నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఎక్సక్లూసివ్ గా మీ కోసం

ఈ ఏడాది అక్కినేని ఫామిలీ హీరోలకు అద్భుతంగా కలిసి వచ్చిన ఏడాది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,చాలా కాలం నుండి బాక్స్ ఆఫీస్ రేస్ లో వెనకబడిన అక్కినేని హీరోలు ఈ ఏడాది వరుసగా హిట్ మీద హిట్ కొట్టి తమ స్టామినా ఇంకా ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించుకున్నారు, తొలుత ఈ ఏడాది అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు, అసలే ఆఫీసర్,మన్మధుడు 2 వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ తో పూర్తిగా మార్కెట్ కోల్పోయ్యే స్థానినికి వచ్చిన నాగార్జున కి వైల్డ్ డాగ్ సినిమా కాస్త ఊరట ని ఇచ్చింది, కానీ ఆయన దురదృష్టం కొద్దీ ఆ సినిమా వచ్చిన సమయానికి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయం దక్కలేదు, కానీ రివ్యూస్ మాత్రం అద్భుతంగా వచ్చాయి,ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ మరియు అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి, ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమా అయితే కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో థియేటర్స్ లో విడుదల అయ్యి కాసుల కనక వర్షం కురిపించింది, మొత్తానికి ఈ సినిమాకి ఇప్పటి వరుకు ఎంత వసూళ్లు వచ్చాయి, ఎంత లాభాలు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.

లవ్ స్టోరీ సినిమా పై మొదటి నుండి అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి, ఎందుకంటే ఫిదా వంటి సెన్సషనల్ హిట్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడం, దానికి తోడు విడుదల అయినా ప్రతి ఒక్క పాట సెన్సషనల్ హిట్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ ని సంపాదించుకోవడం, ఇక అక్కనేని నాగ చైతన్య మరియు సాయి పల్లవి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇలా అన్ని కలిసి వచ్చి ఈ సినిమా పై అంచానాలు భారీ స్థాయిలో పెంచేలా చేసాయి, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు నుండి అద్భుతమైన వసూళ్లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోయింది, ఈ సినిమాకి మొదటి నుండి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది, దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరుకు జరిగింది, కానీ ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్స్ సమస్య ఇంకా సర్దుబాటు కాకపోవడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని 32 కోట్ల రూపాయలకు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది,అంటే దాదాపుగా 8 కోట్ల రూపాయిలు తగ్గింది అన్నమాట.

32 కోట్ల రూపాయిలు వస్తే ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టే, ఆ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే అనూహ్యంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు చేసి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రం గా నిలిచింది , ఇక మూడు రోజులో అక్షరాలా 23 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా తోలి వారం లోనే 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది, అలా కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్స్ తోనే నాగ చైతన్య తన సత్తా చూపించాడు, ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా అక్షరాలా 37 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి నాగ చైతన్య కెరీర్ లోనే రెండవ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, దీనికి ముందు ఆయన నటంచిన మనం సినిమా 45 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది, ఇక ఆ తర్వాత ఆయన నటంచిన మజిలీ సినిమా 35 కోట్ల రూపాయిలు వసూలు చేసి మూడవ స్థానం లో నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles