకున్నారు డైరెక్టర్ జయంత్. ఆయనకు ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీతో మంచి పరిచయం ఉంది. అయితే… ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కి చెబితే.. నో చెప్పారట. కారణం ఏంటంటే.. అప్పటికే ఐశ్వర్యరాయ్ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐశ్వర్యరాయ్ ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రపడింది. దీనిని సెంటిమెంట్ గా తీసుకుని ఐశ్వర్యరాయ్ ని ప్రేమించుకుందాం రా సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు చిత్ర నిర్మాత ఒప్పులేదు.

ఆతర్వాత ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ లో వరుసగా విజయాలు సాధించింది. టాప్ హీరోయిన్ అయ్యింది. అయితే.. నాగార్జున – జయంత్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం రావోయి చందమామ. ఈ సినిమాలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇంతకీ విషయం ఏంటంటే…రావోయి చందమామ సినిమాలో ముంబై హీరోయిన్లలో ఎవరితోనైనా ఐటమ్ సాంగ్ చేయించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ జయంత్ ముంబై వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడ ఐశ్వర్యరాయ్ తారసపడింది. మీ సినిమాలో నాకెందుకు అవకాశం ఇవ్వడం లేదు అని ఐశ్వర్య రాయ్ చనువుగా డైరెక్టర్ జయంత్ ని అడిగిందట.

అప్పుడు జయంత్ రావోయి చందమామ సినిమా చేస్తున్నానని… అందులో ఐటమ్ సాంగ్ గురించి చెప్పారు. వెంటనే.. వేరే ఆలోచన లేకుండా రావోయి చందమామ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించేందుకు ఐశ్వర్యరాయ్అంగీకరించారు. అలా తెలుగు తెరకి ఆ పాట ద్వారా ఐశ్వర్యరాయ్ పరిచయమైంది. ఆతర్వాత మళ్లీ ఐశ్వర్యారాయ్ తెలుగు సినిమాలో నటించలేదు. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ నటించడం ద్వారా నాగార్జునకు ఓ రికార్డ్ వచ్చిందని చెప్పచ్చు. ఇంతకీ ఏంటా రికార్డ్ అంటే… నాగార్జున రక్షకుడు సినిమాలో ప్రపంచ సుందరి సుస్మితాసేన్ తో నటించారు. రావోయి చందమామ సినిమాలో ఐశ్వర్యరాయ్ తో నటించారు.

ఇలా ఇద్దరు ప్రపంచ సుందరిలతో నటించిన ఏకైక తెలుగు హీరోగా నాగార్జున ఓ రికార్డ్ క్రియేట్ చేసారు. ఈవిధంగా ప్రేమించుకుందాం రా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావాల్సిన ఐశ్వర్యారాయ్ రావోయి చందమామ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles