కలెక్షన్ల సునామి తో అత్యధిక ప్రేక్షకాదరణ పొంది థియేటర్లలో సందడి చేసిన తెలుగు సినిమాలు..

ఓ సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలు రీచ్ అయ్యేందుకు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు చాలా శ్రమించాల్సి వస్తుంది. .ఇక.. ఆ రోజుల్లో అయితే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన దగ్గరనుంచి బాక్సులు థియేటర్ కు వచ్చే వరకు తిన్మార్ డప్పులతో పటాసులతో ఓ పెద్ద పండగలా చేసేవారు ఫాన్స్. ఇప్పుడంటే డిజిటల్ కాబట్టి అంత హడావుడి ఉండటం లేదు. అప్పటి రోజులేవేరు. ఫ్యాన్స్ మధ్య పోటీ ఓ వైపు .. కలక్షన్ల సునామి మరో వైపు . సినిమా అత్యధిక సెంటర్లలో శత దినోత్సవం , ఒక్కో సినిమా ఏడాది వరకు హౌసేఫుల్స్ తో నడిచేవి. ఇప్పుడంటే సినిమా వన్ వీక్ ఆడితే చాలు బాక్సాఫీస్ లెక్కలు తేలిపోతున్నాయి. అదే పెద్ద శతదినోత్సవం . డిజిటల్ టెక్నాలజి పుణ్యమా అని ఈ రోజులలో సినిమా రిలీజ్ అయిన ఓ పది రోజుల్లో టీవీల్లో, ఓ టి టి ల్లో , సోషల్ మీడియా ల్లో ప్రసారమయిపోతున్నాయి. కాని అప్పట్లో అలా కాదు ఒక్కో ప్రేక్షకుడు చూసిన సినిమానే మూడు నాలుగు సార్లు చూసేవారు.ఆ మజానే వేరు. ఓ రకంగా తమ హీరోలపై అభిమానాన్ని అంతలా చాటుకునేవారు ఫ్యాన్స్ . అలా అత్యంత ప్రేక్షకాధరనతో ఆనాటి నుండి నేటి వరకు ఎక్కువ రోజులు సినిమా హాళ్లలో విజయవంతంగా ప్రదర్శింపబడిన సినిమాల విశేషాలు మా ప్రేక్షకులకు ప్రత్యేకం. ఒక్కో సినిమాను ప్రజలు ఆరాధిస్తారు,ఒక్కో సినిమాని అభిమానిస్తారు. కానీ ఈ రెండూ ఏక కాలం జరిగితే ఖచ్చితంగా ఆ చిత్రం అన్నగారి లవకుశ చిత్రమే అవుతుంది. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు మరియు అంజలీ దేవి సీతా రాములుగా జన నిరాజనాలందుకున్న క్లాసిక్ మూవీ లవకుశ.

ఈ చిత్రానికి సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా వ్యవహరించగా లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించారు. , ఎన్.టి.రామారావు, అంజలీదేవి, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, కాంతారావు, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. సీతారాములు పట్టాభిషిక్తులు అయ్యాకా చాకలి తిప్పడు నిందవేశాడని శ్రీ రామ చంద్రుడు గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి. 1934లో బ్లాక్ అండ్ వైట్లో లవకుశను దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. 1958లో షూటింగ్ ప్రారంభమైన లవకుశ చిత్రం పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆర్థిక కారణాలతో ఈ చిత్ర షూటింగ్ ఐదు ఏళ్ళు కొనసాగింది. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసినపుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కుమారుడు సి.ఎస్.రావు తదుపరి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని 1963లో 26 కేంద్రాల్లో విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా రూ.కోటి వసూళ్ళు సాధించిందంటే మాములు విషయం కాదు. . 60లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది. సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ కేంద్రాల సంఖ్య, ఆడిన రోజుల్లో రికార్డ్ సాధించడంతో పాటు క్లాసిక్ స్థాయిని అందుకుంది సీతారాములుగా నటించిన ఎన్టీ రామారావు, అంజలీదేవి పాత్రల్లో ఎంతగా ప్రాచుర్యం పొందారంటే వారిని ప్రజలు నిజమైన సీతారాముల్లానే భావించి హారతులు పట్టేవారు.

సినిమా పాటలు కూడా ఘన విజయం సాధించి ప్రతి పల్లెలోనూ ఉత్సవాల సమయంలో మారుమోగాయి. ఇప్పటికీ సినిమా టీవిలో ప్రదర్శితమైనప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లవకుశ సినిమాకు 1963 సంవత్సరం జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చలనచిత్రం పురస్కారం లభించింది. ఆ ఏడాది విడుదలైన లవకుశ, నర్తనశాల, కర్ణన్ సినిమాల్లో నటనకు గాను ఎన్టీఆర్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. .నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’.

అడవిరాముడు, ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టిన ఎన్టీఆర్ మరో సినిమా అడవి రాముడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన తోలిక్ చిత్రం అడివిరాముడు కావడం విశేషం.ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన జయసుధ , జయప్రద నటించారు. ఇంకో ముఖ్యమైన విశేషమేంటంటే అందాల తార జయప్రధ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది సత్యచిత్ర వారి మూడవ చిత్రం అడవిరాముడు. ఈ సంస్థ ద్వారా తాసిల్దార్ గారి అమ్మాయి, ప్రేమబంధం చిత్రాలు నిర్మితమయ్యాయి. తెలుగు సినిమాల్లో కమర్షియల్ హంగులతో రూపుదుద్దుకున్న ఈ చిత్ర కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఇలా చాలా విషయాల్లో అడవి రాముడు చిత్ర ఒరవడిలో చాలాకాలం సాగాయి. తెలుగు సినిమా చరిత్రలో అప్పటికి కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమాగా అడవి రాముడు చిత్రం అఖండ విజయం సాధించింది.
ఎన్టీఆర్ నట విశ్వ రూపం, దర్శకేంద్రుడు మయాజాలంతో 32 కేంద్రాలలో 100రోజులు ప్రదర్శింపబడింది. . 16 కేంద్రాలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు, 4 కేంద్రాలలో 365 రోజులు ద్విగ్విజయంగా ప్రదర్శింపబడి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

వేటగాడు, మళ్ళీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన వేటగాడు చిత్రం కూడా సంచలన విజయం సాధించింది.
రోజా మూవీస్ పతాకంపై అర్జున రాజు , శివరామ రాజు నిర్మాతలుగా నిర్మించిన వేటగాడు మూవీ కమర్సియల్ చిత్రాలకు సరికొత్త మార్గాన్ని వేసింది. 1979లో వ‌చ్చిన ఎన్టీఆర్ గారి వేట‌గాడు సినిమా కూడా అప్పట్లో 408 రోజులు థియేట‌ర్‌లో సంద‌డి చేసింది. ఆకు చాటు పిందె తడిసే, పుట్టింటోళ్ళు తరిమేశారు లాంటి సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ ఆయ్యాయి.మరో ముఖ్య విశేషమేంటే అతిలోక సుందరి శ్రీదేవి ఎన్టీఆర్ తో హెరాయిన్ గా నటించిన తొలి చిత్రం వేటగాడు కావడం విశేషం.


ప్రేమాభిషేఖం, ఇక.. అక్కినేని నాగేశ్వర రావు గారి ప్రేమాభిషేకం చిత్రం ఎంతటి సంచలన విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై దర్సకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 1981 ఫిబ్రవరి 16 న విడుదలై అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుద కెరియర్ లోనే మైల్డ్ స్టోన్ మూవీ గా నిలిచి పోయింది. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల పైన షేర్ వసూల్ చేసిన మొదటి చిత్రం కాగా, మొత్తం 4.5 కోట్ల షేర్ వచ్చింది. డైరెక్టుగా 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇది. షిఫ్టింగ్స్ తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. తెలుగు సినిమారంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే.
20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది. 8 కేంద్రాలలో సంవత్సరంపాటు ఆడిన ఏకైక చిత్రమిది. 29 కేంద్రాల్లో 175 రోజులు, .ఓ థియేట‌ర్‌లో 533 రోజులు ఆడి సందడి చేసింది.

మరో చరిత్ర, ఇక ఈ కోవలో అంత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 1978 లో వచ్చిన మరో చరిత్ర చిత్రం. స్టార్ డైరెక్టర్ అపూర్వ సృష్టి ఈ ప్రేమ కావ్యం మరో చరిత్ర. అప్పటికే సాంకేతికంగా ముందడుగు వేస్తూ కలర్ ఫుల్ చిత్రాలు వెల్లువ వస్తున్న సమయంలో బ్లాక్ అండ్ వైట్ లో రూపొంధించిన మరో చరిత్ర తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు కమల్ హాసన్, సరితలకు మరో చరిత్ర ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదినకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధులౌతారు. ఈ సినిమా చివరకు విషాదాంతమౌతుంది. ఈ విషాద ప్రేమ కావ్యం థియేటర్లలో 556 రోజులు ఆడింది. ఈ సినిమాలోని సంగీతం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

ప్రేమ సాగరం, ఇక.. ప్రేక్షకులను హుషారెక్కించి కాసుల వర్షం కురిపించిన మరో ప్రేమ కథ టి. రాజేందర్ డైరెక్ట్ చేసిన ప్రేమ సాగరం మూవీ . అప్పటివరకు వచ్చిన ప్రేమ కథలకు బిన్నంగా యువత ను అలరించే అన్ని అంశాలతూ ఓ పరిపూర్ణ మయిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ఈ ప్రేమ సాగరం. 1983లో విడుదలయిన ప్రేమ‌సాగ‌రం సినిమా 465 రోజులు దియేటర్లలో సందడి చేసి తిరుగులేని హిట్ గా నిలిచింధీ. .కథ ..స్క్రీన్ ప్లే.. డైరెక్షన్ .. మ్యూజిక్ తూ పాటు హీరోగా చేసి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. టి.రాజేంద్ర. హీరోయిన్లుగా నళిని, సరిత తమ అద్భుత నటనతో కట్టిపడేసారు. ఈ చిత్రంలో ప్రతి పాటా ఇప్పటికి ..ఎప్పటికి ఎవర్ గ్రీన్. ఇలా అన్ని అలరించే అంశాలతో ఎక్కువ రోజులు ప్రదర్శింపబడింది.

సో…చూసారు కదండీ.. అత్యధిక ప్రేక్షకాదరణ తో ఎక్కువ రోజులు థియేటర్లలో ప్రదర్శింప బడ్డ మన బ్లాక్బస్టర్ మూవీస్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles