కన్నడ చలన చిత్ర పరిశ్రమలో రాజ్ కుమార్ ఫామిలీ ని అక్కడి ప్రజలు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాళ్ళు వారి మాతృబాష తర్వాత అంతలా అభిమానించేది రాజ్ కుమార్ ఫామిలీనే, దశాబ్దాల నుండి వీళ్ళ కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమాల ద్వారా అలరిస్తూనే , మరోపక్క ప్రజాసేవ కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు, ఆ కుటుంబం నుండి నేటి తరంలో పునీత్ రాజ్ కుమార్ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ వరుకు, యూత్ నుండి ఫామిలీ ఆడియన్స్ వరుకు పునీత్ రాజ్ కుమార్ సినిమాలకు బ్రహ్మరధం పడుతారు,అలాంటి ప్రజాదరణ ఉన్న పునీత్ రాజ్ కుమార్ కి చిన్న గాయం తగిలితేనే ప్రజలు తల్లడిల్లిపోతారు, అలాంటిది ఇక ఆయన ప్రాణాలతో లేకపోతే తట్టుకోగలరా,ఆయన మరణ వార్త విని ముగ్గురు వీరాభిమానులు గుండె ఆగి చనిపోయారు, ఇక ఆయననే నమ్ముకొని బ్రతుకుంటున్న కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి,కేవలం ఒక్క హీరో గా మాత్రమే కాదు, పునీత్ రాజ్ కుమార్ ని వ్యక్తిగతంగా ఆరాధించే వారి సంఖ్య ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు మరియు తమిళ బాషలలో కూడా అసంఖ్యాకంగా ఉంటుంది,అలాంటి మనిషి ఇక మన మధ్య లేరు అనే వార్తనే ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక రాజ్ కుమార్ ఫామిలీ కి దశబ్దాల నుండి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తో ఎంతో గొప్ప అనుబంధం ఉన్నది, హైదరాబాద్ కి పునీత్ రాజ్ కుమార్ వస్తే తన తండ్రి సమానుడు అయినా ముగిస్తారు చిరంజీవి ఇంటికి రాకుండా వెళ్ళడు, ఇక కర్ణాటక వెళ్ళినప్పుడల్లా రాజ్ కుమార్ కుటుంబీకులను కలవకుండా వెళ్ళరు మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళు ఎప్పుడు కూడా స్నేహితులు లాగ అనిపించరు, సొంత కుటుంబీకులు లాగ కలిసి మెలిసి ఉంటారు, ఇక రాజ్ కుమార్ ఫామిలీ లో ఎలాంటి శుభ కార్యం జరిగిన స్వయంగా పునీత్ రాజ్ కుమార్ గారే చిరంజీవిని కలిసి ఆహ్వానిస్తుంటారు, చిరంజీవి అంటే ఆయనకి ఉన్న అభిమానం అలాంటిది, తనని అంతలా అభిమానించే వ్యక్తి, తానూ కనపడినప్పుడల్లా కల్ముషం లేని చిరునవ్వుతో పలకరించే వ్యక్తి అలా జీవం లేకుండా పడిఉండడం చూసి మెగాస్టార్ చిరంజీవి గారు తట్టుకోలేక పొయ్యారు, పునీత్ రాజ్ కుమార్ ని చూసిన వెంటనే ఏడుపు ఆపుకోలేక పోయిన చిరంజీవి ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ ని గట్టిగ పట్టుకొని బోరున విలపించారు,చిరంజీవి గారు ఇంతలా క్కరి గురించి ఏడవడం మనం ఎప్పుడు చూసి ఉండము, అలాంటి చిరంజీవి గారు అలా ఏడవడం చూసిన ఆయన అభిమానులు శోక సంద్రం లో మునిగిపోయారు.

ఇక పునీత్ రాజ్ కుమార్ కి చిరంజీవి కుటుంబం తో పాటు నందమూరి కుటుంబం తో కూడా ఎంతో గొప్ప సాన్నిహిత్యం ఉన్నది,ఈరోజు ఉదయం నందమూరి బాలకృష్ణ పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహం ని చూసి తల బాదుకుంటూ కంటతడి పెట్టుకున్నారు, ఎప్పుడు సింహలాగా గంభీరంగా ఉండే బాలయ్య ఇలా చిన్న పిల్లవాడిలాగా ఏడవడం మనం ఎప్పుడు చూసి ఉండము, మన టాలీవుడ్ కి చెందిన లెజెండ్స్ అందరూ పునీత్ ఇక లేదు అని తెలిసి ఇంతలా బాధపడుతున్నారు అంటే పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగా ఎంత గొప్ప[ఆ మనిషో అర్థం చేసుకోవచ్చు, ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి హరి కృష్ణ గారు స్వర్గస్తులు అయ్యినప్పుడు ఎంతలా ఏడ్చారో, ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ని చూసి అంతలా ఏడ్చారు, ఆయనని అలా హోసిన అభిమానులు తట్టుకోలేకపోయారు, దాదాపు 5 నిమిషాల పాటు పునీత్ రాజ్ కుమార్ ని కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్, ఆయనతో తనకి ఉన్న ఎమోషనల్ బాండ్ అలాంటిది, ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ వంటి వారు ట్విట్టర్ ద్వారా పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించారు.
