చిన్న వయసులో చనిపోయిన టాలీవుడ్ ఆక్టర్స్

పుట్టాక చావు, ఎవరి జీవితంలో ఐన ఈ రెండు విషయాలు వారి చేతుల్లో ఉండవు.. ఈ రెండిటి మధ్య ఉండే కాలమే జీవితం, ప్రతి మనిషి జీవితం లో కూడా ఎన్నో కలలు ఉంటాయి, కొంతమంది ఆ కలలని సాధించుకొని జీవితాన్ని అందంగా గడిపేస్తారు, మరికొంతమంది కళలు కంటూనే జీవితాన్ని గడిపేస్తారు.. కానీ ఇంకొంత మంది జీవితం మాత్రం వారు కన్న కలల్ని సాకారం చేసుకున్న, కాలం కాటికి బలైపోతారు, మన చుటూ ఉన్న ప్రపంచంలో ఎంతో మంది చిన్న వయసులోనే చనిపోయిన వారు ఉంటారు కానీ సెలెబ్రిటీల జీవితాలు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది కాబట్టి, అతి చిన్న వయసులోనే చనిపోయిన సెలెబ్రిటీల గురించి మనం తెలుసుకుందాం,

దివ్య భారతి, వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అరంగ్రేటం చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ అతి చిన్న వయసులోనే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, తన అంధ చందాలతో కుర్రకారుని ఆకట్టుకుంది, ఇక ఈమెకి ఇండస్ట్రీ లో తిరుగులేదు అని అందరూ అనుకున్నారు.. ఎం జరిగిందో ఏమో తెలియదు కానీ ఏప్రిల్ 5 1993 ముంబై లోని ఐదవ అంతస్థులో ఉన్న తన అపార్ట్మెంట్ కిటికిలోనుండి దూకి చనిపోయింది.. ఇప్పటికి దివ్య భారతి మర్డర్ ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది..

సిల్క్ స్మిత, ఇప్పట్లో అయితే హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తున్నారు కానీ ఒక్కపుడు ఐటెం సాంగ్స్ చేసేందుకు సెపెరేట్ గా ఆర్టిస్టులు ఉండేవారు అలంటి వారిలో ఒకరు సిల్క్ స్మిత.. తెలుగు, తమిళ్ హిందీ, మలయాళం ఇలా సౌత్ లో ప్రతి భాషలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసిన సిల్క్ స్మిత అని భాషల్లో కలిపి ఏకంగా 450 సినిమాల్లో నటించి, కారణాలు అయితే తెలియవు కానీ సెప్టెంబర్ 23 1996 వ తేదీన తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయిది, ఈమె డెడ్ బాడీ ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ ఈమెది సూసైడ్ అని అంతే కాకుండా చనిపోయే సమయానికి ఈమె ఆల్కహాల్ సేవించారు అని నిర్ధారించారు.. అయితే తాను చనిపోయే ముందు తన ఫ్రెండ్ ఐన మరో డాన్సర్ అనురాధ కి కాల్ చేసి తాను ఏదో బాధలో ఉన్నటు మాట్లాడింది అనే వార్తలు ఉన్నాయ్ .. ఏది ఏమైనా అందరిని ఆకట్టుకున్న ఈ ఐటెం డాన్సర్ అతి చిన వయసులోనే చనిపోవడం చాల బాధాకరం..

సౌందర్య, 90 ‘స్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది, టాలీవుడ్ లో ఇపుడు ఉన్న అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది, గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటూ తన నటనతో ఫామిలీ ఆడియన్స్ కి మరింత దెగ్గర ఇయింది, కానీ విధి ఆడిన నాటకానికి ఆమె బలవక్క తప్పలేదు, 17 ఏప్రిల్ 2004 భారతీయ జనతా పార్టీ తరుపున ప్రచారానికి బెంగళూరు నుండి కరీంనగర్ వాస్తు ఉండగా ప్లేన్ క్రాష్ అవ్వడం తో సౌందర్య గారు తన తుది శ్వాస విడిచారు అప్పటికి సౌందర్య గారి వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే, ఇదే ప్లేన్ లో తన అన్నయ అమర్నాథ్ కూడా ఉన్నాడు, అన్న చెల్లెలు ఇద్దరు ఒకేసారి చనిపోయారు, తెలుగు సినిమా లోకం ఒక గొప్ప నటిని కూలిపోయింది..

ఆర్తి అగర్వాల్, విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి ప్రచయం ఐన ఈ ముద్దుగుమ్మ తన అమాయకమైన మొహంతో అందరిని ఆకట్టుకుంది, అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గడం తో పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. మల్లి సినిమాలోకి రావాలని అనుకుందో లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియవు కానీ తన బాడీ ని తగ్గించుకోవడానికి లిపోసక్షన్ అనే సర్జరీ ని చేపించుకోగా ఆ సర్జరీ జరిగిన కొద్దీ వారాలకే హార్ట్ ఎటాక్ తో చనిపోయింది..

ఉదయ్ కిరణ్, చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, ఇండస్ట్రీలోకి అడుగు పెడ్తూనే హ్యాట్రిక్ హిట్స్ ని తన కాతాలో వేసుకున్నాడు, ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్వతహాగా ఎదిగిన హీరోలో ఉదయ్ కిరణ్ ఒకడు, టాలీవుడ్ లో ఇతను నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతాడు అనుకున్నారు అందరూ, కానీ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత తో నిశ్చితార్ధం క్యాన్సల్ ఐన తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం తగిపోయాయి, ఒక్కసారిగా తన జీవితం మొత్తం మారిపోవడం తో డిప్రెషన్ కి లోనైనా ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు..

ప్రత్యుష, అచ తెలుగు పదహారేళ్ళ తెలుగు అమ్మాయిల ఉండే ఈమె తెలుగు లో చేసినవి కొని సినిమాలే ఐన ప్రతి ఒకరి గుండెల్లో చెరిగిపోని పాత్రలని పోషించింది.. ఫిబ్రవరి 23 2002 , వీరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవట్లే అనే కారణం తో తన ప్రియడు సిద్దర్ద్ రెడ్డి ఇంకా ఈమె ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు.. వీరిద్దరిని కేర్ హాస్పిటల్ కి తరలించగా ఆమె ట్రాట్మెంట్ తీసుకుంటూ తన ప్రాణాలని వదిలేసింది, సిద్దార్ధ్ మాత్రం రికవర్ అయ్యాడు, అప్పట్లో ఈ న్యూస్ ఒక సెన్సేషన్ ఇయింది, ప్రత్యుష చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రత్యుష పేరు తో ఒక చారిటీ ట్రస్ట్ ని ప్రారంభించింది..

శ్రీహరి, పాత్ర ఏదైనా సరే శ్రీహరి దానికి ప్రాణం పోస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు, హీరో గా విల్లన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా తాను పోషించిన ప్రతి పాత్రతో తెలుగు ప్రేక్షకులని అలరించాడు, రియల్ హీరో గా పేరు తెచ్చుకున్న శ్రీ హరి అక్టోబర్ 2013 లో ఆర్ రాజ్ కుమార్ బాలీవుడ్ సినిమాలో నటిస్తూనే సృహ తప్పి పడిపోయాడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించిప్పటికీ శ్రీహరి లివర్ బాగా డామేజ్ కావడం తో డాక్టర్స్ కూడా ఎం చేయలేకపోయారు, అక్టోబర్ 9 2013 న తన తుది శ్వాస విడిచారు..

వేణుమాధవ్, మిమిక్రి ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన వేణుమాధవ్ తన కామెడీ టైమింగ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించాడు, తాను 600 లకి పైగా సినిమాల్లో నటించాడు, లక్ష్మి సినిమాలో తన నటనకు గాను నంది అవార్డు ని అందుకున్నాడు, లివర్ ఇంకా కిడ్నీ ఫెయిల్ అవ్వడం తో 2019 సెప్టెంబర్ 25 న యశోద హాస్పిటల్ లో తన తుది శ్వాస విడిచారు..

సాగర్, ఈ పేరు వినగానే ఎవ్వరు ఇతడిని గుర్తుపట్టకపోయిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరో అంటే అందరూ ఠక్కున గుర్తు పట్టేస్తారు, తన మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న సాగర్ ఒక సినిమా షూటింగ్ కోసం తన ఫ్రెండ్ తో కలిసి హైదరాబాద్ వస్తూ ఉండగా కార్ ప్రమాదానికి గురై ప్రాణాలని కూలిపోయాడు..

చక్రి, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని పూరి జగన్నాధ్ తన బాచి సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు, ఎన్నో హిట్ సాంగ్స్ ని తెలుగు ప్రేక్షకులకి అందించిన చక్రి ఇప్పటి వరకు 85 సినిమాలకి మ్యూజిక్ ని అందించాడు, ఇతను 40 ఏళ్ళ వయసులో 2014 లో గుండెపోటు తో మరణించాడు..

అచ్యుత్, ఈ తెలుగు ఆక్టర్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వార ప్రసాద్, ఇతను తన కెరీర్ లో 50 సినిమాలు, 50 సీరియల్లు చేసాడు, తన నటనకు గాను 5 సార్లు నంది అవార్డు ని కూడా అందుకున్నాడు, పవన్ కళ్యాణ్ తో నటించిన తమ్ముడు, చిరంజీవి తో నటించిన బావగారు బాగున్నారా సినిమాలు ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చాయి, తన నటన తో అందరిని ఆకట్టుకున్న ఈ సపోర్టింగ్ ఆక్టర్ కూడా 42 ఏళ్లకే గుండెపోటు తో మరణించాడు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles