టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అంటూ స్పందించిన సుశాంత్

అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడతరంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకడు. కాళిదాసు సినిమాతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో నటుడుగా మెప్పించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ సుశాంత్ డీలాపడలేదు. రెట్టించిన ఉత్సాహంతో సక్సస్ కోసం ప్రయత్నించాడు. కాళిదాసు సినిమా ఆతర్వాత కరెంట్ అనే మరో సినిమా చేసాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన కరెంట్ మూవీ ఆడియోపరంగా సక్సస్ అయ్యింది కానీ.. సినిమా మాత్రం ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. అయితే.. వెండితెర మీద విజయం సాధించని ఈ సినిమా బుల్లితెర మీద బాగా సక్సస్ అయ్యిందని చెప్పచ్చు. ఎప్పుడు టీవీలో ఈ సినిమాని టెలికాస్ట్ చేసిన టీఆర్పీ రేటింగ్స్ బాగానే వస్తాయని సమాచారం.

సుశాంత్ నటించిన అడ్డా, ఆటాడుకుందాం రా ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా సక్సస్ అందించలేదు. దీంతో ఆలోచనలో పడ్డ సుశాంత్ ఈసారి విభిన్న కథాంశంతో చిలసౌ అనే డిఫరెంట్ మూవీ చేసాడు. ఈ సినిమా ద్వారా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్న ఈ కథ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుశాంత్, రాహుల్ రవీంద్రన్, కథానాయిక రుహనీ శర్మలకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత సుశాంత్ బన్నీ అల.. వైకుంఠపురములో నటించడం విశేషం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల… వైకుంఠపురములో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సుశాంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ ఇచ్చిన విజయోత్సాహం తో సుశాంత్ హీరోగా ఓ డిఫరెంట్ మూవీని స్టార్ట్ చేసారు. అదే ఇచ్చట వాహనాలు నిలుపరాదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుశాంత్. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సుశాంత్ ఓ సందర్భంగా నెటిజన్లతో చాట్ చేస్తూ… తన దృష్టిలో బెస్ట్ డాన్సర్లు ఎవరు, వాళ్లలో ఏ క్వాలిటీ ఇష్టం అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.

ఇంతకీ సుశాంత్ దృష్టిలో బెస్ట్ డాన్సర్లు ఎవరంటే… ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు ఉన్నారు. వెరైటీ డాన్సుల్లో, స్టయిల్ లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అన్నాడు సుశాంత్. పైగా బన్నీతో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో డాన్స్ చేసిన అనుభవం కూడా ఉందిగా. ఇక స్పీడ్, ఈజ్ విషయంలో ఎన్టీఆర్ ను కొట్టేవాళ్లు లేరంటున్నాడు. అంత స్పీడ్ గా డాన్స్ ఎవ్వరూ చేయలేరంటున్నాడు. అదే విధంగా షార్ప్ నెస్, గ్రేస్ విషయంలో రామ్ చరణ్ డాన్స్ అంటే తనకు ఇష్టం అంటున్నాడు. ఇక చివరగా డ్యాన్స్ ల లో అఖిల్ అక్కినేని వైబ్స్, వేవ్స్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు. ఇలా ఇంగ్లిష్ లో రకరకాల పేర్లు పెట్టేసి, ఎవ్వర్నీ నొప్పించకుండా అందరు హీరోల్ని కవర్ చేసి తెలివైనోడు అనిపించుకున్నాడు సుశాంత్. అదీ సంగతి..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles