లయ కారకుడు… నీలకంఠుడు… పరమ శివుడు. శివ తత్వం ఆధ్యాత్మికoగనే కాకుండా మానసిక పరిణతికి ఒక చక్కటి మార్గం. ఎంత బాధ అయినా పంటికింద బిగబట్టలని. కాల సర్పాన్ని అయినా మెడలో మాలల మార్చుకోవాలని… తమ తో పాటు తమ సేవకిలకి కూడా గౌరవాన్ని ఇవ్వాలని ఇలా చాలా విషయాలు మనకు శివ రూపం లో తెలుస్తాయి..

అయితే శివుడు ఎలా ఉద్భవించాడు..? సాధారణంగా ఆయన జనన రహస్యం గురించి మనకు ఒక కథ కూడా దొరకదు. అయితే శివ జన్మ రహస్యం గురించి ఒక కథ మాత్రం ప్రాచుర్యంలో ఉంది. శ్రీ మఠ్ దేవి మహా భాగవత్ లో ఒక చిన్న వివరణ కూడా ఉంది. ఒక నాడు బ్రహ్మ పుత్రుడు నారదుడు అసలు త్రిమూర్తుల పుట్టుక ఇంకా వారి మాత పితరుల గురించి చెప్పమని కోరాడు. అపుడు బ్రహ్మ తాము శక్తి స్వరూపిణి అయినా దుర్గ మాత ఇంకా కాల స్వరూపుడు అయినా శివుడి అంశాలుగా జన్మించామని తమ కు ఈ సృష్టి ని నడిపే కార్యక్రమాన్ని సమ భాగాలుగా పంచారని చెప్పాడు. కాల రుద్రుడు, కాల భైరవుడు, నీలా కంటుడిగా, ఇలా అనేక పేర్ల తో ఆయన్ని పిలిచేవారు… అపుడు జరిగిన సంఘటన ను బట్టి పరమేశ్వరునికి దానికి సంబంధించిన పేర్లు వచ్చేవి….. శివుడు గజ చర్మాన్ని కప్పుకొని బ్రహ్మ కపాలం చేతిలో తీస్కొని విబూది దారి అయి త్రిశూలామ్ తో… నంది వాహనుడిగా కైలాసం లో కొలువై ఉంటాడు….

ఇక పరమేశ్వరుడిని రుద్రుడిగా కొలిచే సంప్రదాయం కూడా ఉన్నది… శివుడికి ఇద్దరు మగ పిల్లలు గణేశుడు కార్తికేయుడు ఒక ఆడపిల్ల కూడా ఉంది. ఆమె పేరు అశోక సుందరి…. ఇంకొక కథలో బ్రహ్మ మిగిలిన ఇద్దరితో మీ సృష్టి కర్తను నేను అనడం తో విష్ణువు బ్రహ్మ నేను మీ పితామహుడను. నా నాభి నుండి కమలం నందు ను పుట్టవు కదా అని వివరించాడు అపుడు విశ్వరూప దర్శనం తో ఓ బ్రాహ్మ, విష్ణు, మీ అంశాలను నేనే సృష్టించాను. నా ఇంకొక రూపమే పరమేశ్వరుడు అని తెలిపాడు.తనకి 5 ముఖాలు ఉంటాయి అని వాటి నుండే సృష్టికి మూలం అయినా పంచ భూతాలు ఉద్బవించాయి అని తనకు ఈ సృష్టి కి సహాయం శక్తి చేస్తుంది అని శక్తి శివుడి కలయిక ఏ సృష్టి అని చెపుతారు..

ఇంకా ఆది దేవుడు మహా దేవుణ్ణి లింగ రూపం లో కూడా పూజిస్తారు. లింగార్చన మహా ప్రశస్తమైనది. పరమేశ్వరుడు కూడా తన ఇంకొక రూపం లింగాన్ని అభిషేకించిన సందర్భాలు ఉన్నాయ్ ఒక పోటీ లో లింగం చివర మొదలు చూడాలని బ్రహ్మ విష్ణువు లు ఓడిపోయారు కూడా….. అంతటి మహోన్నత రూపం శివ లింగం…. ఆ లింగకారం ఆది అంతం లేని ఒక బ్రహ్మ పదార్ధానికి సంకేతం. ఆ లింగం నుండే సృష్టి మొదలయింది అని చెప్తారు. మొత్తానికి పరమేశ్వరునికి జననం ఉన్న శివుడికి ఆది అంతం లేని మహా కారకుడు కాల రూపుడు గా పేర్కొంటారు. మీకు శివ తత్వం లో మరియు శివుడి అలంకరణలో ఏది ఇష్టమో కామెంట్ చెయ్యండి..
