పుష్ప మూవీ నుండి శ్రీవల్లి లిరికల్ వీడియో సాంగ్ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

అలా వైకుంఠపురం లో వంటి సెన్సషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసున్న చిత్రం పుష్ప, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం వంటి సెన్సషనల్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు మొదటి నుండే భారీ గానే ఉన్నాయి,ఆ ఎందులోనూ జీతం లో అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య మరియు ఆర్య 2 సినిమాలు సెన్సషనల్ హిట్ అవ్వడం తో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా అయినా పుష్ప పై అంచనాలు సాధారణంగానే భారీగా ఉండడం సహజమే, ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఫస్ట్ నుండి టీజర్ వరుకు అభిమానులనే కాదు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించింది,ఇక ఈ సినిమా నుండి విడుదల అయినా మొదటి పాత దాక్కో దాక్కో మేక సాంగ్ సెన్సషనల్ హిట్ అయ్యింది, ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సాంగ్ హవానే నడుస్తుంది,దేవిశ్రీ ప్రసాద్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వైఫేచిన ఆల్బమ్స్ అన్ని యువతని ఉర్రూతలూ ఊగించింది, దీనితో పుష్ప ఆల్బం మీద కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నా ఆ అంచనాలను ఈ ఇనెమ మొదటి పాట తోనే అందుకుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక మొదటి పాట సెన్సషనల్ హిట్ అయ్యే లోపు రెండవ పాట పై అంచనాలు భారీగా ఉండడమే సహజమే, అందరూ అంచనాలకు తగ్గట్టుగానే ఈరోజు విడుదల అయినా శ్రీవల్లి సాంగ్ కి కూడా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ప్రముఖ సింగర్ సైడ్ శ్రీరామ్ పాడిన ఈ పాట విడుదల అయినా అతి కొద్దీ నిమిషాలలోనే మిలియన్ల కొద్దీ వైఎస్ ని సొంతం చేసుకొని యూట్యూబ్ ని షేక్ చేస్తోంది,ఇక పాట లో చూపించిన అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ కాస్త కొత్తగా ఉన్నాయి, ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలు మరియు టీజర్ చూసిన తర్వాత మనం బాగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇందులో అల్లు అర్జున్ కి భుజం ప్రబలేం ఉన్నట్టు తెలుస్తుంది, సుకుమార్ తన సినిమాలలో ఇలాంటివి ఎదో ఒక్కటి పెడుతూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే, రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్ కి చెవుడు సమస్య పెట్టాడు, ఆ పాత్ర కి ప్రేక్షుకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, జాతీయ స్థాయి లో చిట్టి బాబు నటనకి అద్భుతమైన ఆదరణ లభించింది, ఇక పుష్ప రాజ్ క్యారక్టర్ ని చిట్టిబాబు ని మించే విధంగా తీర్చి దిద్దాడు అట డైరెక్టర్ సుకుమార్, మరి ఈ పాత్ర కూడా చిట్టి బాబు స్థాయిలో అలరిస్తుందో లేదో చూడాలి.

ఇక అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పుష్ప సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తారీఖున విడుదల అవ్వబోతుంది, ఈ సినిమా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు , ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చేస్తుంది, ఒక్క సాధారణ కూలి నుండి డాన్ గా ఎదిగే అల్లు అర్జున్ పాత్ర ని సుకుమార్ ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎప్పుడు చూడని రేంజ్ లో అల్లు అర్జున్ పాత్రని చూపించినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్, ఇది వరుకు మనం కేజీఎఫ్ సినిమాని చూసి ఇలాంటి హై ని ఇచ్చే సినిమా ఇది వరుకు రాలేదు అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ పుష్ప సినిమా కేజేఎఫ్ కి పదింతలు అద్భుతంగా ఉండనుంది అట, ఈ సినిమా తో అల్లు అర్జున్ తన నటనతో భారత దేశ సినీ ప్రియులను మంత్రముగ్దులను చెయ్యడం ఖాయం అని ఇంబ్దుస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, మరి ఈ స్థాయిలో అంచనాలు రేపిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే డిసెంబర్ 17 వరుకు వేచి చూడాల్సిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles