చైనా గురించి ఎవ్వరికి తెలియని రహస్యాలు

చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు వెళ్తున్న కంట్రీ. ప్రపంచంలోనే టాప్‍ కంట్రీగా ఎదిగేందుకు చకచకా అడుగులు వేస్తోంది. తాజాగా కరోనా వైరస్‍ ఈ దేశంలోనే పుట్టింది. వ్యూహాన్‍లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ చైనాను ఓ విలన్‍గా చూశాయి. అయితే చైనా గురించి మీకు తెలియని రహస్యాలను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.

టాయిలెట్ పేపర్

Close-up of unrecognizable man carrying an abundance of toilet paper


ప్రపంచంలో తొలిసారి టాయిలెట్ పేపర్ కనిపెట్టిన దేశం చైనా. అయితే దీన్ని తొలినాళ్లలో అందరూ ఉపయోగించేవారు కాదు. కేవలం రాజులు, వారి కుటుంబీకులు మాత్రమే వాడేవారు. అనంతరం దాన్ని ప్రపంచ దేశాలు వాడటం మొదలు పెట్టాయి.

అత్యధిక జనాభా


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. సుమారు 140 కోట్లు ఈ దేశ పాపులేషన్. అయితే ఈ దేశంలో ఇంకా అందరికి సొంత ఇండ్లు లేదు. సుమారు మూడున్నర కోట్ల మంది కొండ గుహల్లోనే నివసిస్తున్నారు. ఈ జనాభా ఆస్ట్రేలియా జనాభాకంటే అధికం కావడం విశేషం.

మూత్రంతో కోడిగుడ్లు ఉడకబెట్టుట..


చైనాలో 10 ఏండ్ల లోపు మగపిల్లల మూత్రంతో కోడిగుడ్లు ఉడకబెట్టి తింటారు. చైనాలోని స్కూళ్లలో మూత్ర సేకరణకు ప్రత్యేక పాత్రలను ఏర్పాటు చేస్తారు. సేకరించిన మూత్రంలో గుడ్లు వండి పెడతారు. ఇలా తినడం వల్ల మనుషులకు రోగాలు రావనేది వారి నమ్మకం.

ఐస్ క్రీం పుట్టింది చైనాలోనే

మనందిరీ ఐస్‍ క్రీం ఇటలీలో పుట్టిందని తెలుసు. నిజానికి అది తప్పు. ఐస్‍ క్రీం కనుగొన్నది చైనాలో. సుమారు 4 వేల ఏండ్ల క్రితమే ఈ దేశంలో ఐస్‍ క్రీం తయారు చేసినట్లు ఆధారాలున్నాయి.

విదేశీ వెబ్సైట్లు ఇక్కడ బాన్

చైనాలో సుమారు 3 వేల వెబ్‍ సైట్లపై బ్యాన్‍ ఉంది. ఫేస్‍బుక్‍, గూగుల్, యూట్యూబ్‍, వాట్సాప్‍ సహా పలు సోషల్‍ మీడియా దిగ్గజాలకు సైతం చైనాలో చోటు లేదు. ఎందుకంటే వారికి ప్రతిదానికి ఓ ఆల్టర్నేటివ్ ఉంది. ఉహాహరణకు మనకు వాట్సాప్‍ ఉంటే వారికి వుయ్ చాట్ ఉంది. అందుకే ఇక్కడ విదేశీ వెబ్‍సైట్లపై బ్యాన్‍ ఉంటుంది.

ఎక్కువ పందులు ఉన్న దేశం


ప్రపంచంలోని సగానికిపైగా పందులు చైనాలోనే ఉన్నాయి. ఆదేశ వ్యాప్తంగా సుమారు 470 బిలియన్ల పందులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. రోజుకు పదిన్నర లక్షలకు పైగా పందులను ఆహారంగా ఉపయోగిస్తున్నారు.

అత్యధిక సిమెంట్‍ ఉత్పత్తి


ప్రపంచంలో అత్యధికంగా సిమెంట్ తయారు చేసేది చైనా దేశమే. ప్రపంచానికి ఉపయోగపడే 60 శాతం సిమెంట్‍ చైనాలోనే తయారు కావడం విశేషం.

పాండాలపై పేటెంట్ రైట్స్


ప్రపంచంలోని అన్ని పాండాలపై చైనాకే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచలో అత్యధికంగా ఈ దేశంలోనే పాండాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో పాండాలకు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యులు సైతం పాండాల మాదిరగానే డ్రెస్ వేసుకుని వాటికి వైద్యం చేయడం విశేషం.

బాతులతో కేసుల పరిష్కారం..


ప్రపంచ వ్యాప్తంగా నేరస్తులను గుర్తించేందుకు అనేక దేశాలు కుక్కలను వాడతారు. వాటికి ట్రైనింగ్‍ ఇచ్చి మరీ కేసుల పరిష్కారంలో ఆధారాల సేకరణకు వినియోగిస్తారు. కానీ చైనాలో కుక్కలకు బదులుగా బాతులను వినియోగిస్తారు. బాతులు చురుకైనా చూపుతో ఎన్నో రకాల వాసనలను పసిగడతాయట. అందుకే వీటిని కేసుల్లో ఆధారాల సేకరణకు వాడుతారట.

చైనా ఆర్మీలో పావురాలు..


చైనా ఆర్మీలో ఇప్పటికీ పావురాల సేవలు కొనసాగుతున్నాయి. సుమారు 10 వేల పావురాలకు ట్రైనింగ్‍ ఇచ్చి మరీ రక్షణకు వినియోగిస్తున్నారట. సమాచార మార్పిడితో పాటు నిఘా కోసం వీటిని వాడుతున్నారట. వీటిని రిజర్వ్ పిజెన్స్ అని అక్కడ ఆర్మీ పర్సన్స్ పిలుస్తారు.

కింగ్‍ డమ్ ఆఫ్‍ ది లిటిల్ పార్క్


చైనాలో కింగ్‍ డమ్ ఆఫ్‍ ది లిటిల్ పార్క్ అనే ఓ థీమ్‍ పార్క్ ఉంది. అక్కడ సుమారు 100 మంది మరుగుజ్జులు.. ఆదేశంలోని పురాతన రాజుల వేశాలు వేసుకుని ఉంటారు. అక్కడికి వచ్చే టూరిస్టులను అలరిస్తారు. ఇలాంటి వింత పార్కులు మనం చైనాలో తప్ప మరెక్కడా చూడలేం.

ఇద్దరి కంటే ఎక్కువ వద్దు!


చైనాలో మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదనే నిబంధన ఉంది. ఒక వేళ ఎక్కువ మందిని కంటే ఇక్కడ శిక్ష విధిస్తారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలు వారికి ఇవ్వరు. 2015 వరకు కేవలం ఒక్కరినే కనాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఆ సంఖ్య ఇద్దరికి పెంచింది.

గాలి పటాలు


మన దగ్గర సంక్రాంతి వస్తే పతంగులు ఎగరేస్తాం. కానీ వీటిని మొట్ట మొదటి వీటిని తయారు చేసింది చైనానే. సుమారు 4 వేళ ఏండ్ల క్రితమే వీటిని కనిపెట్టారు. అయితే వీటి ద్వారా అప్పుడు యుద్ధసామాగ్రిని తరలించే వారు. ఆ తర్వాత వీటిని ఎంటర్‍టైన్మెంట్‍ కోసం వాడుతున్నారు.

కుక్కల మాంసం


చైనాలోని యులెన్‍లో ప్రతి ఏటా కుక్కల మాసంతో ఫెస్టివల్‍ నిర్వహిస్తారు. ఈ వేడుక కోసం 10 నుంచి 15 వేల కుక్కలను వినియోగిస్తారు. మొత్తంగా ఈ దేశంలో 20 మిలియన్ల కుక్కలను చంపి తింటారని ఓ అంచనా. అంతేకాదు 4 మిలియన్ల పిల్లులను సైతం చంపి తింటారు.

సైనికుల గడ్డం కింద గుండుపిన్ను


చైనాలో ట్రైనింగ్‍లో ఉన్న సైనికుల మెడల కింద యూనిఫాంకు ఇరువైపులా గుండు పిన్ను పెడతారు. ఎందుకంటే తల కిందికి పెడితే గుచ్చుకుంటుంది. కాబట్టి స్ట్రయిట్‍గా ఉండేందుకు గాను ఈ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles