టీఆర్ఫీ రేటింగ్స్ లో ప్రభంజనం సృష్టించిన వకీల్ సాబ్

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో విడుదల అయినా ఈ సినిమాకి తోలి రోజు నుండే ఎన్నో ఆటంకాలను ఎదురు అయ్యాయి, అయితే ఎన్ని ఆటంకాలు ఎదురు అయినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు రికార్డుల మోత మోగించింది, అయితే కరోనా మహమ్మారి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం, దానికి తోడు ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం టికెట్ రేట్స్ ని దారుణంగా తగ్గించడం తో సినిమా ని కేవలం రెండు వారాలకు థియేటర్స్ నుండి తీసి వెయ్యాల్సి వచ్చింది,ఇదే సినిమా ఒక్క నెల రోజుల ముందు విడుదల అయ్యి ఉంటె నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు,ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం ఒక్క పండగ లాగ జరిగింది అనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా పోయిన ఆదివారం ఈ సినిమాని జీ తెలుగు వారు గ్రాండ్ ప్రీమియర్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే, వెండితెర మీద ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, బుల్లితెర మీద కూడా అలాంటి ప్రభంజనమే సృష్టించింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని జీ తెలుగు లో ఎగబడి మరి చూసారు,అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా టీఆర్ఫీ రేటింగ్స్ దాదాపుగా 32 కి పైగానే వచ్చింది అని, తెలుగు సినిమా హిస్టరీ లోనే ఇది ఒక్క ఆల్ టైం రికార్డు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, గతం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమాకి దాదాపుగా 29 టీ ఆర్ పీ రేటింగ్స్ వచ్చాయి, జెమినీ టీవీ లో ప్రసారం అయినా ఈ సినిమా వకీల్ సాబ్ సినిమా ముందు వరుకు ఆల్ టైం రికార్డు గా నిలిచింది, ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా ఆ రికార్డుని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానం లోకి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే ఈ శనివారం వరుకు వేచి చూడాల్సిందే.

ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా అయ్యప్పనుం కోశియుమ్ అనే రీమేక్ లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ తో పాటుగా దగ్గుపాటి రానా కూడా నటిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నారు,ఇప్పటికే 60 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కరోనా లాక్ డౌన్ కారణంగా భారీ బ్రేక్ తర్వాత ఈరోజు మళ్ళీ షూటింగ్ తిరిగి ప్రారంబించుకుంది, ఈరోజు షూటింగ్ ని ప్రారంభించినట్టు, పవన్ కళ్యాణ్ ఈరోజు షూటింగ్ లో జాయిన్ అయినట్టు ఆ చిత్ర బృందం ఒక్క ఫోటో విడుదల చేసి అభిమానులకు తెలియచేసింది, ఆ ఫోటోని మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక్క పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ని పోషిస్తున్నాడు, ఈ సినిమాతో పాటు ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,దాదాపుగా 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా అతి త్వరలోనే మిగిలిన భాగం కి సంబంధించిన షూటింగ్ ని ప్రారంబించుకోనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles