విశ్వంలోని అన్ని గ్రహాల్లో అత్యంత గొప్పది భూమి. ప్రాణులు జీవించడానికి అనువైన ప్రదేశం కేవలం భూమి మాత్రమే ఉంటుంది. ఏగ్రహంలో లేని ఎన్నో వింతలు, విశేషాలు ఈ భూమ్మీద ఉంటాయి. సముద్రాలు, పర్వతాలు, అడవులు, ఎడారులు.. ఒకటేమిటీ ఎన్నో ప్రత్యేకతలు ఈ భూమి సొంతం. అయితే భూమికి సంబంధించి మనకు తెలియని ఎన్నో రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం!
బంగారు పొర

భూమి మీద మన కంటికి కనిపించే ప్రదేశాలు వేరు.. భూమిలోపల ఉండే మరో ప్రదేశం వేరు. భూ అంతర్భాగంలో మనకు తెలియని ఓ అద్భుత వ్యవస్థ ఉంటుంది. భూమి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే విశ్వలోని ఓ పెద్ద అయస్కాంతం అనుకోవచ్చు. ఎర్త్ కోర్ అనేది సూర్యుడి మీద ఉన్నంత ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉండే వేడి సుమారు ఆరువేల డిగ్రీలు. అంతేకాదు.. భూమి లోపల అత్యంత వేడి ప్రదేశమైన ఎర్త్ కోర్ దగ్గర టన్నుల కొద్ది బంగారం ఉంటుంది. ఈ బంగారాన్ని బయటకు తీస్తే భూమి అంతటా పరిచే అవకాశం ఉంటుందట.
సౌర వ్యవస్థ
సౌర కుటుంబంలో జీవుల మనుగడకు అవసరమైన పరిస్థితులు కేవలం భూగ్రహం మీదే ఉన్నాయి. జీవరాశికి కావాల్సిన నీరు దొరికే గ్రహం భూమి మాత్రమే. అంతేకాదు.. ద్రవం, ఘనం, ఆవిరి రూపంలో నీరు లభించే ప్రాంతం కూడా ఇదొక్కటే. సూర్య, చంద్ర గ్రహాలు పూర్తిగా కనిపించేది కూడా కేవలం భూమ్మీదే.

24 గంటల భ్రమణం

మనందరికీ రోజుకు 24 గంటలు ఉంటాయని తెలుసు. నిజానికి ఇది వాస్తవం కాదు. రోజుకు 23 గంటల 56 నిమిషాల 4 సెకెన్లు మాత్రమే ఉంటాయి. ఈ సమయంలో భూమి తన చుట్టు తాను తిరుగుతుంది. అంతేకాదు భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ తిరిగే విధానం వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది.
భూమి వేగం

నిజానికి మనకు భూమి తిరిగినట్లు కనిపించదు. ఒకవేళ తిరిగితే మనం పడిపోవాలి కదా అనుకుంటాం. కానీ నిజానికి భూమి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సుమారు లక్షా 7 వేల కిలో మీటర్ల వేగంతో భ్రమిస్తుంది. ఇలా తిరగడం వల్ల గ్రావిటీ కారణంగా భూమి మీదున్న అన్ని నిలకడగా ఉంటాయి.
గురుత్వాకర్షణ శక్తి

భూమ్మీద అన్ని చోట్ల గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని మనకు తెలుసు. కానీ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. కెనడాలో ఈ శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. 200 కిలోల బరువున్న ఓ వస్తువు.. కెనడాలోని హడ్సన్ బే సమీపంలో 199.9 కిలోలు ఉంటుంది. మనదేవంలోని లేహ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. భూమ్మీద చాలా ప్రాంతాల్లో గ్రావిటీలో చాలా తేడా ఉంటుంది.
గ్లోబల్ వార్మింగ్

ప్రపంచానికి పెను సవాల్ ఈ గ్లోబల్ వార్మింగ్. దీని కారణంగా ప్రపంచం తీవ్ర అవస్థలు పడుతోంది. మానవులు తమ సుఖాల కోసం ప్రకృతి వనరులను సర్వనాశనం చేస్తున్నారు. ఈ కారణంగా రోజు రోజుకూ భూగ్రహం మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద భూమి మాయమై కేవలం నీరు మాత్రమే మిగిలే అవకాశం ఉంది.
భూమికి రంధ్రం

భూమి బంతిలా గుండ్రంగా ఉంటుంది కదా.. దానికి ఇటు చివర నుంచి అటు చివర వరకు రంధ్రం చెయ్యొచ్చా? అనే ఆలోచన మనందరికీ వస్తుంది. ఇదే ఆలోచన రష్యన్లకు వచ్చింది. వారు సుమారు 14 సంవత్సరాలు కష్టపడి 12 వేల 262 మీటర్ల పొడవైన రంధ్రాన్ని తవ్వారు. ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలోని అతిపెద్ద రంధ్రం. కానీ వాళ్లు ఈ ప్రాజెక్టును ఎందుకో నిలిపివేశారు.
భూకంపాలు

ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒకచోట భూకంపం అనేది వస్తుంది. ప్రతి ఏటా సుమారు 5 లక్షల భూకంపాలు వస్తాయి. ఇందులో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే నష్టం చేకూర్చుతాయి. 1960లో చిలీలో వచ్చిందే అతిపెద్ద భూకంపం. రిక్టర్ స్కేలు మీద దీని తీవ్రత 9.5గా నమోదైంది. ప్రపంచంలో జపాన్లో మాత్రమే అత్యధికంగా ఈ భూకంపాలను ఎదుర్కొంటుంది. ఏడాదికి సుమారు 1500 భూకంపాలు ఇక్కడ వస్తాయి. భూఅంతర్భాగంలో విపరీతమైన వేడి కారణంగా అక్కడ పలకాలు కదలడం మూలంగా ఈ భూకంపాలు వస్తాయి. 1856లో చైనాలో ఘోర భూకంపం వచ్చింది. దీని కారణంగా సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది చనిపోయారు.
భూ వాతావరణం

భూమ్మీద జీవులు బతకడానికి కారణం ఇక్కడున్న వాతావరణమే. ఈ వాతావరణంలో 78శాతం నైట్రోజన్, 21శాతం ఆక్సీజన్ తో పాటు కార్బన్ డై ఆక్సైడ్, నియోన్, హీలియం లాంటి మూలకాలు కూడా ఉంటాయి. ఆకాశం బ్లూ రంగులో కనపడటానికి కూడా వాతావరణమే కారణం.
సూర్యుడితో భూమి అంతం?

కొంత మంది అంతరిక్ష పరిశోధనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. సూర్యుడికి కారణంగానే భూమి అంతరించి పోతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సూర్యుడి కోర్లో హైడ్రోజన్, హీలియం కారణంగా అత్యంత శక్తి ఉత్పత్తి అవుతుంది. ప్రతి బిలియన్ సంవత్సరాలకు ఒకసారి ఈ శక్తి రెట్టింపు అవుతుంది. ఈ ప్రభావం భూమ్మీద పడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మంచు పర్వతాలు ఒక్కసారిగా కరిగి భూమి నీటిలో మునిగి జీవరాశులు అంతం అయ్యే అవకాశం ఉంది.
నడిచే రాళ్లు

మనకు తెలిసి రాళ్లు కదలినిట్లు తెలియదు. కానీ కాలిఫోర్నియాలో పెద్ద పెద్ద బండరాళ్లు ముందుకు కదలడం ఆశ్చర్యన్ని కలిగిస్తుంది. డెత్ వ్యాలీలో ఎండిపోయిన సరస్సు ఉంది. దీని పైభాగంలో పెద్ద రాళ్లను ఎవరో జరుపుతున్నట్లు కదులుతాయి. రాళ్లు కదిలినట్లుగా గుర్తులు కనిపిస్తాయి. అసలు రాళ్లు ఎలా కదులుతున్నాయి..? అనే అంశంపై పలువురు రీసెర్చ్ చేశారు. భూమికి ఉన్న అయస్కాంత శక్తి వల్లే ఇది జరుగుతుందనుకున్నారు. అయితే సరస్సు లో ఉన్న మంచు గడ్డల కారణంగానే ఈ రాళ్లు ముందుకు కలుతున్నట్లు తేల్చారు.
భూమి బరువు

భూమి బరువు ఎంత అనే ఇప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు. కానీ ప్రతి ఏటా భూమి బరువులో తేడాలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల దాదాపు 40 వేల టన్నుల అంతరిక్ష వ్యర్థాలు భూమికి చేరుకుంటున్నాయి. ఈ కారణంగా ప్రతిఏటా భూమి బరువు పెరుగుతోంది.
నీళ్లు

భూమ్మీదున్నన్ని నీళ్లు ఈ విశ్వంలో మరే గ్రహం మీద లేవు. సుమారు 70 శాతం భూమ్మీద నీళ్లే ఉంటాయి. భూమ్మీదున్న మంచులో సుమారు 90 శాతం అంటార్కిటికా ఖండంలోనే ఉంది. ఈ మంచు మనుషులకు ఉపయోగపడదు. భూమ్మీదున్న నీటిలో కేవలం 0.003 శాతం మాత్రమే మనుషులకు ఉపయోగపడుతుంది.
భూమికి నీలం రంగు

సౌరకుటుంబంలోని ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఉంటుంది. భూమికి మాత్రం బ్లూ రంగు ఉంటుంది. భూమ్మీద అధికంగా నీళ్లు ఉండటం మూలంగా దీనికి ఈ రంగు వచ్చింది.
రెండో చంద్రుడు

భూమికి ఉన్న ఉపగ్రహం చంద్రుడు. అయితే గతంలో భూమికి మరో ఉపగ్రహం ఉండేదని శాస్త్రవేత్తల అభిప్రాయం. దీన్ని రెండో చంద్రుడిగా పిలుస్తారు. ఇది అంతరిక్షంలో ఓ భారీ ఆస్టరాయిడ్ ని ఢీకొని అంతరించినట్లు వెల్లడించారు పరిశోధకులు