మంచు మనోజ్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు వినీత్ ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలం నుండి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల గురించి గొడవ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ మరియు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న మంచు మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ పదవి కి పోటీ చెయ్యడం తో ఈ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పొచ్చు,ఎన్నో వ్యక్జ్తిగత విమర్శలు,ఎన్నో వాగ్వాదాలు నడుమ ఎట్టకేలకు ఈరోజు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే,ఫలితాలు మరి కొద్దీ గంటల్లోనే తెలియనున్నాయి, ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులు అందరూ ఈరోజు తెల్లవారుజామున పవన్ కళ్యాణ్ , మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ మరియు నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు,ఇక ఇన్ని రోజులు ఒక్కరిపై ఒక్కరి పరస్పరం విమర్శలు చేసుకున్న ప్రకాష్ రాజ్ మరియయు మంచు విష్ణు లు ఈరోజు ఒక్కరినోక్కరు ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఇక ఈరోజు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్ ఈరోజు అందరి కంటే ముందుగా మొట్టమొదటి వోటుని వినియోగించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం, ఇక పవన్ కళ్యాణ్ తో మంచు ఫామిలీ కుటుంబం మెలిగిన తీరుని చూస్తే రెండు కళ్ళు చాలవు అని చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ కనపడిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లిన మోహన్ బాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని పక్కకి తీసుకొని వెళ్లి చాలా సేపు మంతనాలు జరిపాడు, ఇక మంచు మనోజ్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుండి వెళ్లెవరకూ ఆయన వెంటే ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, పవన్ కల్యాణ భిమానులకు మంచు కుటుంబం లో మంచు మనోజ్ అంటే మొదటి నుండి మంచి అభిమానం ఉన్న విషయం మన అందరికి తెలిసిందే, ఈరోజు వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం ని చూసి ఆ అభిమానం ఇంకా పదింతలు అయ్యింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

తొలుత ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న మా ఎన్నికల ప్రాంగణం , ఒక్కసారిగా వాడివేడిగా మారిపోయింది, ఇండస్ట్రీ కి సంబంధం లేని వ్యక్తి ఎవరో లోపాలకి చొరబడి దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చాడు అని అటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మరియు ఇటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒక్కరి పై ఒక్కరు విమర్శలు చేసుకున్నారు, ఒక్కనొక్క సందర్భం లో నరేష్ లైన్ దాటి అసభ్య వ్యాఖ్యలు చెయ్యడం తో అసహనం కోల్పోయిన ప్రకాష్ రాజ్ నరేష్ ని కొట్టేందుకు ముందుకి వెళ్ళాడు, ఆ తర్వాత ‘ దమ్ముంటే నా మీద గెలిచి చూపించండిరా నా కొడకల్లారా’ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది, ఇండస్ట్రీ లో ఎంతో డిమాండ్ ఉన్న ప్రకాష్ రాజ్ మరియు నరేష్ వంటి నటులు ఇలా గొడవలకి దిగడం అందరికి ఆశ్చర్యం కలిగించిన విషయం ,ఇప్పటి వరుకు ప్రకాష్ రాజ్ మరియు నరేష్ కలిసి దాదాపుగా 10 సినిమాల్లో నటించారు, మరి ఈరోజున జరిగిన ఈ గొడవలు వాళ్ళ భవిష్యత్తు లో మల్లి వీళ్ళు కలిసి నటిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles