క్రికెట్ అభిమానులకి పండుగ మొదలయింది అనే చెప్పాలి, మరి కొద్దీ గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది, 2021 సీసన్ 14 చెన్నై వేడుకగా జరిగే మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ రాయల్ చల్లేంగెర్స్ బెంగళూరు పోటీ పడనున్నారు, మరి ఇరు జట్లు ఇప్పటి వరకు ఎన్ని సార్లు పోటీ పడ్డాయి, ఇరు జట్ల బల బలగాలు ఏంటో ఇపుడు ఓ లుక్ వేదం..

ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఐపీల్ ట్రోఫీ ని గెలుచుకున్న జట్టు ముంబై ఇండియన్స్, ఈ సీసన్ లో కూడా హాట్ ఫేవరెట్ గా ఈ జట్టు బరిలోకి దిగనుంది, బాటింగ్ పరంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పోల్లర్డ్, కుర్నల్ పాండ్య లాంటి బాట్స్మన్స్ తో టీం బాటింగ్ లైన్ అప్ పటిష్టంగా ఉండగా బౌలింగ్ లైన్ అప్ లో బుమ్రాహ్, బౌల్ట్ , కౌంటీర్ నైల్, పీయూష్ చావ్లా లాంటి బౌలింగ్ లైన్అప్ తో అటు బాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను చాలా పటిష్టంగా ఉంది ముంబై, ఇక RCB విషయానికి వస్తే మంచి టీం ఉన్నపటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ ని గెల్చుకోలేకపోయింది, ఈ సరి ఏకంగా 17 కోట్లు పెట్టి ఫాస్ట్ బౌలర్ kyle jamieson ని , 15 కోట్లు పెట్టి పవర్ ఫుల్ హిట్టర్ మాక్స్వెల్ ని దక్కించుకున్నారు మరి ఈ ఇద్దరి పై పెట్టుకున్న నమ్మకాన్ని వీరు ఎంతవరకు నిలపెట్టుకుంటారో చూడాలి, ఇక బాటింగ్ లైన్ అప్ విషయానికి వస్తే కోహ్లీ ,ఎబి డెవిలియర్స్, దేవదత్ పాడికల్ లాంటి టఫ్ క్లాస్ బాట్స్మన్స్ తో బాటింగ్ లైన్ అప్ ఇంకా నవదీప్ శని, సిరాజ్, kyle jamieson తో బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా పటిష్టంగా ఉంది RCB .

ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 27 సార్లు పోటీ పాడగా ముంబై ఇండియన్స్ ఏకంగా 17 మ్యాచులో బెంగళూరు పై విజయం సాధించగా 9 మ్యాచులో బెంగళూరు ముంబై పై విజయం సాధించింది, ఇక ఈ రోజు చెన్నైలోని చెప్పక్ లో జరగబోయే మ్యాచ్ లో ముంబై హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ బెంగళూరు నుండి గట్టి పోటీ ఉంటుంది అనడం లో ఎలాంటి సండేదం లేదు..
