మన భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఎక్కువ మతాలు ఉన్న దేశం కూడా మనదే, 80 శాతం మంది హిందువులు ఉన్న భరత్ దేశం లో దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయ్, ఒకో దేవాలయం కి ఒకో విశిష్టత ఉంది, విదేశాల నుండి కూడా ఎంతో మంది మన భరత్ దేశం లో ఉన్న దేవాలయాలని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు.. ఆలా భక్తులు ఎక్కువగా సందర్శించుకునే టాప్ సిక్స్ దేవాలయాల గురించి మనం ఇపుడు తెలుసుకుందాం..

No 1 బేలూర్ మఠ్, నేను ఇందాక మన భరత్ దేశం లో ఎన్నో మతాలు ఉన్నాయ్ అని చెప్పను కదా, మన దేశంలో ఉన్న ప్రతి మతం వాళ్ళు ఎలాంటి మాత బేధం లేకుండా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు, స్వామి వివేకానంద ఈ ఆలయాన్ని తన గురువైన రామకృష్ణ పరమహంస కి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు, ఈ ఆలయం 40 ఎకరాల విస్తీర్ణాలో ఉంటుంది, రామకృష్ణ మాట్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది, ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ ఆలయం హుగ్ల్లీ రివర్ వెస్ట్ బ్యాంకు కి దెగ్గరగా ఉంటుంది..

NO 2 బ్రీదేశ్వర టెంపుల్, తమిళనాడు లో తంజావూర్ లో ఉన్న ఈ ఆలయాన్ని 11 వ శతాబ్ధంలో రాజా రాజా చోల నిర్మించారు, దక్షణ భరత్ దేశంలోనే అతి పెద్దదైన ఈ దేవాలయం మొత్తం గ్రైనేట్ తోనే నిర్మించారు, ప్రపంచంలోనే గ్రైనైట్ తో నిర్మించబడ్డ మొట్టమొదటి ఆలయం ఇది..

NO 3 అన్నమలైయార్ టెంపుల్ , శివుడి కోసం అంకితం చేసిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి, 9 వ దశాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు, కృష్ణ దేవరాయలు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా సవప్ప మలయ్ ఈ ఆలయా నిర్మాణాని పూర్తి చేసారు, ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఇరవై మూడేళ్లు పటిందట, ఈ ఆలయాన్ని ద్రావిడన్ ఆర్కిటెక్చర్ స్టైల్ లో 101171 sq ft విస్తరణలో నిర్మించారు.. తమిళనాడులోని తిరువణ్ణామలై లో అరుణాచల హిల్ ప్రాంతం లో ఈ ఆలయం ఉంటుంది.

NO 4 స్వామినారాయణ్ ఢిల్లీ లో ఉన్న ఈ ఆలయాన్ని అక్షరధామ్ టెంపుల్ అని కూడా అంటారు, ఈ టెంపుల్ అతి పెద్ద హిందూ టెంపుల్ గా గినిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం దకించుకుంది, 234 స్తంభాలతో ఎంతో అద్భుతమైన కట్టడాలతో ఉన్న ఈ ఆలయంలో 20000 లకు పైగా శిల్పాలు ఉన్నాయి, సీత రాములకి, శివ పార్వతులకి, రాధా కృష్ణులకు, లక్ష్మి నరసింహుడికి ఇలా ప్రతి ఒకరికి ఒక దేవాలయం ఉంది.. ఈ ఆలయాన్ని Nov 6 2005 న ప్రారంభించగా ఈ ఆలయ ప్రారంబోస్తవానికి ఏపీజే అబ్దుల్ కలం, మన్మోహన్ సింగ్, lk అద్వానీ, bm జోషి విచ్చేసారు..

NO 5 విరుపక్ష టెంపుల్, కర్ణాటక లో ఉన్న ఈ ఆలయం అతి పురాతన ఆలయాల్లో ఒకటి.. విజయ నగర రాజులూ ఈ ఆలయాన్ని కటించారు, అతి పురాతనమైన ఈ ఆలయంలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయ్, ఇక్కడ ఉన్న స్థంబాల నుండి మ్యూజిక్ సౌండ్స్ వస్తు ఉంటాయి, ఆ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుండి వస్తున్నాయి అనే విష్యం పై ఇప్పటికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు..

NO 6 రంగనాధ స్వామి టెంపుల్, తమిళనాడు లో ఉన్న ఈ ఆలయం లో 108 విష్ణు మూర్తి విగ్రహాలు కొలువై ఉన్నాయ్, ఈ ఆలయం మొత్తం 155 ఎకరాలలో ఉంది. ఇందులో 50 మందిరాలు, 39 మండపాలు, 9 కొలనులు, 21 గోపురాలు కొలువై ఉన్నాయ్.. ఈ ఆలయ గోపురం 236 అడుగుల ఎత్తు ఉంటుంది, ఆసియ లో ఇది అతి పెద్ద గోపురం..
