ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ఇద్దరూ తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టు పోటీపడినా.. ఇద్దరూ కలిసి దాదాపు ఓ పాతిక చిత్రాల్లో కలిసి నటించడం విశేషం. ఎఎన్ఆర్ గురించి రచయిత తోటపల్లి మధు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఓ ఇంటర్ వ్యూలో తోటపల్లి మధు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు గారితో నేను మొదట చేసిన సినిమా భలే దంపతులు. తర్వాత రావుగారింట్లో రౌడీ. తర్వాత బంగారు కుటుంబం, దాసరి గారి మాయాబజార్ చిత్రాలకు వర్క్ చేశాను. ఇందులో కృష్ణుడి క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు చేశారు.

నాగేశ్వరరావు గారు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్లు. మాయాజబార్ సినిమాలో నేను శకుని పాత్ర చేశాను. సీనియర్ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం నా అదృష్టం అని ఆరోజు నేను అంటే.. కుర్రవాళ్లతో కూడా చేస్తున్నాం కదా అది మా అదృష్టం అని అన్నారు. ఇక బంగారు కుటుంబం సినిమా టైమ్ లో స్క్రిప్ట్ ఆయన చెబుతుంటే.. ఏంటి నాకన్నా ఎక్కువుగా డైలాగులు ఆయనే రాసుకున్నాడా..? అనే వారు సరదాగా. ఒక్కోసారి అయితే.. నాకు ఏమన్నా డైలాగులు ఉన్నాయా..? లేవా అనే వారు నాతో నాగేశ్వరరావు గారు అంత సరదాగా ఉండేవారు.

ఏ రోజు కడుపునిండా తినలేదు. రామారావుతో పోటీపడడానికే జీవితం సరిపోయింది అనేవారు. పొట్టివాడిని.. నేనేమి అందగాడ్ని కాదు. సోషల్ పిక్చర్సే.. ఎలా..? ఇదంతా ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు చెప్పారు. ఆయన ఒకరోజు భోజనం చేద్దాం రండి అని నాగేశ్వరరావు గారు పిలిచారు. ఫస్ట్ టైమ్ బ్రౌన్ రైస్ తినడం అదే ఫస్ట్ టైమ్. అప్పటి వరకు బ్రౌన్ రైస్ చూడలేదు. నాకు మాత్రం మూడు నాలుగు కూరలతో వడ్డించారు. ఆయన మాత్రం కొంచెం రైసు, కొంచెం కూర చిన్న చపాతి తినేవారు. వట్టి పెరుగు.. ఏంటండి ఇది అంటే.. దాదాపుగా పదేళ్లుగా ఇంతే. ఇలాగే తింటున్నాను అని చెప్పారు. ఇష్టం వచ్చినట్టుగా తిన్నామనుకోండి బుజ్జ పెరుగుతుంది అన్నారు నాగేశ్వరరావు గారు. ఫుడ్ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే చాలా క్రమశిక్షణగా ఉండేవారు అని నాగేశ్వరరావు గారి గురించి రచయిత తోటపల్లి మధు చెప్పారు.
