థియేటర్లలో ఎక్కువ రోజులు తమ సత్తా చాటిన తెలుగు సినిమాలు

హెల్లొ.. వ్యువర్స్ .. థియేటర్లలో ఎక్కువ రోజులు తమ సత్తా చాటిన తెలుగు సినిమాలలో మొదటి భాగంలో లవకుశ, అడవిరాముడు, వేటగాడు, మరో చరిత్ర, ప్రేమ సాగరం, ప్రేమాభిషేకం చిత్రాల విశేషాలు చూసాం కదా. ఈ ఎపిసోడ్ లో మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్ర విశేషాలు చూద్దాం.

నట సింహం నందమూరి బాలకృష్ణ బానుమతి రామకృష్ణ, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మంగమ్మ గారి మనవడు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై యస్.గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళ్ సినిమా మణ్ వాసనై చిత్రానికి రీమేక్ చేశారు. తమిళ్ ఒరిజినల్ కు భారతీరాజా డైరెక్షన్ చేశారు. బాలయ్య బాబు బాల నటుడిగా తొలి చిత్రం అయినటువంటి తాతమ్మ కల కాంబినేషన్ గుర్తుకు వచ్చేలా బానుమతీ బాలకృష్ణ కు తాతమ్మా గా ఈ మంగమ్మ గారి మనవడు లో నటించారు. కె.v మహదేవన్ సంగీతం లో వచ్చిన ప్రతి పాట ఓ ఆణిముత్యం. సెప్టెంబర్ 9, 1984 లో విడుదలైన ఈ చిత్రం సిల్వర్ జూబిలీ వైపు పరుగులు తీసింది. బాలయ్య బాబుకు సోలో హీరోగా మొట్ట మొదటి వంద రోజుల చిత్రంగా రికార్డులు సృష్టించడమే కాకుండా కర్ణాటక లో సైతం వంద రోజులు, హైదరాబాద్ లో ఏకంగా 565 రోజు లు ప్రదర్శించబడి నందమూరి అభిమాులకు ఓ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇక.. 2009 లో వచ్చిన మగధీర చిత్రం విషయానికొస్తే మెగా పవర్ స్టార్ రాంచరణ్ ,దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫీస్ లెక్కలు తిరగరాసి విజువల్ వండర్ గా కీర్తి పతాకాన్ని ఎగుర వేసింది. రాజమౌళి పేరు మారుమోగడంతో పాటు రామ్ చరణ్ , కాజల్ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ , ఎంఎం కీర వాణి సంగీతం ఈ చిత్రాన్ని శిఖరాగ్రాన నిల్చోపెట్టడమే కాకుండా ఏకంగా థియేటర్స్ లో వెయ్యి రోజులకు పైగా సందడి చేసి మెగాభిమానులకు తిరుగులేని ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇప్పుడు..సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గురించి చెప్పుకుని తీరాల్సిందే. మహేష్ బాబుని ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ చేసిన మూవీ .. డైలాగ్స్ దగ్గరనుంచి లుక్ వరకు అన్ని సరికొత్తగా వెండితెరపై ఆవిష్కరించి వసూళ్ల తో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా అదే పోకిరి. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వెయ్యి రోజులకు పైగా సినిమా హల్లలో సందడి చేసింది.

ఇక..అత్యంత ప్రేక్షకాదరణ తో థియేటర్లో బాక్సాఫీస్ రికార్డులు దుమ్ము దులిపి న చిత్రం నందమూరి నటసింహం బాలకృష్ణ లెజెండ్ మూవీ.
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాలయ్య బాబును ఓ సరికొత్త కోణంలో అవిస్కృతం చేసిన సినిమా.అందుకే ఈ చిత్రం 1005 రోజులు విజయ వంతంగా ప్రదర్శింప బడి రికార్డులు కొల్లగొట్టింది.

సో..చూసారు కదండీ..ప్రేక్షకులు తలచుకుంటే సినిమా ఈ రేంజ్లో ఆడుతుందో మరి..ఇలాంటి ఇంటరెస్టింగ్ కంటెంట్ తో మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles