అనుకున్న గమ్యాలను సాధారణ మనుషుల కంటే వేగంగా, కచ్చితంగా చేరుకునే వారిని తెలివైన వారు అంటారు. అంటే.. మామూలు మనుషులు ఆలోచించే లోగా తెలివైన వాళ్లు సమస్యను పరిష్కరిస్తారు. అలాగే సైన్స్ రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలు చేసి మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ గా గుర్తింపు పొందిన పది మందిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
- మేరీ క్యూరీ

సైన్స్ ప్రపంచంలో అత్యంత తెలివైన వారిలో మేరీ క్యూరీ ఒకరు. రష్యాలో జన్మించిన ఈమె భౌతిక, రసాయనశాస్త్రాల్లో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆమె ప్రయోగ ఫలితాలు ఆధునిక ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నాయి. యూనివర్సిటీలో చదువుతున్న రోజుల నుంచే ఆమె ప్రయోగాలు మొదలు పెట్టింది. రేడియంపై ఎక్కువగా పరిశోధనలు చేసింది. ఆమె భర్త పియరీ క్యూరీతో కలిసి పొలోనియం, రేడియం మూలకాలను కనుగొన్నారు. పొలోనియం అంతరిక్ష పరిశోధనలో ఎంతో ఉపయోగపడుతుంది. శాటిలైట్లలో విద్యుత్ తయారీకి సహకరిస్తుంది. రేడియం ముఖ్యంగా విమానయానరంగంలో, మెడికల్ ఇండస్ట్రీలో అధికంగా వినియోగిస్తున్నారు. అనంతరం ఎక్స్ రేలపై వందల ప్రయోగాలు చేసింది. ప్రస్తుతం ఈ ఎక్స్ రే లు మెడికల్ రంగంలో తప్పనిసరి అయ్యాయి. ఈమె ప్రయోగాలు గుర్తింపుగా రసాయ, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలు లభించాయి. ఈమె ఐక్యూ రేంజ్ 180 నుంచి 200 ఉంటుందని తేలింది.
- గెలీలియో

ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇటలీలో జన్మించారు. ఈయనకు ఫిలాసఫీ, గణితం, అంతరిక్షం, భౌతికశాస్త్రంలో అత్యంత ప్రతిభ కనబరిచిన వ్యక్తి. ఎన్నో ఫార్ములాలను రూపొందించారు. టెలిస్కోప్ ను వాడిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. దీని ద్వారా అంతరిక్షాన్ని పరిశీలించేవారు. తన పరిశోధనల మూలంగా రూపొందించినదే కొపర్నికస్ హీరియోసింట్రిక్ సిస్టమ్. ఈ సిద్ధాంతాన్ని పలువురు వ్యతిరేకించారు. కానీ అనంతరం ఈ సిద్ధాంతం నిజమైనదేనని తదుపరి వచ్చిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 2002లో గెలీలియోకి నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన ఐక్యూ లెవల్ 185 నుంచి 195గా పరిశోధకులు తేల్చారు.
- ప్లేటో

ఈయన గ్రీక్ లో జన్మించిన ఓ గొప్ప ఫిలాసఫర్. సోక్రెటీస్ కు శిష్యుడు. అరిస్టాటిల్ కు గురువు. ఈయ ఎన్నో ఫిలాసఫీలను రూపొందించారు. ప్రజాస్వామ్యం మీద ఆయన రాసిన గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఫస్ట్ వెస్ట్రన్ యూనివర్సిటీని ఆయన స్థాపించారు. తన విశ్వవిద్యాలయంలో సైన్స్ తో పాటు మ్యాథ్స్ పై పరిశోధనలు నిర్వహించేవారు. సోక్రెటిస్ చనిపోయే వరకు తన దగ్గరే ఉన్న ప్లేటో అనంతరం.. గ్రీస్ తో పాటు ఇటలీ, ఈజిప్టులో పర్యటించి తన ఆలోచనలను వ్యాప్తి చేశారు. అనంతరం మెరికల్లాంటి శిష్యులను తయారు చేసుకున్నాడు ప్లేటో. వారిలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి అరిస్టాటిల్. ఈయన ఎన్నో పరిశోధనలు చేసి గురువుకు మించిన శిష్యుడు అయ్యారు. ఈయన ఐక్యూ లెవల్ 180 నుంచి 190 ఉంటుందని తేలింది.
- విలియం సేక్స్ఫియర్

లండన్ లో జన్మించిన ఈయనే రోమియో జూలియట్ పాత్రలకు ప్రాణం పోశారు. సాహిత్య ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత సృష్టించుకున్నారు. ఎన్నో పద్యాలు, కథలు, నవలలు రాశారు. ఆయన చిన్నప్పటి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. అనంతరం అత్యంత ప్రముఖ సాహితీవేత్తగా ఎదిగారు. ఆయన రాసిన ఎన్నో నవలల ఆధారంగా పలు హాలీవుడ్ చిత్రాలు తెరకెక్కాయి. ఆయన ఐక్యూ లెవల్ 210 ఉంటుందని తేలింది.

నికోల టెస్లా 1886లో జన్మించిన ఈయన.. ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. విద్యుత్‌పై ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆల్ట్రర్నేటివ్ కరెంటును ఆయన కనిపెట్టారు. ఆయన కొన్ని వందల ప్రయోగాలపై పేటెంట్ రైట్స్ పొందారు. తన యూనివర్సిటీ విద్యభ్యాసం నుంచే పరిశోధనలు చేసేవారు. అనంతరం ఆయన ఎడిసన్ దగ్గర పనిచేశారు. ఎడిసన్ పరిశోధనశాలలో టెస్లా అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు. అనంతరం కొన్ని విబేధాలతో ఎడిసన్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఆయన కొంత మంది ఆర్థికసహకారంతో కొన్ని ప్రాజెక్టులను రూపొందించారు. అయినా ఆర్థిక పరిస్థితుల కారణంగా తన పరిశోధనలను ముందుకు సాగించలేకపోయారు. ఈయన ఐక్యూ సైతం 180 నుంచి 190 ఉన్నట్లు గుర్తించారు.
ఆర్యభట్ట

భారతదేశంలో జన్మించిన ఈయన గణితశాస్త్ర గతిని మార్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సున్నాను కనిపెట్టిన పరిశోధకుడు ఆర్యభట్ట. ఆయన గణితశాస్త్రవేత్తతో పాటే అంతరిక్ష పరిశోధకుడు కూడా. ఎన్ని గణిత సూత్రాలను రూపొందించారు. అంతేకాదు సూర్య, చంద్రగ్రహణాల గురించి ఆయన ఎన్నో విషయాలు వెల్లడించారు.అంతేకాదు.. సూర్యుడి నుంచి వచ్చే కాంతి మూలంగానే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని చెప్పారు. గణిత, అంతరిక్ష రంగాల్లో తన పరిశోధనలకు గుర్తుగా ఇస్రో నుంచి ఆర్యభట్ట అనే తొలి శాటిలైట్ ను ప్రయోగించారు. ఆయన ఐక్యూ 175 నుంచి 195వరకు ఉంటుది.
- థామస్ అల్వా ఎడిసన్

విద్యుత్ బల్బ్ ను కనిపెట్టి ప్రపంచానికి వెలుగును ఇస్తున్న గొప్ప పరిశోధకుడు ఎడిసన్. ఒక్క బల్బ్ మాత్రమే కాదు సుమారు 1000 పరిశోధనలపై ఆయనకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఆయన చిన్నప్పటి నుంచి చెవుడుతో బాధపడేవారు. దీంతో టీచర్స్ ఆయనకు పాఠాలు చెప్పలేకపోయేవారు. విషయం తెలిసిన తల్లి ఆయనకు ఇంటి దగ్గరే చదువు చెప్పింది. నిజానికి పైన మనం చెప్పుకున్న వారితో పోల్చితే ఎడిసన్ ఐక్యూ చాలా తక్కువ. అంటే కేవలం 140 మాత్రమే. అయినా ఎన్నో ప్రయోగాలు చేసి విఫలం అయ్యారు. సుమారు వెయ్యి సార్లకు పైగా పరిశోధనలు చేసి ఆయన బల్బ్ కనిపెట్టారు. ప్రపంచానికి కొత్త కాంతిని చూపించారు ఎడిసన్.
- ఐన్ స్టీన్

సైన్స్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఆల్ బర్ట్ ఐన్ స్టీన్.1879లో జర్మనీలో జన్మించారు ఈ అపర మేధావి. చిన్నప్పటి నుంచి గణిత, భౌతికశాస్త్రాల్లో విపరీతమైన పరిశోధనలు చేశారు. స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాల కంటే సొంతంగానే ఎక్కువ నేర్చుకునేవాడు. ఈయన పరశోధనల్లో అత్యంత పేరొందినది పోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సిద్ధాంతం. ఇందుకు గాను ఆయనకు 1921లో నోబెల్ పురస్కారం దక్కింది. ఆయన ఐక్యూ 160గా ఉండేది. అయినా ఆయన ఆలోచనా విధానం పట్ల చాలా మంది ఆశ్చర్యపోయేవారు. అందుకే ఆయన మేధస్సుపై ఎంతో మంది ప్రయోగాలు చేశారు. ఆయన చనిపోయాక తన బ్రెయిన్ దొంగిలించేందుకు పలువురు ప్రయత్నించారు.
- న్యూటన్

ప్రపంచానికి గురుత్వాకర్షణ శక్తిం అంటే ఏంటో చెప్పిన వ్యక్తి ఐజాక్ న్యూటన్జ. 1642లో లండన్ లో ఆయన జన్మించారు. ఒకరోజు ఆయన ఆపిల్ చెట్టుకింద కూర్చొని ఉండగా.. ఆపిల్ పండు కిందపడింది. ఎందుకు ఆ పండు కిందనే పడింది అనే ఆలోచనలో నుంచే పుట్టింది న్యూటన్ సిద్ధాంతం. ఆయన రూపొందించిన మూడు న్యూటన్ సిద్దాంతాలే ఇప్పుడు అంతరిక్ష రాకెట్ ప్రయోగాలకు కారణం అవుతున్నాయి. ఆయన ఐక్యూ లెవల్ 195గా పరిశోధకులు గుర్తించారు.
- డావించ్

డావించ్ ఓ ప్రఖ్యాత చిత్రకారుడు. 1452లో ఆయన ఇటలీలో పుట్టారు. ఆయన చేతిలో నుంచి జాలువారిందే ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం. చిన్నప్పటి నుంచే పెయింట్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ మక్కువతో నేర్చుకుని వేల చిత్రాలకు ప్రాణం పోశారు డావించ్. ఆయన కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు. రచయిత, ఆర్కిటెక్, పరిశోధకుడు కూడా. ఆయన ఐక్యూ లెవల్ 180 నుంచి 200 ఉంటుందని తేలింది.
మొత్తంగా ఐక్యూ పరంగా ఈ పది మంది ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్స్ గా గుర్తించడం జరిగింది. ఐక్యూ తక్కువగా ఉన్న అద్భుతాలు సృష్టించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఐక్యూ ఆధారంగానే మేధావులు అని చెప్పడం సమంజసం కాదనేది పలువురు అభిప్రాయం.