ప్రెసిడెంట్ గా గెలిచినా తర్వాత మంచు విష్ణు మాట్లాడిన ఈ మాటలు చూస్తే తిట్టకుండా ఉండలేరు

దాదాపు నెల రోజులు నుండి మన టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు గురించి ఎలాంటి రగడ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,మా అసోసియేషన్ ప్రెసిడెంట్౫ గా నిలబడిన ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు లు నువ్వా నేనా అనే రేంజ్ తలపడ్డారు, గెలుపు నాది అంటే నాది అంటూ ఇద్దరు బహిరంగంగానే సవాలు విసురుకున్నారు,సోషల్ మీడియా లో అయితే ప్రకాష్ రాజ్ కి అద్భుతమైన సపోర్టు వచ్చింది, కానీ ఓట్లు వేసేది సామాన్య జనాలు కాదు కదా, ఇండస్ట్రీ లో నటీనటులు,అందుకే ప్రకాష్ రాజ్ ఓడిపోవాల్సి వచ్చింది, ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం మా ఎన్నికలలో కూడా ప్రాంతీయ వాదన తీసుకొని రావడమే, ప్రకాష్ రాజు మన తెలుగు బాషా వాడు కాదు, పరాయి బాషా కి చెందినవాడు,అందుకే మేము తెలుగు వాడైన మంచు విష్ణు కి ఓటు వేస్తాము అంటూ ఏకంగా ఇండస్ట్రీ లో లెజండరీ నటులు అయినా కోట శ్రీనివాస రావు వంటి వారెందరో బహిరంగంగా మంచు విష్ణు కి మద్దతు పలికారు, వాస్తవానికి ప్రాంతీయ వాదన తీసుకొని రావడం అనేది అత్యంత నీచమైన చర్య అని చెప్పక తప్పదు, ప్రకాష్ రాజ్ ని మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా పరాయి రాష్ట్రానికి చెందిన వాడు అని, ఆయన బాషా తెలుగు కాదు అని ఏనాడు అనుకోలేదు.

ఇక మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచినా తర్వాత మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి నాగ బాబు మరియు ప్రకాష్ రాజ్ మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో విల్ గా మారింది,ఒక్క విలేకరి నాగ బాబు గారికి మరియు ప్రకాష్ రాజ్ గారు మా సభ్యత్వానికి రాజీనామా చేసారు కదా, దీనికి మీరు ఏమి అంటారు అంటూ అడిగిన ప్రశ్న కి మంచు విష్ణు సమాధానం చెప్తూ ‘ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, నేను వాళ్ళిద్దరి రాజీనామా ని ఆమోదించట్లేదు, నాగబాబు గారు మా కుటుంబ సభ్యుడు, ప్రస్తుతం ఆయన కాస్త కోపం లో ఉన్నారు, కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆయనని వ్యక్తిగతంగా కలిసి పరిస్థితులను వివరించి రాజీనామాని ఉపసంహరించుకునేలా చేస్తాను, ఇక ప్రకాష్ రాజ్ గారికి కూడా నేను వ్యక్తిగతంగా మెస్సేజ్ చేశాను, ప్రస్తుతం ఆయన బాధలో ఉన్నారు, ఇలాంటి సమయం లో ఆయన తో మాట్లాడితే కచ్చితం గా నో అనే సమాధానం వస్తుంది, కాబట్టి రెండు రోజులు ఆగి ఆయనని ప్రత్యేకంగా కలిసి ఆయనతో కూడా రాజీనామా ని ఉపసంహరించుకునేలా చేస్తాను’ అంటూ మంచు విష్ణు ఈ సందర్భంగా మాట్లాడాడు.

ఇది ఇలా ఉండగా ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మెగా ఫామిలీ ని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో ఆయన పై తీవరమైన విమర్శలు చేసేలా చేశాయి, వాస్తవానికి ఈసారి మా ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ ని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని సినీ పరిసమాకీ చెందిన కొంత మంది పెద్దలు నిర్ణయించారు, అదే విధంగా ప్రణాళికలు జరుగుతన్న సమయం లో మంచు విష్ణు నేను కూడా ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాను అంటూ ముందుకి వచ్చాడు,అప్పటి వరుకు ఎన్నికల ప్రస్తావన లేకుండా ఉన్న పరిస్థితిలో మంచు విష్ణు రావడం తో ఇక ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, అయితే చిరంజీవి ముందుగా ప్రకాష్ రాజ్ ని ప్రెసిడెట్ గా ఏకగ్రీవం చేద్దాం అనుకున్నాం కదా, మంచు విష్ణు ఈ ఎన్నికలకు తప్పుకోవచ్చు కదా అని అడిగాడు అట, దీనిని మంచు విష్ణు ఎదో చిరంజీవి నన్ను తొక్కాలని ప్రయత్నం చేసినట్టు మీడియా ముందు అసత్య ప్రచారం చేసాడు, కానీ మోహన్ బాబు స్వయంగా ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో ఇదే ప్రశ్న ని రాధా కృష్ణ మోహన్ బాబు ని అడగగా అలాంటిది ఏమి లేదు అని స్వయంగా ఆ నోటితోనే చెప్పాడు, కావాలంటే ఆ ఇంటర్వ్యూ ని మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు తన కొడుకుతో అసత్య ప్రచారం చేయిస్తూ తన వంకర బుద్దిని మరోసారి చాటుకున్నాడు అంటూ మోహన్ బాబు మరియు అతని పుత్ర రత్నం పై సోషల్ మీడియా లో నెటిజెన్లు విరుచుకు పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles