తన తండ్రి పునీత్ రాజ్ కుమార్ కోసం ఆయన కూతుర్లు ఏడుస్తున్న ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

మన దేశం లో ఎంత మంది సినీ కళాకారులూ ఉన్నా కొంతమంది మాత్రం చరిత్రలో నిలిచిపొయ్యే విధంగా ఉంటారు, ఆ కొంతమందిని వారి అభిమానులు ఆరాధ్య దైవంలాగా కొలుస్తారు,అలాంటి ఐకాన్స్ కి ఏ చిన్న సమస్య వచ్చిన అభిమానులు తల్లడిల్లిపోతారు, ఇక తాము ఆరాధ్య దైవంగా భావించే ఆ ఐకాన్స్ ఇక మన మధ్య లేరు అని తెలిస్తే ఆ అభిమానులు తట్టుకోగలరా, ప్రాణం పోయినంత పని అవుతుంది కదూ, సరిగ్గా ఈరోజు అలాంటి శోచనీయమైన హృదయ విచార సంఘటన చోటు చేసుకుంది, కన్నడ సినీ ప్రజలు ఆరాధ్య దైవంలా భావించే యువ నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు జిమ్ చేస్తున్న సమయం లో అకస్మాతుగా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయారు, ఆయనని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని పోగా అప్పటికే ఆయన తన ప్రాణాలను విడిచి స్వర్గస్తులు అయ్యాడు, ఈ విచారకరమైన సంఘటన కోట్లాది మంది అభిమానులు హృదయాలను కలిచి వేసింది, తమ ఆరాధ్య దైవం ఇక లేరు అనే నిజం ని జీరించుకోలేక గుండెపోటుతో వందలాది మంది పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఈరోజు తమ ప్రాణాలను వదిలారు.

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పెద్దగా పరిచయం లేని పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే వార్త తెలిసి మనమే ఇంత బాదపడుంటే, కోట్లాది మంది అభిమానులు ఉన్న కర్ణాటక రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు, కర్ణాటక ప్రజలు అమితంగా ప్రేమ చూపించేవి కేవలం రెండిటి పైనే,ఒక్కటి వాళ్ళు ఎంతగానో అభిమానించే బాషా మరియు రెండోది రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ, రాజ్ కుమార్ గారు స్వర్గస్తులు అయ్యి ఇనాళ్ళు గడుస్తున్నా ఇప్పటికి కన్నడ ప్రజల ప్రతి ఇంటిలో రాజ్ కుమార్ గారు ఫోటో కచ్చితంగా ఉంటుంది, అక్కడి ప్రజలు ఆయనని ఆ స్థాయిలో అభిమానిస్తూ గుండెల్లో పెట్టుకున్నారు , ఇక ఆయన తర్వాత అదే స్థాయిలో ప్రజాదరణ పొందిన హీరో ఆయన చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గారే, చిన్న పిల్లల నుండి యూత్ వరుకు , ఫామిలీస్ నుండి మాస్ ఆడియన్స్ వరుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో పునీత్ రాజ్ కుమార్, ఆయన చివరి సారిగా వెండితెర మీద కనిపించిన సినిమా యువ రత్న, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో విడుదల అయినా ఈ సినిమా భారీ హిట్ అయ్యింది.

పునీత్ రాజ్ కుమార్ నిన్న గాక మొన్ననే ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రముఖ హీరో యాష్ తో కలిసి చిందులు వేసాడు, ఈరోజు ఉదయం కూడా ఆయన తన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ కూడా వేసాడు, ఇక ఆయన జిమ్ కి వెళ్తున్న సమయం లో ఒక్క అభిమని తీసిన ఆఖరి ఫోటోని మీరు క్రింద చూడవచ్చు, క్షణ కాలం క్రితం తమతో ఎంతో ఆనందం గా ఉన్న వ్యక్తి అకస్మాతుగా చనిపోవడం అంటే ఆయన కుటుంబీకులకు ఎంతటి శోకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పునీత్ రాజ్ కుమార్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలే, తమ తండ్రి ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ నాన్న నాన్న అంటూ ఏడుస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతున్నాయి, ఆ వీడియో చూసిన ఎవ్వరు అయినా ఏడుపు ఆపుకోకుండా ఉండలేరు, బ్రతి ఉన్నంత కాలం ఎంతో మందికి సేవ కార్యక్రమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలిచినా పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మా ఎక్కడున్నా శాంతించాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles