పునీత్ రాజ్ కుమార్ ని చూడగానే తల బాదుకుని ఏడ్చేసిన నందమూరి బాలకృష్ణ

కన్నడ ప్రజలకు ఇది ఒక్క బ్లాక్ డే అనొచ్చు, తన నటనతో మరియు సేవ కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న జిమ్ చేస్తున్న సమయం లో గుండెపోటు వచ్చి తన తుది శ్వాసని వదిలిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లో ముంచేసింది,ఎప్పుడు నవ్వుతు అందరితో ఎంతో మంచిగా నడుచుకునే పునీత్ రాజ్ కుమార్ అంటే ఇష్టపడని వాళ్లంతా ఎవ్వరు ఉండరు, కన్నడ సినీ ఇండస్ట్రీ తో పాటుగా తెలుగు , తమిళం మరియు మలయాళం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క నటుడితో పునీత్ రాజ్ కుమార్ ఎంతో సన్నిహిత్య సంబంధం ఉంది, ముఖ్యంగా తెలుగు బాషా అన్నా, తెలుగు సినిమా నటీనటులు అన్నా పునీత్ రాజ్ కుమార్ గారికి ఎంతో అభిమానం, మన ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క టాప్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి ఆప్త మిత్రులు , ముఖ్యంగా నందమూరి ఫామిలీ కి జ్ కుమార్ ఫామిలీ కి దశాబ్దాల నుండి ఎంతో సన్నిహిత్య సంబంధం ఉంది,పెద్ద ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరుకు వరుకు ప్రతి ఒక్కరు నందమూరి కుటుంబం ని అభిమానిస్తారు.

పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే నిజాన్ని నందమూరి ఫామిలీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏడుపు ని ఆపుకోలేక నిన్న ట్విట్టర్ లో పెట్టిన ఒక్క ఎమోషనల్ పోస్ట్ చూస్తే ఎవర్తికైనా కంటతడి రాక తప్పదు, ఇక చివరి చూపు కోసం కర్ణాటక కి వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కి నివాళి అర్పించాడు ఎన్టీఆర్, ఇక నందమూరి బాలకృష్ణ తో పునీత్ రాజ్ కుమార్ కి ఉన్న అనుబంధం మామూలుది కాదు, బాలకృష్ణ ఈరోజు జీవం లేకుండా పది ఉన్న పునీత్ రాజ్ కుమార్ దేహం ని చూసి చలించిపోయాయి, తల బాదుకుని బోరుమని విలపించాడు,బాలయ్య బాబు ని ఇంత ఎమోషనల్ గా మనం జీవితం లో ఎప్పుడు కూడా చూసి ఉండము, తొలిసారి బాలయ్య ఇలా ఏడవడం చూసిన ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు, పునీత్ రాజు కుమార్ మీద ప్రతి ఒక్కరు పెంచుకున్న ప్రేమ అలాంటిది, ఆ మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమకే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు, ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది.

పునీత్ రాజ్ కుమార్ నిన్న గాక మొన్ననే ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రముఖ హీరో యాష్ తో కలిసి చిందులు వేసాడు, ఈరోజు ఉదయం కూడా ఆయన తన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ కూడా వేసాడు, ఇక ఆయన జిమ్ కి వెళ్తున్న సమయం లో ఒక్క అభిమని తీసిన ఆఖరి ఫోటోని మీరు క్రింద చూడవచ్చు, క్షణ కాలం క్రితం తమతో ఎంతో ఆనందం గా ఉన్న వ్యక్తి అకస్మాతుగా చనిపోవడం అంటే ఆయన కుటుంబీకులకు ఎంతటి శోకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పునీత్ రాజ్ కుమార్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలే, తమ తండ్రి ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ నాన్న నాన్న అంటూ ఏడుస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతున్నాయి, ఆ వీడియో చూసిన ఎవ్వరు అయినా ఏడుపు ఆపుకోకుండా ఉండలేరు, బ్రతి ఉన్నంత కాలం ఎంతో మందికి సేవ కార్యక్రమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలిచినా పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మా ఎక్కడున్నా సాంత్తించాలి అని ఆమన్స్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles