గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి..? గ్రౌండ్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది..?

పంచ బూతులు ఈ సృష్టికి మూలా కారణాలు అని మనకి తెలుసు అందులో ఏ ఒక్కటి లేకున్నా మనుషుల జీవనం కొనసాగదు అనేది జగన్ ఎరిగిన సత్యం, ముఖ్యంగా మానవుల జీవనానికి పంచబూతాలో ఒకటైన నీరు ఎంతో అవసరం.. ఈ భూమి పైన 71 శాతం నీరు ఉన్నపటికీ అందులో కేవలం మూడు శాతం మాత్రమే తాగు నీరు గా ఉపయోగపడుతుంది, ఆ మూడు శాతం నీరులో కూడా డెబ్భై శాతం నీరు మంచు, నదుల రూపం లో ఉండగా ముపై శాతం నీరు మాత్రమే మానవులకి ఉపయోగ పడేలా గ్రౌండ్ వాటర్ రూపం లో ఉంది.. అసలు ఈ గ్రౌండ్ వాటర్ అంటే ఏమిటి గ్రౌండ్ లోపల వాటర్ ఎలా స్టోర్ అవుతుంది అనే విషయాలని మనం తెలుసుకుందాం..

గ్రౌండ్ వాటర్ గురించి తెలుసుకునే ముందు మనం వాటర్ సైకిల్ గురించి తెలుసుకోవాలి, మనకి వర్షం పడితే భూమి పై పడే నీరు కొంత శాతం నదుల్లో ఇంక సముద్రంలో కలవగా, కొద్దీ పాటి నీరు చెట్లు, మరికొంత నీరు ఆవిరై ఆకాశానికి వెళ్తుంది, ఇంకా మిగిలిన నీరు మాత్రమే బూమిలోపలికి వెళ్తుంది, భూమి లోపలికి వెళ్లిన ఈ నీరునే మనం గ్రౌండ్ వాటర్ అని అంటాం, ఈ గ్రౌండ్ వాటర్ లో ఉండే నీరు భూమి లోపల ఉండే చిన్న హోల్స్ నుండి వచ్చి అక్విఫెర్ లో కలుస్తుంది .. అక్విఫెర్ అంటే నీల లోపల రాళ్ల మధ్య ఉండే గ్యాప్ ఫార్మషన్.. అసలు ఈ అక్విఫెర్ ఎలా తయారు చేయబడింది ఎవరు తయారు చేసారు అనే అనుమానం మీకు కల్గవోచు ఆ విషయాలు అని ఇపుడు డీటెయిల్ గా తెలుసుకుందాం.

ఈ అక్విఫెర్ లు సాండ్ స్టోన్ ఇంకా లైం స్టోన్ తో చేయబడినీవవి అయితే ఇవి న్యాచురల్ గానే ఫార్మా అయినవి ఎవ్వరు వీటిని తయారు చేయలేదు.. ఒక మాటలో చెప్పాలి అంటే అక్విఫెర్ అంటే అండర్ వాటర్ కనల్స్, అయితే ఇవి కొన్ని ప్రాంతాల్లో భూమి లోపల చాలా లోతుగా ఉంటాయి మరి కొన్ని ప్రాంతాల్లో భూమి లోపల తక్కువ ఫీట్స్ లో ఉంటాయి, ఇందు వల్లే బోర్ వేసినపుడు కొని ప్రాతాల్లో మనకి నీరు త్వరగా పడ్తాయి, మరి కొని ప్రాంతాల్లో ఎక్కువ ఫీట్స్ బోర్ వేయాల్సి వస్తుంది, అయిత్ అక్విఫెర్ అనేది చాలా దూరం వరకు కనెక్ట్ అయ్యి ఉంటది, ఈ భూమి మీద లార్జెస్ట్ అక్విఫెర్ us లో ఉంది, దాని పేరు Ogalla అక్విఫెర్ ఇది నాలుగు లక్షల kms వరకు కనెక్ట్ అయ్యి ఉంటుంది, మన భరత్ దేశం లో లార్జెస్ట్ అక్విఫెర్ Alluvium అక్విఫెర్ ఇది ఇది బీహార్ ఒడిస్సా ఆసాం వెస్ట్ బెంగాల్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకి కనెక్ట్ అయ్యి ఉటుంది, మన దేశ భూమిలో ఇది 31 % కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఈ అక్విఫెర్ లో నీరు రెండు విధాలుగా ఉంటుంది, creviced రాక్ లో నీరు పైప్లైన్ మాదిరిగా కనెక్ట్ అయ్యి ఉంటె గ్రావెల్ లో నీరు చిన్న చిన్న మాడుగుల కనెక్ట్ అయ్యి ఉంటాయి..

ఈ అక్విఫెర్ లని రెండు విధాలుగా విభజిస్తారు స్థిరంగా ఉన్న అక్విఫెర్ స్థిరంగా లేని అక్విఫెర్ అని, భూమికి దెగ్గరగా ఉన్న అక్విఫెర్ లని స్థిరంగా లేని అక్విఫెర్ లాగా భూమి కి లోతుగా ఉన్న అక్విఫెర్ ని స్థిరంగా ఉన్న అక్విఫెర్ లాగ విభజిస్తారు, భూమికదెగ్గరగా ఉండే అక్విఫెర్ లో నీరుని బోర్వెల్స్ ద్వారా మనం బయటికి తీస్తుంటాం అందుకే ఆ అక్విఫెర్ లో నీరు స్థిరంగా ఉండవు, ఇక భూమికి లోతుగా ఉండే అక్విఫెర్ లో నీరుని మనం బయటకి తీయలేము అవి కొని వేల సంవత్సరాల నుండి అలానే ఉంటున్నాయి.. ఈ గ్రౌండ్ వాటర్ కేవలం వర్షం నీరు వాళ్ళ మాత్రమే ఏర్పడినవి కావు, ఐస్ మెల్ట్ అయ్యి వచ్చిన నీరు, నదుల ప్రవాహం వల్ల, చేరువులో ఉండే నీరు వల్ల కూడా గ్రౌండ్ వాటర్ అనేది ఏర్పడుతుంది ..

అయితే మనం మన నిత్య అవసరాల కోసం గ్రౌండ్ వాటర్ ని బోరెవెల్స్ ద్వారా బయటికి తీస్తున్నాం ఇలా తీయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, అంతే కాకుండా సెప్టిక్ ట్యాంక్, మనం పడేసే ప్లాస్టిక్, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లీకేజీ వల్ల గ్రౌండ్ వాటర్ అనేది కలుషతం అవుతుంది, ఒకసారి గ్రౌండ్ వాటర్ కలుషతం అవుతే ఆ నీరు మల్లి మానవ మనుగడకి ఉపయోగపడదు, ఈ గ్రౌండ్ వాటర్ ని మాత్రమే నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు చాలా మంది ఉన్నారు అందుకే మనం ప్రకృతిని కాపాడితే మన బావి తరాలకి భవిషత్ ఉంటుంది అంటారు, ఇప్పటి నుండి ఐన ప్లాస్టిక్ వాడడం తాగిస్తూ చెత్తని బయట రోడ్లపై పడేయకుండా ప్రకృతిని కాపాడుకుందాం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles