నరకం లో విధించే శిక్షలు

పాపాలు చేసినవారు నరకానికి వెళ్తారు కానీ ఎ పాపానికి ఎ  శిక్ష అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మన జీవితం కాలానికి అనుగుణం గా ఉండాలి. ఈ ప్రపంచానికి మనం అతిధులం మాత్రమే. ఇక్కడ ఎవరైనా సరే వారివారి బాధ్యతలను నిర్వహిస్తు ఇతరుల జీవితాలకు ఎ హాని కలగకుండా బ్రతకాలి అలా బ్రతికిన మనుషులే మహనీయులు అవుతారు. అలా కాకుండా స్వార్ధం కుట్ర అసూయల తో పక్క వాడి చెడు కోరుకుంటే నరకం లో శిక్ష తప్పదు. అయితే నరకం లో శిక్ష లు కూడా ఒక్క పద్దతి ప్రకారం అమలు పరుస్తారు. అష్టదశ పురాణాలని వ్యాసమహర్షి ఉపదేశం తో విగ్నేశ్వరుడు తన స్వహాస్థలతో రచించాడు.అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం లో పాపాలకు  విధించాల్సిన శిక్షలను వివరించారు. శ్రీ మహావిష్ణువు తన వాహనం అయినా గరుత్మంతుడికి  ఈ పాపాలు – శిక్షలు అనే విషయాన్నీ వివరించాడు  అందుకే ఈ గ్రంధాన్ని గరుడ పురాణం అంటారు. మనిషి శరీరాన్ని వదిలి  ఆత్మ వెళ్తుంది. వైతరని దాటాక ఆ ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరం కి అన్ని స్పర్శలు బాధ లు తెలుస్తాయి. రక్త మాంసలతో ఆ శరీరం నిజశరీరం లానే ఉంటుంది. కానీ ఆ శరీరం మంటలో పూర్తిగా కాలిపోదు. తర్వాత అన్ని ఆత్మలను ఒక్క వరుసలో ఉంచి వారి పాపాలను లెక్కగట్టి ఎవరు ఎ శిక్షకు అర్హులో ఆ వరుసలోకి పంపుతారు. అప్పుడు మొదలవుతుంది అసలు ఆట. కన్నుమిన్ను  కానకుండా తన పర బేధం లేకుండా దైవం చూస్తాడు అనే భయం లేకుండా చేసిన పనులన్నీ ఒక్క సరిగా నీ ముందుకు వచ్చేస్తాయి. నీ లో రాక్షసున్ని నీకు పరిచయం చేస్తారు.

ఎవరు చూడట్లే అని ను చేసిన పాపాలు, ఎవరు వినట్లే అని ను పలికిన మాటలు, అన్ని నీ ముందుకు వస్తాయి. ఇపుడు ఏడుస్తే ఏమి లాభం లేదని జీవం తో ఉన్నపుడే నీ శరీరాన్ని,ఆలోచనని దగ్గర పెట్టుకొని జీవించాలని అర్ధం అవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. నీ కోసం నీ కు కేటాయించిన శిక్ష సిద్ధం గా ఉంటుంది. ఇక ఈ గరుడ పురాణం గ్రంధం లో రకరకాల శిక్షలు ఉన్నాయ్. మనిషి పాపాల ను అనుసరించి శిక్షలు విధిస్తారు. ఇందులో రకరకాల శిక్షలు ఉంటాయి ఇందులో. ఇతరుల సొమ్ము కాజేసిన వారికీ తమిసరం శిక్ష  విధిస్తారు, భార్య భర్తలు ఒకరిని ఒకరు మోసాగిస్తే “అంద తంత్రశం ” అనే శిక్ష విధిస్తారు. ఇందులో వేడి గా కాల్చిన చూవ్వలను శరీరం లోకి దింపుతారు. రౌరవం అనే శిక్ష ఇతరుల భూములు అన్యాయం గా కొల్లగొట్టే  వాళ్లకి విధిస్తారు. అందులో రురు అనే విశాసర్పం తో కరిపించి కరిపించి హింసిస్తారు. “మహా రౌరవం” పూర్వికుల ఆస్తులు వారసులకి అందకుండా చేసే వారికీ విధిస్తారు.

మూగజీవుల ను హింసించే వారి కి కుంబిపాకం విధిస్తారు. సల సల కాగె నూనె లో వేయిస్తారు. ఇక ఇంటికి వచ్చిన అతిధులకు సరిగ్గా భోజన సదుపాయలు చెయ్యకపోతే పురుగులని తినిపిస్తారు., ఆడవారిని మోసగిస్తే ప్రయోధకం అనే శిక్ష అమలు చేస్తారు. అబద్దాలు చెప్పే వారికీ అవిసి అని శిక్ష విదిస్తారు. ఎత్తాయినా కొండ నుండి కిందకు తోసి విరిగి పోయిన శరీరాన్ని మళ్ళీ కొండ మీదనుండి తోసేస్తారు.అమాయకులను మోసాగిస్తే సుల ప్రోతం  అనే శిక్ష విధిస్తారు. ఇందులో ఒక్క గుహలో ఆకలి దప్పులతో  అలమటించేలా చేస్తారు. శరమార్ధకం ఇది చాలా మందికి అమలయ్యే శిక్ష. స్వార్ధం తో పక్కవారిని సూటి పోటీ మాటలతో వేదిస్తూ వాల్ల ఏడుపుకు కారణం అయ్యే వాళ్లకు ఈ శిక్ష విధిస్తారు. ఒక పెద్ద చెక్క దూలనికి కట్టి ఇనుప కడ్డీలు కాల్చి వంటిమీద వాతలు పెడ్తారు. ఇలా అయితే చాలా న్యూస్ ఛానల్ల anchor లకు ఈ శిక్ష కచ్చితం గా పడుతుందేమొ.. ఇక అధికార దుర్వినియోగం చేసే వారికీ వైతరిని శిక్ష విధిస్తారు. వైతరిని యామపురి లో ఉండే నది. అందులో చీము నెత్తురు మనిషి శరీర భాగాలు తెలుతూ ఉంటాయి. అందులో పాపులని వేసి ఆ నీటిని తాగిస్తారు.

ఈ దేహం ఈ జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మంచిపనులకి ఉపయోగించి సన్మార్గం లో నడుస్తూ మరణించిన తర్వాత దైవం లో లీనం అవ్వాలి. అలా కాకా దేహ సుఖలకు, ధన వ్యామోహలకు లొంగిపోయి పాపాలు చేస్తే జీవిత కాలం కన్న ఎక్కువ కాలం నరకం లో గడపాల్సి వస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles