పెళ్లిళ్లు స్వర్గం లో నిర్ణయిస్తారు అని పెద్దలు అంటూ ఉంటారు అందుకే కొంత మంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అని అనుకున్నప్పటికీ విధి రాసిన రాత మరోలా ఉంటె ఆ ప్రేమ పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి..? ఇదే కేవలం సామాన్యుల విహయాంలోనే కాదు కొంత మంది సెలెబ్రిటీల లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అని చివరికి విడిపోయిన సెలెబ్రిటీలు ఎవరో చూదాం..

అక్షయ్ కుమార్ – శిల్ప శెట్టి, వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అని అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది, మీడియా కథనాలకి మరింత బలాన్ని చేకూరుస్తూ వీరు కూడా అడపా దడపా బయట kanipinche వారు, వీరిద్దరిని ఎవ్వరు చుసిన మీ పెళ్లి epudu అనే ప్రశ్నే అడిగేవారు, కుటుంబంలో ఇంకా ఫ్రెండ్స్ లో కొంత మందిని మాత్రమే పిలిచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ, పెళ్లి వరకు రాకుండానే ఈ జంట విడిపోయింది.. అక్షయ కుమార్ డింపుల్ కపాడియా కూతురు twinkle ని పెళ్లి చేసుకోగా, శిల్ప శెట్టి రాజ్ కుంద్రా అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది..

ఉదయ్ కిరణ్ సుష్మిత, వరుస హిట్లతో టాలీవుడ్ లో దూసులెక్తు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత ఇద్దరు ప్రేమించుకున్నారు, వీరిద్దరికి 2003 లో పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం కూడా జరిగింది కానీ కొని అనుకోని కారణాల వాళ్ళ విరుద్దరు విడిపోయారు, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విశిష్ట ని పెళ్లి చేసుకోగా సుష్మిత విష్ణు ప్రసాద్ అనే వ్యక్తి వివాహం చేసుకుంది..

తరుణ్ ఆర్తి అగర్వాల్ – టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న మరో హీరో తరుణ్, ఆర్తి అగర్వాల్ తో నువ్వు లేక నేను లేను అనే సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డాడు, వీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు, అప్పట్లో ఆర్తి అగర్వాల్ ప్రెగ్నన్ట్ అనే వార్తలు కూడా వచ్చాయి, కానీ పెద్దలు ఒప్పుకోకపోవడం తో వీరి పెళ్ళికి పుల్‌స్టాప్ పడింది..

త్రిష వరుణ్, వీరిద్దరూ కూడా ప్రేమలో మునిగి తేలారు, వీరిద్దరి పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేశారు, పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి ఎంగేజిమెంట్ కూడా చేసుకున్నారు, కానీ పెళ్లి తర్వాత షూటింగ్స్ కి వరుణ్ నో చెప్పడం తో వీరిద్దరి ప్రేమ ఎంగేజిమెంట్ తోనే ఆగిపోయింది..

ప్రభుదేవా – నయనతార .. తన మొదటి భార్య తో డివోర్స్ తీసుకున్న తర్వాత ప్రభుదేవా నాయన తారతో ప్రేమలో మునిగి తేలాడు, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా బలంగా వినపడ్డాయి, ఎం జరిగిందో ఏమో తెలియదు కానీ వీరిద్దరికి సడన్ గా బ్రేక్ అప్ ఇయింది, ఇప్పటికి వీరిద్దరి బ్రేకప్ ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.

హన్సిక – శింబు, ఈ జంట కూడా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు, హన్సిక అయితే శింబు ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ కి గుడ్ బాయ్ చెపుదాం అనుకుంది కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో ఈ ప్రేమ్ జంట కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయింది..
