ఒక రూపాయి కోసం బట్టలు ఉతికాడు, కానీ ఇపుడు టాప్ హీరోలు తనకోసం Q కట్టెల చేసుకున్నాడు..

జీవితం లో సక్సెస్ ఎవ్వరికి అంత ఈజీ గా దక్కదు, ఎన్నో ఒడిడుకులు, ఎన్నెనో కష్టాలు, ఇంకెన్నో అవమానాలు ఇవ్వని దిగమింగి పెదవిపై చిరునవ్వు పోకుండా నమ్మిన లక్ష్యం కోసం పారిడితే ఎంత పెద్ద లక్ష్యం ఐన మీ ఇంటి ముందు నిల్చుంటుంది అని రుజువు చేసాడు డైరెక్టర్ మురుగదాస్, ఇతడు తీసిన సినిమాలు ఎక్కువ శాతం ఇండస్ట్రీ హిట్స్ ఏ, ఇతను ఇపుడు ఒక టాప్ డైరెక్టర్ గా మనందరికి తెలుసు కానీ అతను ఒక పేద కుటుంబం లో పుట్టినావాడు అని మిలో ఎంత మందికి తెలుసు..?

A.R. Murugadoss

పేద కుటుంబం లో పుట్టి గొప్ప కలలని కన్నాడు, తన చిన వయసు నుండే దొరికిన ప్రతి పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టాడు, యుక్త వయసుకి వచ్చాక సినిమాల పై మక్కువ తో చెన్నై వెళ్తాను అని ఇంట్లో వాళ్ళని ఒప్పించి చెన్నై కి చేరుకున్నాడు, ఇక్కడ మురుగదాస్ ఎన్నో కష్టాలని ఎదురుకున్నాడు, ఇక్కడే జీవితం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాడు.. ప్రతి నెల ఇంటి నుండి వచ్చే 500 రూపాయలతో జీవనం కొనసాగిస్తూ సినిమాలో అవకాశలకోసం ప్రయత్నిస్తూ ఉండే వాడు, కొన్నాళ్లకి ఇంటి నుండి ఆ 500 కూడా రావడం ఆగిపోయాయి ఇంట్లో కష్టాలు అలాంటివి మరి, కానీ మురుగదాస్ మాత్రం తన పోరాటాన్ని వదిలి పెట్టలేదు, ఒక పుట తింటూ రెండు పుటలు పస్తులు ఉంటూ తన ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు, ఆలా రోజులు గడుస్తూనే ఉన్నాయ్, ఇంటి అదే కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అపుడే తన రూమ్ మాటే ఒకతను రోజు బట్టలు ఉతకడం గమనించిన మురుగదాస్ తనని ఏంటి అని అడగగా, ఈ బట్టలు ఉతికితే ఒక షర్ట్ కి ఒకో రూపాయి ఇస్తారు అని చెప్పడం తో కడుపు నింపొకోవడం కోసం ఒక రూపాయి కి బట్టలు ఉతకడం మొదలు పెట్టాడు..

ఇది గమనించిన మురుగదాస్ ఓనర్, నువ్వు ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడికి వచ్చావో దానికోసం మాత్రమే పోరాడు నేను ఇంకో ఆరు నెలలు నిను అదే అడగను అని చెప్పి మురుగదాస్ కి సపోర్ట్ చేసాడు, ఆ తర్వాత లెక్క లెన్నని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు, సినిమాలల్లో అపుడపుడే అవకాశాలు వస్తూ ఉన్నాయ్ కానీ అదే సమయం లో మురుగదాస్ జీవితం లో ఒక పిడుగు లాంటి వార్త, తన తండ్రి మరణించాడు, తన తండ్రి చివరి చూపుని కూడా నోచుకోలేపోయాడు, తాను వెళ్లే సమయానికి కట్టలు కాలుతున్నాయి కానీ ఆ మంట మురుగదాస్ గుండెల్లో రగిలింది, ఎలా ఐన సరే జీవితం లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తిరుగు ప్రయాణం అయ్యాడు..

తండ్రి మరణం తర్వాత వాలి, ఖుషి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు, ఆ తర్వాత తాను డైరెక్టన్ చేసిన మొదటి సినిమా ఓకే అనిపించినా రమణ సినిమా తో తనలో ఉన్న సత్తా ప్రేక్షకులకి తెలిసేలా చేసాడు, ఆ తర్వాత తాను ఎంతో ఇష్టంగా రాసుకున్న గజినీ సినిమా అజిత్ కి చెప్పగా తాను తిరస్కరించాడు, అజిత్ తో ఆటు పలు పేద హీరోలు ఈ సినిమా ని తిరస్కరించారు కానీ తాను మాత్రం ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కొలిపోలేదు, ఇదే కథ ని సూర్య కి వినిపించగా సూర్య ఈ కథ ని ఓకే చేసి సినిమా కి ప్రేక్షకుల మందికి తీసుకొచ్చారు, ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు, తెలుగు లో కూడా విడుదల అయ్యి బ్రహ్మన్దమైన విజయని అందుకుంది ఇంకా అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు మురుగదాస్ ఎప్పుడు వేణు తిరిగి చూడలేదు, వరుసగా హిట్స్ ఇస్తున్న తనకోసం స్టార్ హీర్లో కూడా వెయిట్ చేసారు అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు.. కానీ మురదాస్ జీవితం లో ఒకటే బాధ, తనని తన తండ్రి ఏ స్టేజి లో అయితే చూడాలని అనుకున్నాడు తాను ఆ స్టేజి కి వచ్చే సమయానికి చూడడానికి తన తండ్రి లేకపోవడం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles