మన దేశం లో ఎంత మంది సినీ కళాకారులూ ఉన్నా కొంతమంది మాత్రం చరిత్రలో నిలిచిపొయ్యే విధంగా ఉంటారు, ఆ కొంతమందిని వారి అభిమానులు ఆరాధ్య దైవంలాగా కొలుస్తారు,అలాంటి ఐకాన్స్ కి ఏ చిన్న సమస్య వచ్చిన అభిమానులు తల్లడిల్లిపోతారు, ఇక తాము ఆరాధ్య దైవంగా భావించే ఆ ఐకాన్స్ ఇక మన మధ్య లేరు అని తెలిస్తే ఆ అభిమానులు తట్టుకోగలరా, ప్రాణం పోయినంత పని అవుతుంది కదూ, సరిగ్గా ఈరోజు అలాంటి శోచనీయమైన హృదయ విచార సంఘటన చోటు చేసుకుంది, కన్నడ సినీ ప్రజలు ఆరాధ్య దైవంలా భావించే యువ నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు జిమ్ చేస్తున్న సమయం లో అకస్మాతుగా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయారు, ఆయనని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని పోగా అప్పటికే ఆయన తన ప్రాణాలను విడిచి స్వర్గస్తులు అయ్యాడు, ఈ విచారకరమైన సంఘటన కోట్లాది మంది అభిమానులు హృదయాలను కలిచి వేసింది, తమ ఆరాధ్య దైవం ఇక లేరు అనే నిజం ని జీరించుకోలేక గుండెపోటుతో వందలాది మంది పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఈరోజు తమ ప్రాణాలను వదిలారు.

ఇక పునీత్ రాజ్ కుమార్ గారు జిమ్ కి వెళ్తున్న సమయం లో ఒక్క అభిమాని తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది, కానీ దురదృష్టం ఏమిటి అంటే అదే ఆయన సజీవంగా ఉన్నప్పుడు తీసిన ఆఖరి ఫోటో,పునీత్ రాజ్ కుమార్ కి మొదటి నుండి వర్కౌట్స్ అంటే అమిత ఇష్టం, వర్కౌట్ లేని రోజు తనకి అసలు అది మంచి రోజే కాదు అని గతం లో ఆయన అనేక సార్లు చెప్పాడు, ఫిట్నెస్ పరంగా కూడా ఆయన ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాడు,ఆపకుండా వర్కూట్స్ చేసేంత సామర్థ్యం ఉన్న వ్యక్తి కి వర్కౌట్స్ చేసుకుంటున్న సమయం లో ఇలా జరగడం అందరిని కలిచి వేస్తోంది,ఆయన జిమ్ వర్కౌట్స్ చేస్తున్న సమయం లో తీసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, ఇక అవే కాకుండా ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన యువ రత్న సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళతో సంబాషించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఇలా జరగడం ఆయన అభిమానులకే కాదు, యావత్తు సినీ లోకానికి కూడా తీరని దుఃఖం మిగిలించింది.

పునీత్ రాజ్ కుమార్ నిన్న గాక మొన్ననే ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రముఖ హీరో యాష్ తో కలిసి చిందులు వేసాడు, ఈరోజు ఉదయం కూడా ఆయన తన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ కూడా వేసాడు, ఇక ఆయన జిమ్ కి వెళ్తున్న సమయం లో ఒక్క అభిమని తీసిన ఆఖరి ఫోటోని మీరు క్రింద చూడవచ్చు, క్షణ కాలం క్రితం తమతో ఎంతో ఆనందం గా ఉన్న వ్యక్తి అకస్మాతుగా చనిపోవడం అంటే ఆయన కుటుంబీకులకు ఎంతటి శోకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పునీత్ రాజ్ కుమార్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలే, తమ తండ్రి ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ నాన్న నాన్న అంటూ ఏడుస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతున్నాయి, ఆ వీడియో చూసిన ఎవ్వరు అయినా ఏడుపు ఆపుకోకుండా ఉండలేరు, బ్రతి ఉన్నంత కాలం ఎంతో మందికి సేవ కార్యక్రమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలిచినా పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మా ఎక్కడున్నా శాంతించాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాము.
