పబ్లిక్ గా అందరి ముందు కొట్లాడుకున్న ప్రకాష్ రాజ్ మరియు నరేష్

దాదాపు నెల రోజులు నుండి మన టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు గురించి ఎలాంటి రగడ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,మా అసోసియేషన్ ప్రెసిడెంట్౫ గా నిలబడిన ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు లు నువ్వా నేనా అనే రేంజ్ తలపడ్డారు, గెలుపు నాది అంటే నాది అంటూ ఇద్దరు బహిరంగంగానే సవాలు విసురుకున్నారు,సోషల్ మీడియా లో అయితే ప్రకాష్ రాజ్ కి అద్భుతమైన సపోర్టు వచ్చింది, కానీ ఓట్లు వేసేది సామాన్య జనాలు కాదు కదా, ఇండస్ట్రీ లో నటీనటులు,అందుకే ప్రకాష్ రాజ్ ఓడిపోవాల్సి వచ్చింది, ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం మా ఎన్నికలలో కూడా ప్రాంతీయ వాదన తీసుకొని రావడమే, ప్రకాష్ రాజు మన తెలుగు బాషా వాడు కాదు, పరాయి బాషా కి చెందినవాడు,అందుకే మేము తెలుగు వాడైన మంచు విష్ణు కి ఓటు వేస్తాము అంటూ ఏకంగా ఇండస్ట్రీ లో లెజండరీ నటులు అయినా కోట శ్రీనివాస రావు వంటి వారెందరో బహిరంగంగా మంచు విష్ణు కి మద్దతు పలికారు, వాస్తవానికి ప్రాంతీయ వాదన తీసుకొని రావడం అనేది అత్యంత నీచమైన చర్య అని చెప్పక తప్పదు, ప్రకాష్ రాజ్ ని మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా పరాయి రాష్ట్రానికి చెందిన వాడు అని, ఆయన బాషా తెలుగు కాదు అని ఈనాడు అనుకోలేదు.

ఇది ఇలా ఉండగా మనం ఇన్ని రోజులు సినిమాల్లోనే హీరోలు విల్లన్లు కొట్టుకోవడం చూసి ఉంటాము, కానీ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో కూడా సినీ నటులు ఒక్కరినోక్కరు కొట్టుకున్నారు, ప్రముఖ నటి హేమ నటుడు శివ బాలాజీ చేతిని అతి దారుణంగా కొరికిన ఘటన పెను దుమారమే రేపింది, ఇక మోహన్ బాబు అందరి ముందరే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడు అయినా బెనర్జీ చంపేస్తాను జాగ్రత్త అంటూ బెదిరింపులు చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏమిటి అంటే ఇండస్ట్రీ లో దిగ్గజ నటుల హోదా లో ఉన్న ప్రకాష్ రాజ్ మరియు నరేష్ వంటి వారు వందలాది మంది చూస్తున్న సమయం లో దిగజారి ఒక్కరిని ఒక్కరు తిట్టుకోవడం, కొట్లాడుకోవడం ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు,ప్రకాష్ రాజ్ అయితే నరేష్ ప్రవర్తిస్తున్న తీరుకి ఆగ్రహించి ‘రారా నాకొడక…దమ్ముంటే నన్నుకొట్టారా చూద్దాం ‘ అంటూ నరేష్ పైకి దూసుకెళ్లాడు, దీనితో నరేష్ ఒక్కసారిగా అక్కడి నుండి పరుగులు తీసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, ఎన్నికలు నిర్వహించే పెద్దలు ప్రకాష్ రాజ్ ఆవేశం ని కంట్రోల్ చెయ్యడానికి ఎంత ప్రయత్నం చేసిన అది సాధ్యపడలేదు.

ఇది ఇలా ఉండగా ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మెగా ఫామిలీ ని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో ఆయన పై తీవరమైన విమర్శలు చేసేలా చేశాయి, వాస్తవానికి ఈసారి మా ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ ని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని సినీ పరిసమాకీ చెందిన కొంత మంది పెద్దలు నిర్ణయించారు, అదే విధంగా ప్రణాళికలు జరుగుతన్న సమయం లో మంచు విష్ణు నేను కూడా ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాను అంటూ ముందుకి వచ్చాడు,అప్పటి వరుకు ఎన్నికల ప్రస్తావన లేకుండా ఉన్న పరిస్థితిలో మంచు విష్ణు రావడం తో ఇక ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, అయితే చిరంజీవి ముందుగా ప్రకాష్ రాజ్ ని ప్రెసిడెట్ గా ఏకగ్రీవం చేద్దాం అనుకున్నాం కదా, మంచు విష్ణు ఈ ఎన్నికలకు తప్పుకోవచ్చు కదా అని అడిగాడు అట, దీనిని మంచు విష్ణు ఎదో చిరంజీవి నన్ను తొక్కాలని ప్రయత్నం చేసినట్టు మీడియా ముందు అసత్య ప్రచారం చేసాడు, కానీ మోహన్ బాబు స్వయంగా ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో ఇదే ప్రశ్న ని రాధా కృష్ణ మోహన్ బాబు ని అడగగా అలాంటిది ఏమి లేదు అని స్వయంగా ఆ నోటితోనే చెప్పాడు, కావాలంటే ఆ ఇంటర్వ్యూ ని మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు తన కొడుకుతో అసత్య ప్రచారం చేయిస్తూ తన వంకర బుద్దిని మరోసారి చాటుకున్నాడు అంటూ మోహన్ బాబు మరియు అతని పుత్ర రత్నం పై సోషల్ మీడియా లో నెటిజెన్లు విరుచుకు పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles