పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి అసలు నిజం బయటపెట్టిన డాక్టర్లు

యావత్తు సినీ లోకాన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి మరణం ఎలాంటి శోక సందం లోకి నెట్టేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవం లా భావించే ఒక్క హీరో , ఎన్నో వేళా మందికి ప్రతి ఏటా నిస్వార్థం గా సేవలు అందించే ఒక్క మానవతావాది ఇంత చిన్న వయస్సులో హఠాత్తుగా మన అందరిని వదిలి వెళ్లిపోవడం ఎప్పటికి జీర్ణించుకోలేని విషయం, బ్రతికి ఉన్నంత కాలం నలుగురికి సేవ చెయ్యాలి, నలుగురితో ఆనందం గా గడపాలి అనే మైండ్ సెట్ తో ఉండే పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు మన సమాజం లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు,పునీత్ రాజ్ కుమార్ తో తమకి ఉన్న అనుబంధం ని తలచుకొని ఆయన తోటి నటీనటులు మీడియా ముందే ఏడవడం మనం ఈ మూడు నాలుగు రోజుల్లో చూసాము, ఒక్క కన్నడ సినీ నటులే కాదు, మన టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా పునీత్ రహో తమకి ఉన్న అనుబంధం ని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు అంటే , ఆయన వారి పై చూపించిన ప్రేమ మరియు వాళ్ళతో పెంచుకున్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే అందరూ అనుకున్నట్టు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవడానికి కారణం జిమ్ కాదు,డాక్టర్లు చెప్పే విషయం ఏమిటి అంటే మన ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి లో ఉన్న సమయం లో మన గుండె మీద కూడా వత్తిడి పడుతుంది, నార్మల్ హార్ట్ బీట్ 72 కి తక్కువ ఉన్న సమయం లో జిమ్ వర్కౌట్స్ చెయ్యకూడదు అట,ఆలా చేసినప్పుడు వత్తిడి తీవ్రంగా ఎరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి అని డాక్టర్లు చెప్తున్నారు,పునీత్ రాజ్ కుమార్ కి ముందు రోజు రాత్రి నుండే ఛాతిలో కాస్త నొప్పి గా ఉన్నింది అని , మరుసటి రోజు అయన తీవ్రమైన వర్కోప్ట్స్ చెయ్యడం వల్లే ఆ నిప్పి కాస్త పెద్దది అయ్యి హార్ట్ ఎటాక్ కి దారి తీసింది అని ఈ సందర్భంగా వారు తెలిపారు, పునీత్ రాజ్ కుమార్ గారు ఆ ఒక్క రోజు జిమ్ వర్కౌట్స్ చెయ్యపోయాయి ఉంటె ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు అని డాక్టర్లు తెలిపారు, స్వతహాగా పునీత్ రాజ్ కుమార్ వర్కౌట్స్ అంటే అమితమైన ఇష్టం, ఆ ఇష్టమే ఈరోజు తన గుండెలు ఆగిపొయ్యెలా చేసి కోట్లాది మంది అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది, కాబట్టి ఈ ఆర్టికల్ చదువుతున్న మీరు అయినా ఒక్కటి తెలుసుకోవాలి, తీవ్రమైన వత్తిడిలో ఉన్నప్పుడు జిమ్ చెయ్యడం ఆపండి.

ఇలా కళ్ళ ముందే నిమిషం క్రితం వరుకు ఉన్న వ్యక్తి మరు నిమిషం లో లేకపోవడం ఒక్క పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు అతని కుటుంబ సభ్యులకే కాదు, యావత్తు భారతీయులను శోకసంద్రం లోకి నెట్టేసింది, ముందు రోజు తన అన్నయ్య తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడిపాడిన వ్యక్తి ఈరోజు అదే అన్నయ్య చేతిలో విగతజీవిలా పడిఉండడం చూసి అభిమానులే తట్టుకోలేకపోతే ఇక పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే,ఒక్క గొప్ప మనిషికి,తానూ సంపాదించిన సంపాదనా లో సింహ భాగం ప్రజా సేవకి ఉపయోగించిన ఒక్క మహాత్ముడికి ఇలాంటి దుస్థితి రావడం చూస్తుంటే దేవుడు అసలు లేదు అనే అనిపిస్తుంది, పునీత్ రాజ్ కుమార్ గారిని మనమే మర్చిపోలేకపోతుంటే, ఇక అయన పేరు ఎత్తితే పులకరించిపొయ్యి ఈలలు చప్పట్లు కొట్టే కోట్లాది మంది అభిమానులకు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టతరమే, ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని కోరుకుంటూ పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles