భోజనం లేకుండా మంచినీళ్లు తాగి 16 గంటలు వర్క్ చేసిన ఎన్టీఆర్

మూడున్నర దశాబ్ధాల పాటు నటుడుగా చలనచిత్ర పరిశ్రమలో తనకొక విశిష్ఠ స్ధానాన్ని సంపాదించుకుని ప్రజల ప్రశంసలు అందుకున్న నవరస నాయకుడు నటరత్న డా. నందమూరి తారక రామారావు. నిజంగా ఆయన సంచలన కారకులు. ఆయన ఏం పలికినా ఏం పని చేసినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన జీవన విధాంన ఎంతో ఉకృష్ణమైనది. తన శరీరం మీద, మనసు మీద ఎంతో కంట్రోల్ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. ఏ వేళలో ఎంత ఆహారం తినాలనిపిస్తే.. అంత ఆహారం తినేసేవారు. తినకూడదు అనుకుంటే.. మానేసి కేవలం మంచినీళ్లతో గడిపేవారు.

దీనికి చక్కటి ఉదాహరణ సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన. ఇంతకీ.. ఏంటా సంఘటన అంటే.. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సర్ధార్ పాపారాయుడు చిత్రం పాటల చిత్రీకరణ ఊటిలో జరుగుతుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత క్రాంతి కుమార్ నిర్మిస్తున్న సినిమా అది. ఎన్టీఆర్, శ్రీదేవి పై పాట చిత్రీకరిస్తున్నారు. సలీం డ్యాన్స్ మాస్టర్. ఆయన షూటింగ్ స్పాట్ లో ఉంటే.. సందడికి కొదవ ఉండదు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లతో సాంగ్స్ చేసేటప్పుడు వారిని ఇమిటేట్ చేస్తూ అందర్నీ ఎంటర్ టైన్ చేసేవారు సలీమ్.

ఒకరోజు లంచ్ బ్రేక్ లో రామారావు, దాసరి మిగతా వాళ్లు కూర్చొని ఉండగా, సలీమ్ ఎక్కడా అని అడిగారు ఎన్టీఆర్. స్పాట్ లో సలీమ్ కనిపించలేదు. ఎంక్వైరీ చేస్తే.. ఓ అడవి కోడిని తనే స్వయంగా పట్టుకుని ఓ మనిషికి డబ్బులు ఇచ్చి కూర చేయించుకుని లోకేషన్ కి కొంచెం దూరంగా కూర్చొని తింటున్నాడని తెలిసింది. అడివి కూర తిన్న తర్వాత ఏమీ ఎరగనట్టు లోకేషన్ కి వచ్చి షాట్స్ తీయడం ప్రారంభించాడు సలీమ్. ఎన్టీఆర్ కి విషయం తెలిసి డైరెక్టర్ గారు సలీమ్ కి రేపు ఫుడ్ అనేది దొరక్కుండా చేయాలి అన్నారు. సరే అన్నారు దాసరి.

ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకు టిఫిన్ తినడం ఎన్టీఆర్ కు అలవాటు. ఆయనతో పాటు మిగిలిన వాళ్లు అందరూ టిఫిన్ తినేసారు. సలీమ్ తినాల్సిన టిఫిన్ ఆయనకు ఇవ్వకుండా ఎన్టీఆర్ కూర్చొన్న కుర్చి కిందపెట్టారు. లోకేషన్స్ లో డ్యాన్స్ మూమెంట్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. సలీమ్ కి ఆకలి వేస్తుండడంతో ఆయన క్యారియర్ ఎక్కడ అని ప్రొడక్షన్ వాళ్లను అడిగాడు. కానీ.. వాళ్లు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎన్టీఆర్ కూర్చొన్న కుర్చి కింద ఓ క్యారియర్ కనిపించింది సలీమ్ కి కానీ.. ఎన్టీఆర్ కూర్చొడంతో దాన్ని తీసే సాహసం చేయలేకపోయారు. సలీమ్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఆ క్యారియర్ .. నసుగుతూ అడిగారు.

అది మాదే బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. దాంతో సలీమ్ సైలెంట్ అయిపోయారు. అది ఎన్టీఆర్ క్యారియర్ కాదని ఖచ్చితంగా సలీమ్ కి తెలుసు. అందుకే ఎన్టీఆర్ కుర్చొలోంచి లేవగానే గబ్బుక్కున ఆ క్యారియర్ అందుకుని ఓపెన్ చేయబోయారు. వెంటనే ఎన్టీఆర్ దాసరితో రండి బ్రదర్ టిఫిన్ చేద్దామని పిలిచారు. వెంటనే సలీమ్ చేతుల్లోంచి దాసరి చేతుల్లోకి వెళ్లిపోయింది ఆ క్యారియర్. రెండు గంటల క్రితమే ఇద్దరూ టిఫిన్ చేసినప్పటికీ సలీమ్ చూస్తుండగానే ఆ క్యారియర్ లో ఉన్న టిఫిన్ మొత్తం తినేసారు. ఇక టిఫిన్ చేసే అవకాశం లేదని సలీమ్ కి అర్ధమైంది. అందుకే చేసేది ఏమీ లేక టీ తాగి సరిపెట్టుకున్నారు. టీ తాగిన తర్వాత పాన్ వేసుకోవడం సలీమ్ కి అలవాటు. ఏమిటి బ్రదర్ అది అని అడిగారు ఎన్టీఆర్. పాన్ డబ్బా ఆయన చేతికి ఇచ్చారు సలీమ్. ఓ తమలపాకు తీసుకుని డబ్బాలో ఉన్న హిమామ్ తీసుకుని నోట్లో పెట్టుకున్నారు ఎన్టీఆర్.

అందరూ ఆశ్యర్యంగా ఆయన వంకే చూస్తున్నారు. షాట్ రెడీ అనగానే ఎన్టీఆర్ లేచి కొంచెం తూలారు. తర్వాత సర్ధుకుని కెమెరా ముందుకు వెళ్లారు. మూమెంట్స్ చేస్తున్నారు కానీ కొంచెం తేడా కనిపించింది. సార్.. మీరు తూలుతున్నారు కొంచెం రెస్ట్ తీసుకుంటారా..? అని అడిగారు దాసరి. లేదు బ్రదర్ నేను చేస్తాను అన్నారు ఎన్టీఆర్ మొండిగా. సౌండ్ ఇంజనీర్ కి సైగ చేసి సౌండ్ కట్ చేయించారు దాసరి. సౌండ్ ఆగిపోవడంతో ఏమైంది డైరెక్టర్ గారు అని అడిగారు ఎన్టీఆర్. టేప్ ప్రాబ్లమ్ వచ్చింది మీరు రెండు నిమిషాలు కూర్చొండని చెప్పారు దాసరి. ఇట్స్ ఆల్ రైట్ అని కూర్చొన్నారు ఎన్టీఆర్. కూర్చొన్న వెంటనే ఆయన నిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా రెండు గంటల తర్వాత లేచి నిద్రపోయానా డైరెక్టర్ గారు అంటూ హాడివిగా షాట్ కు రెడీ అయ్యారు. ఆయన ఎక్కువ మోతాదులో పాన్ వేసుకవడం వలన ఆ రాత్రే మోషన్స్ మొదలయ్యాయి. విషయం తెలిసి షూటింగ్ కి ఒక రోజు బ్రేక్ ఇద్దామనుకున్నారు దాసరి.

నో బ్రదర్ సరిగ్గా 7 గంటలకు మేము లోకేషన్ లో ఉంటాం అన్నారు. అన్న మాట ప్రకారం 7 గంటలకు లోకేషన్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఆ రోజంతా టిఫిన్, భోజనం చేయలేదు ఆయన. కాఫీ టీ కూడా తీసుకోకుండా మంచినీళ్లు తాగుతూ రాత్రి 1 గంట వరకు ఏకధాటిగా పని చేశారు ఎన్టీఆర్. సలీమ్ తో జోక్ చేస్తూ.. మాస్టర్ మీకు పనిష్ మెంట్ ఇవ్వాలనుకుంటే.. మాకు పనిష్మంట్ అయ్యింది అన్నారు ఎంతో స్పోర్టీవ్ గా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles