ప్రపంచంలోనే టాప్ 10 ధనికులు

డబ్బు సంపాదించడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒకరు కష్టపడేది డబ్బు సంపాదించడం కోసమే, కానీ కొంతమంది మాత్రం కష్టపడ్తూనే వారి మెదడుకి పదను పెట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తారు అలంటి వారే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు, జీవితం లో కష్టపడే ప్రతి ఒకరిని సక్సెస్ వరించదు అందుకు కారణం మనం ఎంత కష్టపడ్తున్నాం, ఏ పని కోసం కష్టపడ్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి, ఒక గొప్ప కవి, డైరెక్షన్ is more important than speed అని చెప్పాడు అంటే మనం ఎంత స్పీడ్ గా వెళ్తున్నాం అన్నదానికన్నా ఏ మార్గం లో వెళ్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఆలా సరైన మార్గాన్ని ఎంచుకొని సక్సెస్ ని సాధించిన ప్రపంచం లోనే టాప్ 10 ధనవంతులు ఎవ్వరో ఇపుడు తెలుసుకుందాం..

No 10 sergey brin 1973 లో రష్యా లో పుట్టిన బ్రిన్ తన ఆరేళ్ళ వయసులోనే కుటుంబంతో సహా మొత్తం అమెరికా కి షిఫ్ట్ అయ్యారు, అమెరికా లోనే బ్యాచ్లర్స్ డిగ్రీ చేసిన ఇతను ఆ తర్వాత PHD చేయడానికి స్టాండ్ఫోర్డ్ యూనివెర్సటిరీ లో జాయిన్ అయ్యాడు ఇక్కడే ఇతనికి larry పేజీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు, ఇతని తో కలిసి ఒక వెబ్ సెర్చ్ ఇంజిన్ ని తయారు చేసారు ఇది స్టాండ్ఫోర్డ్ యూనివెర్సిటీ లో బాగా ఫేమస్ అవ్వడం తో ఇద్దరు కూడా PHD ని మధ్యలోనే వదిలేసి గూగుల్ సంస్థని స్థాపించారు ప్రస్తుతం సెర్గెయి బ్రిన్ ఆస్థి విలువ 77 బిలియన్ డాలర్లు మన భరత్ దేశం కరెన్సీ లో చూసుకున్నటైతే 5 లక్షల 40 వేల కోట్లు..

No 9 larry పేజీ, సెర్గెయి బ్రిన్ తో కలిసి గూగుల్ సంస్థని స్థాపించింది ఇతనే, 1997 నుండి 2001 వరకు గూగుల్ పేరెంటల్ కంపెనీ ఆల్ఫాబెట్ కి సీఈఓ గా ఉన్నాడు larry పేజీ , ప్రస్తుతం ఇతను కేవలం షేర్స్ కంట్రోలింగ్ విభాగాన్ని చూసుకుంటున్నాడు.. ఇతడి ఆస్థి విలువ 79 .2 బిలియన్ డాలర్లు మన కరెన్సీ లో 5 లక్షల 54 వేల 200 కోట్లు..

No 8 వారెన్ బఫెట్, అమెరికన్ సక్సెస్ ఫుల్ బిజినెస్ టైకూన్స్ లో ఒకరు వారెన్ బఫెట్, ఇతను ఒక సక్సెసఫుల్ ఇన్వెస్టర్, ప్రపంచ దేశంలో ఉన్న అని కంపెనీల షేర్స్ తో పోలిస్తే ఇతడి కంపెనీ షేర్ వేల్యూ అందరికంటే అధికంగా ఉంటుంది, ప్రస్తుతం ఇతడి ఆస్తి విలువ 88 . 6 బిలియన్ డాలర్లు, మన కరెన్సీ లో 6 లక్షల 20 వేల 200 కోట్లు అనమాట.

no 7 larry ఎలిసన్, ప్రపంచం లో ఉన్న టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఒకటైన ఒరాకిల్ కో ఫౌండర్ ఇతను, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ తో పోలిస్తే ఈ కంపెనీ రెండవ స్థానం లో ఉంది, ఇక ఇతడి ఆస్తి విలువ 89 . 4 బిలియన్ డాలర్లు, మన కరెన్సీ లో చూసుకున్నటైతే 6 లక్షల 25 వేల 800 కోట్లు..

no 6 జోన్గ్ శంషాన్, ప్రపంచ టాప్ 10 ధనికుల్లో ఇతడు మొదటి సారి స్థానం దక్కించుకున్నాడు, ఆరవ తరగతిలోనే స్కూల్ డ్రాప్ అవుట్ ఐన ఇతడికి చైనా లో పలు బిజినెస్ ఉన్నాయ్, తాజగా ఇతని కంపెనీస్ షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం తో ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ ని కొన్నారు ఇలా అతడి కంపెనీ వర్త్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఇతని ఆస్తుల విలువ 95 . 6 బిలియన్ డాలర్లు మన కరెన్సీ లో చూసుకున్నటైతే 6 లక్షల 70 వేల కోట్లు

no 5 మార్క్ జుకెన్బుర్గ్, ఫేస్బుక్ తో ఇంటర్నెట్ ప్రపంచం లో ఇతడు ఒక సునామీని సృష్టించాడు, ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యేలా ఒక సోషల్ ప్లాట్ఫారం ని నెలకొలిపి ప్రపంచ ధనవంతులో స్థానం దక్కిచుకున్నాడు, ఫేస్బుక్ తో పాటు, ఇంస్టాగ్రామ్ ఇంకా వాటాస్ప్ కూడా కొని ప్రపంచ ధనికుల్లో ఐదవ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం ఇతడి వర్త్ 97 . 9 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో అక్షరాలా 6 లక్షల 85 వేల 300 కోట్లు అనమాట..

no 4 బిల్ గేట్స్, చిన్న వయసు నుండే కంప్యూటర్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఏదైనా సాదించాలి అనే పట్టుదలతో పోరాడాడు, తన పోరాటానికి ఫలితంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ని స్థాపించి ప్రపంచం లో no 1 సాఫ్ట్వేర్ కంపెనీ గా తీర్చిదిదడు, ప్రస్తుతం ఇతడి ఆస్తుల విలువ 120 బిలియన్ డాలర్స్, మన కరెన్సీ లో 8 లక్షల 40 వేల కోట్లు.

NO 3 lvmh అనే లక్సరీ గూడ్స్ కంపెనీ కి సీఈఓ ఐన Bernard Arnault ప్రపంచ ధనికుల్లో మూడవ స్థానం లో ఉన్నాడు, ప్యాషన్ సెగ్మెంట్ ఇతను NO 1 స్థానం లో ఉన్నాడు, 2020 జెఫ్ bezos ని కూడా వెన్నకి నేటి ప్రపంచ ధనికుల్లో మొదటి స్థానం సంపాదించుకున్నాడు, ప్రస్తుతం ఇతడి ఆస్తుల విలువ 155 -5 బిల్లోన్ డాలర్స్, మన కరెన్సీ లో 1088500 కోట్లు

NO 2 జెఫ్ బోజోస్, 1994 లో అమెజాన్ సంస్థని స్థాపించిన ఇతను అతి తక్కువ కాలంలోనే అనేకరంగంలో బిజినెస్ చేసి ప్రపంచం ధనికుల్లో రెండవ స్థానంలో నిలిచాడు, నిజానికి జెఫ్ బోజోస్ ప్రపంచ ధనికుల్లో మొదటి స్థానం లో ఉండే వాడు కానీ తన భార్య తో వీడుకుల తర్వాత తనకి 38 బిలియన్ డాలర్లు ఇచ్చాడు, ఆలా తనకి 38 బిలియన్ డాలర్లు ఇచ్చాక ఇతడి నెట్ వర్త్ 185 . 7 బిలియన్ డాలర్లు, మన కరెన్సీ లో చూసుకున్నటైతే 13 లక్షల కోట్లు.

NO 1 ఇక ఇపుడు మనం ప్రపంచంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఎలోన్ మాస్క్ గురించి మాట్లాడుకుంటే టెక్నాలిజీ ని ముందుగానే అంచనా వేయడం లో తనకి తానే సాటి అని నిరూపించుకుంటూ ప్రపంచ ధనికుల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు, డ్రైవర్ లేకుండా ఎలెక్టీసిటీ తో నడిచే టెస్లా కార్లని కనిపెట్టి అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్నాడు అంతే కాకుండా మార్స్ పైన మనుషులు జీవనం కొనసాగిస్తానందుకు అవసరం అయ్యే రీసెర్చ్ చేతున్నాడు అందుకు స్పేస్ x కనిపెట్టి మార్స్ పైకి గూడ్స్ ని ప్రొడక్ట్స్ ని పంపించడం మొదలు పెట్టాడు,తన ప్రతి కంపెనీ వెనుక ఒక రీసెర్చ్ ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.. ప్రస్తుతం ఇతడి వర్త్ 187 .9 బిలియన్ డాలర్లు మన కరెన్సీ లో 13 లక్షల 28 కోట్లు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles