పాటలు సూపర్ హిట్ కానీ సినిమాలు ఫట్

ఒక హీరో కొత్త సినిమా విడుదల అవుతుంది అంటే చాలు, అందులో హీరోయిన్ ఎవ్వరు..? డైరెక్టర్ ఎవ్వరు..? మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్వరు..? ఈ సినిమా ఆడియో లాంచ్ ఎప్పుడు అని ఇలా సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు, ఇక సినిమా సాంగ్స్ విడుదల అయ్యి ఆ ఆల్బమ్స్ హిట్ అయ్యాయి అంటే, ఇంకా fm లో, ఆటోలో ఎక్కడ చుసిన ఈ songse , ఒక సినిమా ఆడియో హిట్ ఇయింది అంటే ఆ సినిమా పై అంచనాలు కూడా తార స్థాయికి చేరుతాయి, కానీ కొని సినిమాలు మాత్రం ఆడియో సూపర్ హిట్ ఐనప్పటికీ సినిమా పరంగా ప్రేక్షకుల అంచులను అందుకోవడం లో మాత్రం విఫలం అయ్యాయి, ఆలా ఆడియో సూపర్ హిట్ అయ్యి సినిమా ప్లాప్ ఐన సినిమాలు ఏంటో మనం ఇపుడు తెలుసుకుందాం,

ఆరెంజ్, మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ తీస్తున్న సినిమా కావడం అందులోనూ బొమ్మరిల్లు లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన భాస్కర్ ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తూ ఉండడం తో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి, హారిస్ జైరాజ్ ఇచ్చిన మ్యూజిక్ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచాయి, ఈ సినిమా పాటలు ఇప్పుడు విన్న మనకి ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు .. కథ కొంచెం కొత్తగా ఉండడం తో తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కలేదు..

ఆర్య 2 , గంగోత్రి సినిమా తో ఇండస్ట్రీకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, ఆర్య తో మొదటి హిట్ ని తన కాతాలో వేసుకున్నాడు, triangle లవ్ స్టోరీ లో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది, ఇక ఈ సినిమా కి సుకుమార్ దర్శకత్వం వహించగా డీస్పీ మ్యూజిక్ ని అందించాడు, ఇక ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 సినిమా ని ఒక ఆఫీస్ లవ్ స్టోరీ ని బాక్గ్రౌండ్ లో తెరకేక్కిన్చాడు సుకుమార్, ఈ సినిమాకి డీస్పీ అందించిన పాటలు ఒక రేంజ్ లో హిట్ ఐనప్పటికీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలని రాబట్టకేలపోయింది..

వాసు, వెంకటేష్ కెరీర్ లో ది బెస్ట్ మ్యూజిక్ అబ్ల్యూమ్స్ లిస్ట్ లో ఈ సినిమా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇప్పటికి ఈ సినిమా పాటలు వినే వారు ఉన్నారు, పాటలు సూపర్ హిట్ అవ్వడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి, ఫాదర్ సెంటిమెంట్ గా వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దెగ్గర ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది..

పౌర్ణమి, ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ ఓ వేరుగా చెప్పకర్లేదు, ఈ సినిమా తర్వాత ప్రభుదేవా మల్లి ప్రభాస్ తో పొర్ణమి సినిమా తీయగా ఈ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ ఈ సినిమా కి డీస్పీ అందించిన మ్యూజిక్ మాత్రం సూపర్ హిట్ ఇయింది..

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ఈ సినిమాలోని పాటలు ఇపుడు విన్న ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ప్రతి ఒకరి జీవితం లో జరిగే కొని సంఘటలనే ఆధారంగా తీసుకోని సినిమా గా తీసాడు s గోపాల్ రెడ్డి, ఇపుడు టీవీ లో వేసిన టీవీ కి అతుక్కుపోయి మరి ఈ సినిమా ని చూసే ఆడియన్స్ ఉన్నారు, కానీ అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేపోయింది..

NO 1 నేనొక్కడినే, సుకుమార్ మాస్టర్ బ్రెయిన్ కి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా, టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయగలరు అని నిరుపించ్చిన సినిమా, ఈ సినిమా లో మహేష్ బాబు పెర్ఫార్మన్స్ తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు, అప్పట్లో ప్రేక్షకులకి అర్ధం కాక ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఇపుడు విడుదల అయ్యి ఉంటె ఇదొక ఇండస్ట్రీ హిట్ అయ్యేది, ఇక ఈ సినిమా కి డీస్పీ అందించిన పాటలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చు..

అగ్న్యాతవాసి, అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది, వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయ్, ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా కి మ్యూజిక్ ని అందించాడు అనిరుద్, మ్యూజిక్ కూడా హిట్ అవ్వడం తో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ దెగ్గర ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోవడమే కాక పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా ఈ సినిమా మిగిలిపోయింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles