అక్కినేని నాగ చైతన్య – సమంత అక్కినేని జంటగా నటించిన తాజా చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పెళ్లైన తర్వాత చైతన్య – సమంత కలిసి నటించిన సినిమా కావడంతో ఈ విభిన్న ప్రేమకథా చిత్రం మజిలీ పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకాభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూసారు. ఈ సినిమా 2019లో ఏప్రిల్ 5న మజిలీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.

ఈ సినిమా తెర వెనక ఏం జరిగిందంటే.. ఈ సినిమా టైమ్ లో నాగ చైతన్య వరుస ప్లాప్స్ తో సతమతమౌతున్నాడు. యుద్ధంశరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి.. ఈ మూడు సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. వీటిలో శైలజారెడ్డి అల్లుడు కాస్త బెటర్. అయితే.. ఇలా వరుస ప్లాపులతో డీలీపడ్డ చైతన్యకి మజిలీ సినిమా చాలా ఇంపార్టెంట్. దీనికి తోడు పెళ్లైన తర్వాత చైతన్య – సమంత కలిసి నటించిన ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలి. అందుచేత సమంత ఈ సినిమాని చాలా సీరియస్ గా తీసుకుంది.

ఈ సినిమా సక్సస్ కాకపోతే చైతన్య కెరీర్ ఏమౌతుందో అని ఒక వైపు… సమంత చైతన్య లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఫ్లాప్ వచ్చిందంటే.. ఎవరు ఏమంటారో ఎలాంటి కామెంట్స్ వస్తాయో అనే టెన్షన్ మరో వైపు…. ఇలా సమంత ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడింది. తిరుపతి మెట్లు ఎక్కి దేవుడా… ఈ సినిమా సక్సస్ చేయాలని ప్రార్ధించింది. ఆఖరికి మజిలీ రిలీజైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అప్పుడు సమంత సంతోషం చూడాలి. ఏం మాట్లాడాలో.. ఎలా స్పందించాలో కూడా తెలియక ఆమె కళ్లంట నీళ్లు వచ్చేసాయి అంటే.. ఈ సినిమా సక్సస్ కోసం సమంత ఎంతలా తపించిందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే… చైతన్య, సమంత నటన, కథ, కథనం, డైలాగులు, గోపీసుందర్, తమన్ సంగీతం
విష్ణు శర్మ కెమెరా వర్క్.. ఇలా ప్రతిదీ ఫర్ ఫెక్ట్ అనేట్టుగా కుదిరింది. థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుడు ఒక్కసారి కథ స్టార్ట్ కాగానే కనెక్ట్ అయిపోతాడు అని డైరెక్టర్ శివ నిర్వాణ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. శివ చెప్పినట్టుగా.. నిజంగానే ఒక్కసారి స్టోరీ స్టార్ట్ కాగానే అన్నీ మరచిపోయి కథతో ట్రావెల్ అవుతారు. అక్కడ నాగ చైతన్య కనిపించడు. పూర్ణ పాత్రే కనిపిస్తుంది. నాగ చైతన్య ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు అని చెప్పచ్చు.

పూర్ణ జీవితాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడా చైతన్య నటించాడు అనిపించదు. జస్ట్ పాత్రకు తగ్గట్టుగా బిహేవ్ చేసాడు అంతే అనిపిస్తుంది. అంత అద్భుతంగా నటించాడు. ప్రేమ, కోపం, బాధ..ఇలా ఓ భగ్న ప్రేమికుడు ఫీలింగ్స్ అన్నింటినీ కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఇలా పూర్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పూర్ణ తర్వాత చెప్పుకోవాల్సింది. శ్రావణి పాత్ర గురించి. తను ప్రేమించినవాడు భర్తగా తన లైఫ్ లోకి వచ్చినా…ఆమెని ప్రేమించకపోవడంతో ఓ వైపు బాధ, మరో వైపు అతని పై ప్రేమను..తనదైన శైలిలో చూపించి మరోసారి అద్భుతమైన నటి అనిపించుకుంది సమంత.

దివ్యాన్ష కౌశిక్ అన్షు పాత్రలో పాత్రకు తగ్గట్టుగా నటించింది. లవ్లెటర్లో రాసుకున్న అమ్మాయి పేరే వెడ్డింగ్ కార్డు మీద ఉండదు రా..వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే వస్తారని నువ్వే నిరూపించావ్.. ఈ డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. రావు రమేష్, పోసాని కృష్ణ మురళి పాత్రలు సన్నివేశానికి తగ్గట్టు ఓసారి నవ్విస్తూ.. ఓసారి ఆలోచింపచేస్తూ..మరోసారి ఏడిపిస్తూ..ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ మజిలీ సినిమాతో… చైతన్య, సమంత మరోసారి మాయ చేసారు. మజిలీతో మంచి విజయం సాధించారు. మంచి సినిమా అందించారు. మరి… మజిలీతో మాయ చేసిన ఈ జంట చైతు – సామ్ కలిసి త్వరలో మరో సినిమా చేస్తారని.. మరో విజయా సాధిస్తారని ఆశిద్దాం.
