త్రివిక్రమ్ డైరెక్టర్ అవ్వకముందు ఎన్ని హిట్ సినిమాలకి డైలాగ్లు రాశాడో తెలుసా..?

ఒక బంతిని ఎంత గట్టిగ కిందికి కొడితే అంత వేగంగా పైకి లేస్తుంది అనడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం, అతని మాట్టలోనే ఒక మ్యాజిక్ ఉంటుంది అందుకే అతడిని మాటల మాంత్రికుడు అని తెలుగు సినిమా అభిమానులంతా ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు.. కానీ ఒక మనిషికి సక్సెస్ లేకుంటే ఎంతో మంది వేలెత్తి చూపడం మొదలు పెడ్తారు, సర్రిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి విషయంలో కూడా అదే జరిగింది, అగ్న్యాతవాసి సినిమా డిసాస్టర్ అవ్వడం తో ఒక్కసారిగా అందరూ తాను ఇచ్చిన హిట్ సినిమాలు మర్చిపోయి ఇలాంటి సినిమా తీసాడు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు, ఆలా ట్రోల్ చేసిన వారి చెంప పగిలేలా, ఆలా వైకుంఠపురం సినిమాతో మనముందుకు వచ్చాడు.. ఎవరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ పని ఇయిపోయింది అని అన్నారో వాళ్ళచేతే శబాష్ అనిపించుకున్నాడు, ఐతే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా తీసిన సినిమాల గురించి మనందరికి తెలుసు కానీ అతను డైరెక్టర్ కాకకుందు ఎన్నో హిట్ సినిమాలకి కథలని అందిచాడు అని మీకు తెలుసా..? మాటల మాంత్రికుడు డైలాగ్లు రాసిన ఆ హిట్ సినిమాలు ఏంటో మనం తెలుసుకుందాం,

ఈ భీమవరం బుల్లోడు అసలు డైలాగ్స్ రాయాలని అనుకోలేదు అంట, హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఇతను సునీల్ తో కలిసి ఉండే వాడు అపుడపుడే సునీల్ కి సినిమాల్లో మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయ్, తన ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా డైరెక్టన్ ఛాన్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉండడం గమనించిన సునీల్, త్రివిక్రమ్ గారిని గౌతమ్ రాజు గారికి పరిచయం చేసాడు, గౌతమ్ రాజు ఆ తర్వాత త్రివిక్రమ్ ని t d v ప్రసాద్ కి పరిచయం చేయగా తాను అపుడు చేస్తున్న సినిమా కి క్లైమాక్స్ రాయమని త్రివిక్రమ్ కి చెప్పారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన క్లైమాక్స్ నచ్చడం తో ప్రసాద్ గారు త్రివిక్రమ్ ని కే విజయ్ భాసకర్ దెగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలోనే త్రివిక్రమ్ గారికి స్వయంవరం సినిమా కి డైలాగ్లు రాసే అవకాశం వచ్చింది, మొదటగా స్వయంవరం సినిమాకి డైలాగ్లు రాసినప్పటికీ తాను డైలాగ్లు రాసిన మరో సినిమా నువ్వేకావాలి ముందు విడుదల ఇయింది, ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ఏ create చేసింది, ఈ సినిమా తర్వాత తరుణ్ కి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.. ఆ తర్వాత అదే ఏడాది విడుదల ఐన చిరునవ్వుతో సినిమాకి డైలాగ్లు రాసారు, ఈ సినిమా కూడా హిట్ అవ్వడం తో ఏకంగా విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ ఇంకా మల్లేశ్వరి సినిమాలకి డైలాగ్లు రాసే ఛాన్స్ కొట్టేసాడు ఈ రెండు కూడా బ్లాక్బూస్టర్ హిట్ కొట్టడం తో మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకి డైలాగే రాసే అవకాశం దక్కిన్చుకున్నాడు, ఈ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ని మన్మథుడిగా మార్చిన సినిమా మన్మధుడికి కూడా త్రివిక్రమ్ డైలాగ్లు రాసాడు.. ఇవ్వండి త్రివిక్రమ్ డైరెక్టర్ అవ్వకముందు డైలాగ్ రైటర్ గా పని చేసిన సినిమాలు.. అయితే త్రివిక్రమ్ డైలాగ్లు రాయడమే కాదు ఒక రాజు ఒక రాణి సినిమా లో ఒక పాటు కూడా రాసారు అంతే కాకుండా నువ్వే నువ్వే సినిమాలో కంప్యూటర్లు ఆర్ట్స్ సైన్స్ maths commerce అనే పాటకి తన స్వరాన్ని కూడా అందించాడు..

ఎంత ఎత్తుకి ఎదిగిన వొదిగి ఉండాలి అనేది త్రివిక్రమ్ దెగ్గరే చేసి నేర్చుకోవాలి, ఆలా వైకుంఠపురం సినిమా తో నాన్ బాహుబలి రికార్డ్స్ అని బద్దలు కొట్టినప్పటికీ తాజాగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో, త్రివిక్రమ్ మాట్లాడుతూ స్వయం వరం సినిమా తర్వాత తనకి ఎవ్వరు అవకాశాలు ఇవ్వలేదు అని తాను కూడా ఇండస్ట్రీ వదిలి బీమవరం వెళ్లిపోయానని అయితే అలంటి సమయం లో రవి కృష్ణ గారు తనని పిలిచి నువ్వే కావాలి సినిమా కి డైలాగ్లు రాసే అవకాశం ఇచ్చాడు అని చెప్తూ అదే స్టేజి పైన రవి కృష్ణ గారికి పాదాభివందనం చేసి అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మిమల్ని అభిమానించే మాలాంటి వాళ్ళ కోసం మీరు గొప్ప గొప్ప సినిమాలు తీయాలని మేము కూడా మసపూర్తిగా కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles