చిరజీవి తన పేరుని మార్చుకోవడానికి కారణం.?

చిరంజీవి, మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలిన రాజు, ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తన సత్తా ఏంటో చూపించిన ఘనుడు, తనపై తనకి ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏది లేదు అని తన జీవితం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపిన రియల్ హీరో, తమని అభిమానించే అభిమానులకి ఎప్పుడు వినోదాన్ని అందించాలనే ఉదేశ్యం తో తన కుటుంబం నుండి ఎంతో మంది హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.. 1978 లో విదుదల ఐన పునాదిరాళ్ళు సినిమా తో ఇండస్ట్రీ లో అడుపెట్టిన ఈ హీరో ప్రస్థానం మొదలై ఇప్పటికి 43 ఏళ్ళు అవుతుంది.. ఈ జెనరేషన్ లో వస్తున్న యువ హీరోలకి ఇప్పటికి పోటీ ఇస్తూ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.. అయితే మెగాసార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్, తన అసలు పేరుని పక్కకి పెట్టి చిరంజీన్ గా తన స్క్రీన్ name ని చేంజ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటో మనం ఇపుడు తెలుసుకుందాం..

ఈ మధ్య కాలం లో ఒక ప్రముఖ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పేరుని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అని చిరంజీవిని యాంకర్ ప్రశ్నించగా, చిరంజీవి గారు మాట్లాడుతూ నేను ఒకరోజు నిద్ర పోతున్నపుడు నాకు ఒక కల వచ్చింది ఆ కలలో నేను బాగా అలసిపోయి ఒక ఆంజనేయ స్వామి గుడిలో పడుకున్న కొదిసేపు ఆలా పడుకున్న తర్వాత నా కల్లోకి ఒక 10 ఏళ్ళ పాపా వచ్చి చిరంజీవి ఇప్పటికే చాల సేపు పడుకున్నావ్ ఇక లేచి పనికి వెళ్ళు అని చెప్పింది, అపుడు నేను నా పేరు చిరంజీవి కాదు నేను శివ శంకర్ వర ప్రసాద్ అని చెప్పినప్పటికీ తాను మళ్ళీ నన్ను చిరంజీవి అనే పిలించి అక్కడ ఉన్న మిగితా వారు కూడా నన్ను చిరంజీవి అని పిలవడం తో నాకు వెంటనే మేలుక వచ్చింది, వెంటనే నేను నా కల్లో వచ్చిన విషయాన్ని మా అమ్మ గారికి చెప్పను అపుడు తాను జరిగిందంతా విని నా పేరుని శివ శంకర్ వర ప్రసాద్ నుండి చిరంజీవిగా మార్చింది..

వినడానికి కొన్ని విడ్డురంగా ఉన్న కొంత మంది నిజజీవితంలో జరిగే కొన్ని సంఘటలని చూస్తే నమ్మక తప్పదు, వాస్తవానికి చిరంజీవి గారు హనుమంతుడికి వీర భక్తుడు, ఆంజనేయుడిని చిరంజీవి అని కూడా పిలుస్తుంటారు బహుశా వర ప్రసాద్ గారికి చిరంజీవి పేరు నచ్చడానికి ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు, వర ప్రసాద్ చిరంజీవిగా పేరు మార్చుకున్న తర్వాత ఆ పేరు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక చరిత్రగా మిగిలిపోయే పేరు ఇయింది, తన సినీ జీవితం లో ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు అందుకున్న చిరంజీవి ఈ స్థాయికి రావడానికి ఎంతో కస్టపడి ఉంటారు, తన సినిమాలో ఒక పాటలో, చేసే కష్టాన్ని నువ్వే చేయాలి పొందే ఫలాని పంచివ్వాలి అన్నట్టు కన్నీటి కష్టాలు అని తానే భరించి ఎంతో మందికి పూల దారిని పరిచాడు, ప్రజల గుండెల్లో ఎప్పటికి చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు.. ఇదండీ అసలు కథ చిరంజీవి గారికి వచ్చిన ఆ ఒక కల కారణంగా శివ శంకర వర ప్రసాద్ పేరుని చిరంజీవిగా మార్చుకున్నాడు మెగాస్టార్..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles