జూనియర్ ఎన్టీఆర్ జీవితం లో పడ్డ కన్నీటి కష్టాలు

సెలబ్రిటీల జీవితాలు చూస్తుంటే వారికేం తక్కువ అని ఉన్నాయ్ అని అనిపిస్తుంటుంది కానీ మనం మన కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదు.. ముఖ్యంగా కొంత మంది సెలబ్రిటీలు, ఇపుడు వారు ఉన్న స్థాయికి చేరుకోడానికి ఒక యుద్ధమే చేసిన వారు ఉన్నారు.. ఆలా జీవితం తో పోరాడి గెలిచిన వారిలో మన జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, ఆంధ్రా రాష్ట్రానికి అన్నగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ మనవడికి కష్టాల.. అని మీరు అనుకోవొచ్చు, కానీ నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి తన జీవితం తో యెడ తెగని పోరాటం చేసాడు, ఎనో కష్టాలని ఎదురుకున్నాడు.. మన తారక్ తన జీవితం లో పడ్డ కన్నీటి కష్టాల గురించి మనం ఈ వీడియో లో తెలుసుకుందాం,

1983 మే 20 న ఎన్టీఆర్ జన్మించాడు, కారణాలు ఏవైనా నందమూరి కుటుంబం లో ఒకడిగా పెరగలేదు.. అంత పెద్ద కుటుంబం లో పుట్టినప్పటికీ 5 ఏళ్లకే నాట్యం నేర్చుకొని, తనకంటూ ఒక గుర్తింపు రావాలిని జీవితానికి ఎదురీదాడు అందుకు ఫలితంగా 10 ఏళ్ళ వయసుకే 100ku పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చాడు.. కానీ ఇవేవి తనకి సంతృప్తిని ఇవ్వలేదు జీవితం లో ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాడు.. అచ్చు గుద్దినట్టు తాత పోలికలతో పుటినప్పటికీ అందరి పిల్లల చిన్నవయసులో తన తాతో ఆదుకునే అదృష్టం ఎన్టీఆర్ కి దక్కలేదు.. తాను పుట్టిన 13 ఏళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ తన తాతని కలిసాడు అప్పటి వరకు తారక రామ్ గా ఉన్న పేరుని సీరియర్ ఎన్టీఆర్ గారు తారక రామారావు గా మార్చడు, తాత పోలికలు మాత్రమే కాకుండా తాత పేరు ని కూడా పెట్టుకున్న ఎన్టీఆర్ చిన్న వయసు నుండే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు, 1991 లో మొట్ట మొదటి సారి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర పై తెరంగ్రేటం చేసాడు, ఈ సినిమాని సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేయడం విశేషం.. ఆ తర్వాత 1996 లో గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన రామయం సినిమాలో నటించగా ఆ సినిమాకి బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం గా National అవార్డు దక్కింది..

ఆ తర్వాత రాజమౌళి తన మొదటి సినిమా స్టూడెంట్ no 1 కోసం హీరో ని వెతుకుతున్న సమయం లో రాఘవేంద్ర రావు గారు జూనియర్ ఎన్టీఆర్ ని హీరో గా తీసుకోమని రాజమౌళి గారికి సలహా ఇచ్చారు, ఎన్టీఆర్ కెర్ర్ర్ లో హీరో గా సైన్ చేసిన మొదటి సినిమా ఇదే, అయితే ఈ సినిమా ప్రొడక్షన్ లో చాలా సమయం తీసుకుంటూ ఉండడం తో రామోజీ రావు గారు ఎన్టీఆర్ తో నిన్ను చూడాలని సినిమా తీసి విడుదల చేసారు అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షేకులన్నీ ఆకట్టుకోలేలపోంది, ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి ఎన్టీఆర్ వయసు కేవలం 17 ఏళ్ళు, ఆ తర్వాత విడుదల ఐన స్టూడెంట్ నో 1 తో ఎన్టీఆర్ మొదటి విజయం అందుకున్నాడు, అదే ఏడాది సుబు సినిమా కూడా విడుదలైనప్పటి ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది..

ఇక 2002 లో vv వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఆది సినిమా బ్లాక్బస్టర్ హిట్ ఇయింది, అదే ఏడాది విడుదల ఐన చిరంజీవి ఇంద్ర సినిమా కి పోటీ పడి మరి కలెక్షన్స్ ని రాబట్టింది, ఆ తర్వాత బి గోపాల్ దర్శకత్వం లో వచ్చిన అల్లరి రాముడు, a m రత్నం దర్శకత్వం లో వచ్చిన నాగ సినిమాలు నిరాశపరిచినప్పటికీ, రాజమౌళి తో రెండో సారి జత కట్టి సింహాద్రి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, 2003 హైయెస్ట్ grosser గా ఈ సినిమా నిలవడం విశేషం.. సింహాద్రి లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ని మల్లి ప్లాపులు పలకరించాయి.. ఆంద్రవాల, సాంబ, నా అల్లుడు, అశోక్ ఇలా వరుసగా మూడు ప్లాప్ లని అందుకున్న ఎన్టీఆర్ మల్లి కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి సినిమా తీసి ప్లాపుల నుండి ఉపశమనం పొందాడు.. ఆ తర్వాత మల్లి రాజమౌళి తో మూడో సారి జత కట్టి యమదొంగ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 20 kgs తగ్గాడు, ఈ సినిమాకి కి గాను బెస్ట్ ఆక్టర్ గా ఎన్టీఆర్ ఫిలిం ఫేర్ అవార్డు ని అందుకున్నాడు ఆ తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వం లో వచ్చిన కంత్రి సినిమాలో నటించి ఒక ఏడాది పాటు విరామం తీసుకోని 2009 ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేసాడు, తన మాట వాక్చాతుర్యం తో అందరిని ఆకట్టుకున్నాడు, అప్పటికే సినిమాల పరంగా మంచి సక్సెస్ లో ఉన్నాడు, టీడీపీ పార్టీ నుండి ఎన్టీఆర్ కి పిలుపు కూడా వచ్చింది ఇక అంత సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో కార్ ప్రమాదానికి గుర్రయాడు, కానీ ఆ గుండె బ్రతకాలని కొని లక్షల మంది అభిమానులు గుండెల ప్రార్ధన ఫలించింది, ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు..

ఎలక్షన్ క్యాంపైన్ తర్వాత అదుర్స్ ఇంకా బృందావన్ తో హిట్ అందుకున్నాడు, కానీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయకముందే మల్లి శక్తి రూపం లో ఒక డిసాస్టర్ సినిమా ఎన్టీఆర్ ని పలకరించింది, ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి కూడా పెద్దగా ఆకట్టుకోలేపాయింది, మల్లి ఫ్యాక్షన్ సినిమా తో ప్రయత్నించి దమ్ము తీయగా అది కూడా డిసాస్టర్ ఇయింది.. ఆ తర్వాత వచ్చిన బాద్షా పర్వాలేదు అనిపించినా మల్లి రామయ్య వస్తావయ్యా సినిమా ఎన్టీఆర్ ని నిరాశపరిచింది.. ఒక హిట్ కోసం ఆకలి మీద ఉన్న ఎన్టీఆర్ కి పూరి జగన్నాధ్ టెంపర్ రూపంలో ఎన్టీఆర్ ఆకలి తీర్చాడు.. ఆ తర్వాత ఎన్టీఆర్ మల్లి వేణు తిరిగి చూడలేదు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్,జై లవ కుశ సినిమా తో ముందుకు దూసుకెళ్లాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం లో RRR సినిమా తీస్తున్నాడు, ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ని ఎన్టీఆర్ తన కాతాలో వేసుకుబోతున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles