తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు,కోట్లాది మంది అభిమానులు ఆయనని ఒక్క దేవుడిలా కొలుస్తారు, ఇక టాలీవుడ్ లో కూడా సెలెబ్రిటీలు పవన్ కళ్యాణ్ ని ఎన్నో సందర్భాలలో పొగడ్తలతో ముంచి ఎత్తిన సంగతి మన అందరికి తెలిసిందే,ఆయనని అంతలా వాళ్ళు అభిమానించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం ప్రధాన కారణం అని చెప్పొచ్చు..తన దగ్గర తక్కువ డబ్బులు ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఆపద వస్తే సహాయం చేయడం లో ఏ మాత్రం వెనకాడలేదు, అందుకే పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ లో అంత మంచి పేరు ఉంది, ఇక ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ని కేవలం ఒక్క సినిమా హీరో గా చూడకుండా తమ ఇంట్లోని సొంత మనిషి లా చూసుకుంటారు, అందుకే హాట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికి తిరగకుండా అలాగే ఉంది,అయితే ఇటీవల జరిగిన ఒక్క సంఘటన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి అద్దం పట్టేలా ఉంది,అదేమిటో ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే కరోనా కష్ట సమయం లో ప్రభుత్వాలు ఎలా పని చేసిన మన టాలీవుడ్ హీరోలు మాత్రం తమ వంతు సహాయం గా ఎన్నో సేవ కార్యక్రమాలు మరియు దాన ధర్మాలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధులకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు పైగా విరాళం ని అందించాడు,ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ వంటి వారు ఈ కష్ట సమయం లో ఎలా ఆడుకున్నారో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు, బాలకృష్ణ కూడా తన బసవ తారకం హాస్పిటల్ కి వచ్చిన విరాళాలను కరోనా బాధితుల సహాయం కోసం వినియోగించారు, ఆయన చేస్తున్న మంచి పనులను గుర్తించి టాలీవుడ్ కి సంబంధించిన సెలెబ్రిటీలు అందరు బసవ తారకం హాస్పిటల్ కి విరళాలు అందిచారు, వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక్కరు, ఈయన బసవ తారకం హాస్పిటల్ కి దాదాపుగా ఒక్క కోటి రూపాయిలు విరాళం అందించినట్టు సమాచారం, ఈ విషయం స్వయంగా నందమూరి బాలకృష్ణ తెలియ చేసారు, ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకం తో ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ బసవ తారకం హాస్పిటల్ కి విరాళాలు అందించారు , పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు , అలాగే జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు తమ హాస్పిటల్ కి విరాళం అందించారు అని, నా మీద నమ్మకం ఉంచి విరాళాలు అందించినందుకు అందరికి ధన్యవాదాలు అని బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు.

ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత రానా తో కలిసి అయ్యప్పనం కోశియుమ్ అనే మలయాళం సూపర్ హిట్ రీమేక్ లో నటిస్తున్నసంగతి మన అందరికి తెలిసిందే,కరోనా లాక్ డౌన్ వల్ల ఇన్ని రోజులు తర్వాత మళ్ళీ ఈరోజు షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది, పవన్ కళ్యాణ్ ఈరోజు సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు ఆ చిత్ర బృందం అధికారికంగా ఒక్క ఫోటో విడుదల చేసింది, ఆ ఫోటో ని ఈ ఆర్టికల్ చివర మీరు ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ గా ఆ చిత్ర ఒంటి అధికారికంగా ప్రకటించారు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక్క పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తున్నాడు, గతం లో ఆయన కొమరం పులి మరియు గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు, ఇందులో గబ్బర్ సింగ్ సినిమా ఎంతతి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈరోజు విడుదల అయినా ఫోటో గబ్బర్ సింగ్ సినిమాని తలపించేలా ఉంది అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు, మరి వకీల్ సాబ్ సినిమాతో పవర్ ఫుల్ లాయర్ గా పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో అలరించాడో, ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఏ స్థాయిలో అలరించబోతున్నాడో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
