పునీత్ రాజ్ కుమార్ కళ్ళతో వైద్య శాస్త్రం కూడా ఆశ్చర్యపొయ్యే అద్భుతం చేసిన డాక్టర్లు

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటన తో బాల్యం నుండి కోట్లాది మంది అభిమానులను సంపాదించి యూత్ ఐకాన్ గా మ్నారిందా పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే గుండెపోటు తో మరణించిన ఘటన యావత్తు సినీ లోకాని ఎలా కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,బ్రతికి ఉన్నన్ని రోజులు తానూ సంపాదించిన డబ్బులో సేవ కార్యకమాలు చేస్తూ తానూ చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను దానం చేసిన ఉదార స్వభావం ఉన్న మహానుభావుడు పునీత్ రాజ్ కుమార్, అలాంటి మంచి వైస్కటి ఈరోజు మన మధ్య లేకపోవడమే నేది నిజంగా మనం చేసుకున్న దురదృష్టం, ఇలాంటి వారిని ఆ దేవుడు ఎందుకు అంత తొందరగా తీసుకెళ్ళిపోతాడు అని అభిమానులు రోదిస్తున్నారు,తెలు లో ఆయన ఒక్క సినిమా కూడా చెయ్యకపోయినా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు తలచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు మన తెలుగు వాళ్ళు కూడా, ఇక పునీత్ తన రెండు కళ్ళను తన తండ్రిగారు స్థాపించిన డాక్టర్ రాజ్ కుమార్ నేత్రాలయకి దానం చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్క పునీత్ రాజ్ కుమార్ మాత్రమే కాదు , రాజ్ కుమార్ ఫామిలీ మొత్తం కూడా తమ కళ్ళను దానం చేసారు.

ఇక వైద్య శాస్త్రం లో అతి తక్కువ సార్లు జరిగే కొన్ని అద్భుతాలు పూబినీత్ రాజ్ కుమార్ గారి కళ్ళతో కూడా జరిగాయి, పునీత్ రాజ్ కుమార్ గారి కంటి నుండి సేకరించిన కార్నియాస్ ని నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి కంటి చూపుని రప్పించారు డాక్టర్లు, ఇది వైద్య రంగం లో చాలా అరుదుగా జరిగే ప్రక్రియ, ఆ అరుదుగా జరిగే ప్రక్రియ పునీత్ రాజ్ కుమార్ గారి కళ్ళతో జరగడం ఆయన అభిమానులను గర్వపడేలా చేస్తుంది, ఇలా చనిపోయిన తర్వాత కూడా నలుగురికి కంటి చూపుని రప్పించిన పునీత్ రాజ్ కుమార్ ని యావత్తు భారత దేశ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు, ఐడి ఇలా పండగ పునీత్ రాజ్ కుమార్ గారికి ఒక్క కన్నడ లోనే కాదు , తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఉన్న హీరోలు మరియు ఇతర నటీనటులు కూడా ఎంతో సన్నిహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే, ముఖయంగా చిరంజీవి ఫామిలీ తో మరియు నందమూరి ఫ్యామియ్ తో పునీత్ కి ఉన్న అనుబంధం నిన్నటిది నేటిది కాదు దశాబ్దాల అనుబంధం,అలాంటి అనుబంధం లో ఉన్న వ్యక్తి ఇక మన మధ్య లేరు అని తెలిసి చిరంజీవి మరియు బాలయ్య వంటి వారు ఎలా కన్నీళ్లు పెట్టుకున్నారో మన అందరం చూసాము.

ఇక పునీత్ రాజ్ కుమార్ కి రామ్ చరణ్ కి మధ్యన కూడా ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది, వీళ్లిద్దరు స్నేహితులు లాగ కాకుండా అన్నదమ్ములు లాగ కలిసి ఉంటారు,మెగాస్టార్ చిరంజీవి సై రా నారా సింహ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా కర్ణాటక లో పునీత్ రాజ్ కుమార్ గారి సోదరుడు శివ రాజ్ కుమార్ ముఖ్య అతిధి గా హాజరు అయ్యాడు, ఇక పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహం ని దర్శించుకునే అవకాశం ని కోల్పోయిన రామ్ చరణ్ , నేడు ఆయన సమాదాని సందర్శించి నివాళుసు అర్పించి , కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు, అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘పునీత్ రాజ్ కుమార్ గారు ఇక లేరు అనే మాట ని నేను తీసుకోలేక ఉన్నాను, ఆయన లాంటి ఉదార స్వభావం ఉన్నవాడిని నేను నా జీవితం లో చాలా తక్కువమందిని చూసాను, సొంత కుంటుంబం లో ఒక్కరికి ఏదైనా జరిగితే ఎంత బాధ వేస్తుందో పునీత్ రాజ్ కుమార్ గారి విషయం లో కూడా అంతే బాధ వేస్తుంది, ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పునీత్ రాజ్ కుమార్ గారు వీరాభిమానులు అందరూ కాస్త ధైర్యం తెచ్చుకోండి’ అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా మాట్లాడారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles