ఈ అలవాట్లు ఉంటే మీరు సక్సెస్ అవ్వరు

గెలవాలన్న సంకల్పం నీకు ఉంటే సరిపోదు, నీ అడుగులు నీ విజయం మార్గం వైపు వేయాలి, అలుపెరగని పోరాటం చేయాలి.. మనలో చాల మంది నాకు మంచి టాలెంట్ ఉంది నేను ఏదైనా చేయగలను ఐనా కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు.. మీకు టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు మీ ఆలోచలని ఆచారణలో పెట్టాలి అప్పుడే విజయం సాధించగలరు.. నేను మీకు ఇపుడు పది unsuccessful పీపుల్ హ్యాబిట్స్ గురించి చెప్తాను, జీవితం లో సక్సెస్ ఐనా వాళ్ళ హ్యాబిట్స్ తెలుసుకొని ఫాలో అవ్వడం మంచిదే కానీ unsuccessful పీపుల్ హ్యాబిట్స్ కూడా తెలుసుకుకోవడం అంత కన్నా ముఖ్యం, ఎందుకంటే ఆ హ్యాబిట్స్ మీకు కూడా ఉంటే అవి తెలుసుకుని మీరు మానేయగలిగితే మీరు ఏదైనా సాధించగలరు..ఇప్పుడు ఆ హబ్బీస్ ఏంటో తెలుసుకుందాం..

No 1
వీళ్ళు ఎవ్వరితో మంచిగా ఉండరు, మనం మనకి పరిచయం ఐన ప్రతీ ఒకరితో మంచిగా ఉంటే మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, మన మైండ్ ప్రశాంతంగా ఉన్నపుడు మనం ఏ పని మీద ఐనా ద్రుష్టి పెట్టొచ్చు, అది కాకుండా ఐన దానికి కానిదానికీ ప్రతీ ఒకరితో గొడవలు పడుతూ వెళ్తుంటే జీవితం లో మీరు ఎప్పటికి మీ పని పైన కాన్సన్ట్రేట్ చేయలేరు.. అందుకే అందరితో మంచిగా ఉండేది మంచిని పంచండి..

No 2 వీళ్ళు ఎవ్వరు ఎం చెప్పిన వినరు, మనం కూడా కొన్ని సందర్భాలాలో ఇలాంటి పరిస్థులని ఎదురుకొనే ఉంటాం, టైం కి తిని టైం కి పడుకో అని మన అమ్మ నాన్న చెప్పినా కూడా మనం అది నెగ్లెక్ట్ చేస్తాం, నిజానికి టైం కి తిని టైం కి పడుకుంటే మన ఆరోగ్యమే కదా బాగుండేది, ఇలానే కొంతమంది మరీ మూర్కంగా ఇలా చేస్తే నువ్వు బాగుపడతావ్ అని చెప్పినప్పటికీ కూడా, వినకుండా వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకుంటూ పోతారు, చివరికి జీవితం లో ఫెయిల్ ఐన తర్వాత బాధపడతారు.. అప్పటికైనా విని వాళ్ళ మెంటాలిటీ మార్చుకుంటే పర్లేదు కానీ ఇంకొందమంది అప్పుడు కూడా వినకుండా అంతే ముర్కగా ప్రవర్తస్థారు అలంటి అలవాటు ఉండడం అసలు మంచిది కాదు..

No 3 వీళ్ళు ప్రతి విషయాన్ని అసహ్యించుకోడం, ఐనా దానికి కానీ దానికి ఊరికే చిరాకు పడే వాళ్ళని మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం, వీరికి జీవితం లో ప్రతిదీ ఒక సమస్యలా కనపడుతుంది, దేనిని ప్రేమించారు, ఎవరిని ప్రేమగా దెగ్గరికి తీసుకోరు, వర్షం పడిన, ఎండకు వెళ్లినా వీరికి చిరాకే వస్తుంది..ఇలా కనుకున్న మీకు ప్రతి విష్యాయానికి చిరాకు పడే అలవాటు ఉంటే మంత్రం ఆ అలవాటుని మార్చుకోండి ఒక పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్ళండి..

NO 4 వీళ్ళు ఎక్కువగా మాట్లాతారు.. మన పెద్దలు చెప్పే మాటలని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, తక్కువగా మాట్లాడు ఎక్కువగా పని చై అనే మాటని మనం ఎన్నో సార్లు వినే ఉంటాం, ఈ కాలం లో చాల మంది సమాజం లో అందరూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలని ఉన్నదీ లేనిదీ అన్ని కలిపి వారి గురించి వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, సోషల్ మీడియా లో చూసినట్లయితే జేబులో 100 రూపాయలు లేని వారు కూడా ఆమ్ స్టార్టింగ్ ఓన్ కంపెనీ అని పెట్టి అందరూ వారికి కాంగ్రాట్యులేషన్స్ అని చెప్తే అది విని మురిసిపోతూ ఉంటారు, నిజానికి మీరు సక్సెస్ అవ్వాలంటే నలుగురు మీ గురించి గొప్పగా అనుకోవాలి అని ఆలోచించకుండా మీ పనిని మీరు సక్రంగా చేయాలి..

NO 5 వీరు ఊరికే డైవర్ట్ అవుతూ ఉంటారు.. మనలో చాల మందికి ఈ అలవాటు ఉంటుంది, ఏదైనా పనిని చేయాలనీ కూర్చుంటాం కానీ ఆపని సగం లో ఉండగానే వేరే ఇంకొక పని మీదకి లేదా సెల్ ఫోన్స్ మీదకి మన మైండ్ ని డైవర్ట్ అవుతూ ఉంటది, మనం సక్సెస్ అవ్వాలని అనుకుంటే మన మైండ్ ని మనం చేసే పని మీదనే పెట్టాలి, ఎన్ని డివెర్సిన్స్ వచ్చిన సరే మన అనుకున్న పని పూర్తి చేసేవరకు అసలు డైవర్ట్ అవ్వొద్దు ఆలా పట్టుదలతో చేస్తేనే జీవితం లో విజయాన్ని సాధించగలం..

NO 6 వీళ్ళు నెగటివ్ మైండ్ పీపుల్ తో ఎక్కువ ఉంటారు.. పది మంది చెడ్డ వారి మధ్యలో ఒక మంచి వాడు ఉంటే ఏదో ఒకరోజు ఆ మంచివాడు కూడా పక్కాగా చెడిపోతాడు.. మీరు కనుక ఎంత కష్టపడుతున్న జీవితం లో ముందుకు వెళ్లలేకపోతే ఒకసారి మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి వారో చూడండి, ఏదైనా పనిని మీరు చేస్తా అంటే అందుకు సహాయం చేసి లేదా వారి సలహాలని అందించే వారు ఉన్నారా లేదా ఇపుడేం చేస్తావ్ లే రేపు చేసుకోవొచ్చు ఇపుడు మనం బయటికి వెళ్లి కాలకేశెపం చేసి వద్దాం అనే వారు ఉన్నారా ..? ఇది మిమల్ని మిరే ప్రశ్నించుకోండి మీరు చేసే పనిలో మిమల్ని సహకరించే వారితో ఉంటే మీరు విజయ మార్గం లో నడుస్తారు లేదా విజయని ఎప్పటికి చూడలేరు..

NO 7 వీళ్ళు పతీ పనిని పోస్ట్ పోనే చేస్తూ ఉంటారు, మనం చిన్నప్ప్పుడు ఒక సామెతని చదువుకునే ఉంటాం కల్ కారే సో ఆజ్ కార్ ఆజ్ కారే సో అభి కార్ .. దీని అర్ధం రేపు చేసే పనిని ఈ రోజే చేయండి ఈ రోజు చేయాలనీ అనుకున్న పనిని ఇప్పుడే చేయండి, మీరు ఏదైనా పనిని చేయాలనీ అనుకుంటే వాటిని వాయిదా వేయడం మానేసి ఇప్పుడే చేయండి ఎందుకంటే మీరు వాయిదాలు వేసుకుంటూ పోతే మీరు చేయాలనీ అనుకున్న పనిని ఎప్పటికి చేయలేరు…

NO 8 వీళ్ళు చాల లేజీ గా ఉంటారు, నిజానికి జీవితం లో గొప్ప విజయాలు సాధించిన ఎవరు కూడా లేజీ గా ఉండడం మీరు చూసి ఉండరు. లేజీ గా ఉండే ఎవ్వరు గొప్ప విజయాల్ని సాధించారు, మనం ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే మళ్లీ కొద్ది సేపు పడుకొని లేద్దాం లే అనుకుంటాం. ఇంట్లో ఏదైనా పని చెప్తే అబ్బా ఇప్పుడు ఓపిక లేదు అంటాం. monday ఆఫీస్ కి వెళ్ళాలి అంటే ఎం వెళ్తాము లే అని అనుకుంటూ ఉంటాం.. కానీ ఫ్రెండ్స్ ఇలా బద్దకంగా ఉండడం వల్ల మీరు జీవితం లో చాల కోల్పోతారు.. మీకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉన్న యూత్ చాల మందికి అంబానీ ఒక ఇన్స్పిరేషన్ కానీ మీకు తెలియని విష్యం ఏంటి అంటే అంబానీ ఒక ఇంటర్వ్యూ లో తన గురించి తాను ఇలా చెప్పుకున్నాడు.. నేను మార్నింగ్ లేసిన తర్వాత మళ్లీ నైట్ పడుకునే వరకు నా జీవిత కాలం లో నా బెడ్ రూమ్ ని చూడలేదు అంటే తాను మార్నింగ్ లేసి ఆఫీస్ కి వెళ్ళిపోతే మళ్లీ నైట్ మాత్రమే తన బెడ్ రూమ్ కి వెళ్లి పడుకునే వాడు, తన జీవిత కాలం లో తాను పని చేసుకునే సమయం లో పడుకోలేదు అంటే మీరు అర్ధం చేసుకోవొచ్చు తాను ఆ స్థాయిలో ఉండడానికి ఎంత కస్టపడి ఉంటాడో అందుకే మీరు కూడా బద్దకాన్ని వదిలేయండి..

no 9 గొప్ప గొప్ప వ్యక్తుల మాటలు మీరు విన్నటైతే ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉందని అని చెప్తారు ఎందకంటే మీ నాలెడ్జి ఏ మీకు ఇన్కమ్ ని తెచ్చి పెడుతుంది, కానీ కొంత మంది నాకే అన్నీ తెలుసు అనే అపోహలో ఉండిపోతారు వారు కొత్త విషయాలని ఏవి నేర్చుకోడానికి ఇష్టపడరు ఆలా వాళ్ళ జీవితం లో చాల కోల్పోతారు.. ఇంగ్లీష్ లో ఒక quotation కూడా ఉంది.. an investment in కనౌలెడ్జి given you best interest అని, అందుకే ఎప్పటికి అప్పుడు మీరు కొత్త విషయాలని నేర్చుకుని ముందుకు సాగండి..

no 10 They క్విట్, మీరు ఎప్పుడైనా try and try until you succeed అనే సామెత విన్నారా..? వినే ఉంటారు కదా ఏదైనా సాధించాలంటే ఎన్ని సార్లు పడిపోయిన మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే మీరు కలలుకన్న జీవితాన్ని మీరు సాధించగలరు..
అంతే కానీ మొదటి ప్రయత్నం లో ఓడిపోయాం అని ఆగిపోతే అక్కడే ఉండిపోతారు..

చూసారు కదా ఈ 10 habits లో మీకు ఏవైనా habits ఉంటే మాత్రం వెంటనే మార్చుకోండి, ఈ హబ్బీస్ మార్చుకుంటే విజయం సాధిస్తామా అనే question మీకు రావొచ్చు, ఇపుడు నేను మీకు అబ్దుల్ కలం గారు చెప్పిన ఒక మాట చెప్తాను,మీ ఫ్యూచర్ ని మీరు చేంజ్ చేయలేకపోవొచ్చు కానీ మీ అలవాట్లని మీరు చేంజ్ చేసుకోవొచ్చు మీ అలవాట్లని కనుక మీరు చేంజ్ చేసుకుంటే మీ అలవాట్లు మీ ఫ్యూచర్ ని చేంజ్ చేస్తాయి.. సో ఇపుడు అర్ధం అయింది కదా మనం మన అలవాట్లని చేంజ్ చేసుకుంటేనే మన ఫ్యూచర్ ని చేంజ్ చేసుకోగలం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles