కొమరం భీమ్ అసలు చరిత్ర

ఎలుగ్గెతి నిలబడ్డ విప్లవ రణం.. తలదించే పని లేదు అనే  దిక్కారపు స్వరం.. మట్టి చెట్టు గట్టు మావే అన్న మన్యం బేబ్బులి  కొమురం భీమ్…గోండులు,కొలం లు,బిల్లు లు, బంజారాలు, ఎవరైనా ఆది వాసూలుగా ములవాసులుగా ఈ మట్టి మీద పుట్టి తమ ఆస్థిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న గిరిజనులకి ఆరాధ్య దైవం కొమురం భీమ్. 1901 అక్టోబర్ 22 న నేటి తెలంగాణ రాష్టం లో ఆసిఫాబాద్ అడవుల్లో ని సంకేనపల్లి లో జన్మించాడు.అప్పటికే కొంచెం కొంచెం గా అడవి భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్తున్న సమయం అది. భూములతో పాటు శావుకార్లు వడ్డీ వ్యాపారస్థులు కూడా పచ్చని కొండలను   అంతకంటే పెద్ద దురశ తో మింగేయాలని కాచుకొని కూర్చున్నారు. అప్పుడే 1918 లో అడవి భూముల చట్టం వచ్చింది. అంతే ఎవరిరికి తగ్గట్టు వాళ్ళు అన్యం పుణ్యం తెలియని గిరిజనుల ఆదివాసుల భూములు తమ పేర్లమీద రికార్డు చేస్కోవడం మొదలు పెట్టారు. మైదాన ప్రాంతం లోని దళరులు అడవిసంపదను కొళ్లగొట్టడం కూడా మొదలయింది.


మొన్నటి వరకు తాము దున్నుకున్న భూములు ఈ రోజు మీవి కావు అనడం తో ఏమి చెయ్యాలో తెలియక చాలా మంది  గోండులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలు పెట్టారు.అలా తాత మోతి రామ్ తో కలిసి కలిమేర ప్రాంతం సూర్ధపూర్ కి వెళ్లారు. మంచి మైదాన ప్రాంతం కావడంతో పంటలు విస్తరం గా వేశారు. పంట చేతికివస్తే అప్పటికే షావుకర్ల దగ్గర తీసుకున్న అప్పులు కట్టి సంతోషం గా ఉండొచ్చు అని కొమురం భీమ్ కుటుంబం మొత్తం సంతోషం గా పంట కోత కాలం కోసం ఎదురు చూస్తున్నారు. నల్ల చీమలు  కట్టిన  పుట్ట కోసం ఎదురు చుసిన పాముల జగిర్ధార్ సిద్ధికి కూడా వీళ్ళు పంట పండించే దాకా ఎదురు చూసాడు. సిదికి నిజాం ప్రభుత్వపు జాగిర్ధార్. అప్పటి దాకా కొమురం భీమ్ కుటుంబం పండించే భూమి నాది అని పంట వదిలి వెళ్ళిపోమన్నాడు. ప్రభుత్వం తన వైపు ఉందని భయపెట్టాడు. ఎంత బలహీనుడికైనా నోటి దగ్గర కొచ్చిన ముద్ద నేల పాలు అవుతుంది అంటే ఆవేశం వస్తుంది. మరి గోండు పులి. తెల్ల కుక్కలను ఉరికించి నరికిన గోండు వీరుడు రాంజీ కథలు నిత్య పారాయణం చేసే  కొమురం భీమ్ కి ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్క దెబ్బ సిద్ధికి  గుండెలమీద కొట్టాడు. అంతే అపుడు పడ్డవాడు ఎప్పుడు లేవలేదు.. ఆ దెబ్బ  నిజం ప్రభుత్వం మీద పడ్డ దిక్కారపు దెబ్బ. నిజాం పోలీస్ లు భీమ్ ని వెతికే పనిలో ఉన్నారు. బీమ్ రైలు పట్టుకొని చందా కి పారిపోయాడు. అక్కడ విటోబా దగ్గర పనిలో కుదిరాడు. విటోబా స్వాతంత్ర భారత్ కోసం కలలు కంటున్నా విప్లవకారుడు.అంతే కాకా విప్లవ సాహిత్యన్ని కూడా ముద్రించేవాడు. అది బ్రిటిష్ వాళ్ళ కు తెల్సి ఆయన్ని అరెస్టు చేశారు. అక్కడ నుండి మళ్ళీ అస్సాం కి బీమ్ ప్రయాణం మొదలయింది. భీమ్ అక్కడే అల్లూరి సీతరామరాజు శిస్యులను కలుసుకోవడం జరిగింది. అక్కడే తన జాతి కి జరుగుతున్న అన్యాయం అర్ధం అయిన్ది. బానిసత్వం కంటే చావే మేలు అనే నిర్ణయానికి వచ్చేసాడు భీమ్. తన అవసరం తన ప్రజలకు ఉంది అని తిరిగి బలార్షకు వచ్చాడు.

అక్కడ నుండి తన జన్మస్థలం జోడేగాట్ కి చేరుకున్నాడు. అక్కడే లచ్చు రామ్ దగ్గర పనిలో చేరి ఆయన భూమి లెక్కలు చక్కబెట్టాడు. దేశం తిరిగి వచ్చాడు ఇంకా తెలివైన వాడు భీమ్. లచ్చు రామ్ కూడా ఆయన భూమి వివాదాలు చూడమని హైదరాబాద్ కు పంపాడు. భీమ్  ఒక్క సారి వెళ్లి చాలా కాలం గా వివాదం లో ఉన్న భూమి గొడవలు అన్ని చక్కబెట్టి పట్టా పుస్తకలతో తిరిగి వచ్చాడు. లచ్చి రామ్ సంతోశించి ఆయన పాలేరు కూతురు సోంబాయి తో పెళ్లి చేసాడు. ఆ తరువాత ఫైకు బాయ్ ని కూడా పెళ్లి చేసుకున్నాడు. భీమ్ కి పేరు పలుకుబడి పెరిగిపోతుంది . భూమి పంచాయతీ లు కుటుంబ గొడవలు ఏవైనా భీమ్ చెప్తే చక్కబడేవి..కొన్ని గొడవల్లో పోలీస్ ల మాట కూడా వినేవాడు కాదు కొమురం భీమ్. ఇది  జూగ్లాంత్ అమీన్ సాబ్ కి అస్సలు నచ్చలేదు. సొంతం గా పంచాయతీలు చేస్తున్నాడు అని పై అధికారిలకు పిర్యాదు చేసాడు. పైగా కుర్ధు పటేల్ అనే గోండు పెదమనిషి కూడా కొమురం భీమ్ మీద కోపం గా ఉన్నాడు. అందరూ కలిసి కొమురం ను జైలుకి పంపాలని చూసారు. 7 గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. కొమురం భీమ్ ఆ 7 గ్రామాలను కలిపి గోండు రాజ్యం గా ప్రకటించాడు. అంతే నిజామ్ ని దిక్కరించారు అని నిజాం సైన్యం కొమురం మీద యుద్దానికి ప్రకటించాడు. అన్ని గ్రామాల్లో ప్రజలు కూడా ఆయుధాలు సేకరించి సిద్ధం గా ఉన్నారు. కట్టే కొడవలి గొడ్డలి నాగలి కారం ఇలా అన్ని సిద్ధం గా ఉన్నాయ్. కానీ నిజాం సైన్యం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేకపోయింది.

అంతే కదా తన బిడ్డల మీద యుద్దానికి వస్తే అడవి తల్లి అయినా ఎలా ముందుకు వదులుతుంది. ఏమి చెయ్యాలో అర్ధం అవ్వక అడవి బయటే ఉన్న సైన్యం కి నమ్మకద్రోహం అనే దారి దొరికింది. కుర్ధు పటేల్ ని పిలిచి భీమ్ ని చూపించమన్నారు. కుర్ధు పటేల్ కూడా భీమ్ చచ్చిపోతే ఆ స్థానాన్ని తాను పొందొచ్చు అనే కుట్ర తో భీమ్ స్థావారానికి దారి చూపించాడు. దొంగ దెబ్బ తో భీమ్ పాడగొట్టాలని చూసిన నిజాం సైన్యానికి భీమ్ పౌరుషం యుద్ధ నైపుణ్యం ముచెమటలు పట్టించాయి. చివరికి కొన్ని రోజుల యుద్ధం తర్వాత 1940 అక్టోబర్ 8 న కొమురం భీమ్ ని చంపగలిగారు. కానీ కొమురం భీమ్ వెలిగించిన విప్లవ దీపాన్ని ఆర్పలేకపోయారు. ఇప్పటికి ఎప్పటికి కొమురం భీమ్ చూపిన సాహసం అనితరసాధ్యం.. అసుర సంధ్యలో ఎర్ర బడ్డ జోడేగాట్ ఆకాశం.. రేపు  ఉదయించే విప్లవ సూర్యుడి వెలుగు కోసం ఎదురు చూస్తూనే  ఉంటుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles