మా ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద రామ్ చరణ్ మంచు విష్ణు తో చేసిన ఈ కామెడీ చూడండి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలం నుండి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల గురించి గొడవ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ మరియు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న మంచు మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ పదవి కి పోటీ చెయ్యడం తో ఈ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పొచ్చు,ఎన్నో వ్యక్జ్తిగత విమర్శలు,ఎన్నో వాగ్వాదాలు నడుమ ఎట్టకేలకు ఈరోజు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే,ఫలితాలు మరి కొద్దీ గంటల్లోనే తెలియనున్నాయి, ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులు అందరూ ఈరోజు తెల్లవారుజామున పవన్ కళ్యాణ్ , మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ మరియు నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు,ఇక ఇన్ని రోజులు ఒక్కరిపై ఒక్కరి పరస్పరం విమర్శలు చేసుకున్న ప్రకాష్ రాజ్ మరియయు మంచు విష్ణు లు ఈరోజు ఒక్కరినోక్కరు ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఇక నిన్న మంచు విష్ణు మెగా బ్రదర్ నాగబాబు పై కౌంటర్ వేస్తూ మెగా ఫామిలీ కుంటుంబాన్ని మొత్తం దూషించిన సంగతి మన అందరికి తెలిసిందే, కానీ ఈరోజు పోలింగ్ బూత్ వద్ద రామ్ చరణ్ మంచు విష్ణు కనపడగానే హాయ్ విష్ణు అంటూ కౌగలించుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు, ఏమిటి బాగా గొడవలు పడుతున్నావ్ ఈమధ్య అంటూ ఛలోక్తులు విసిరాడు రామ్ చరణ్, ఆ తర్వాత మోహన్ బాబు తో కూడా ఆయన చాలా ఆప్యాయంగా పలకరించాడు, చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ కలలో కూడా తమ ఒక్కరి హాని ని కోరుకునే వారు కాదు అనే విషయం మన అందరికి మొదటి నుండి తెలిసిందే,కానీ ఇంతలా పబ్లిక్ టార్గెట్ చేసిన కూడా ఇంత మంచితనం గా ఉండడం ఎలా సాధ్యం, అసలు ఇంకా వీళ్ళు మారారా అంటూ మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు,రామ్ చరణ్ ని ఎంతో ఆప్యాయంగా ప;లకరించిన మంచు విష్ణు ఆయన తండ్రిని చిరంజీవి గారిని మాత్రం చిరంజీవి గారే స్వయంగా పలకరించిన స్పందించకుండా అక్కడి నుండి వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఎపుడు లేనిది పవన్ కళ్యాణ్ తొలిసారిగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు,అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘ నేను ఇంతకాలం మా ఎన్నికలు ఇంత వాడివేడిగా ఉండడం ఎప్పుడు చూడలేదు,పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన సినిమా హీరోలే ఇలా గొడవలు పాడడం నాకు కాస్త బాహీగా అనిపించింది, మోహన్ బాబు గారు మరియు చిరంజీవి గారు మంచి మిత్రులు , వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, సినిమా ఇండస్ట్రీ ని రెండు గ్రూప్స్ గా విభజించడం ఎవరి తరం కాదు, మేము అందరం ఎప్పటికి ఒక్కే కుటుంబం ‘ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు, ఇక పోలింగ్ బూత్ వద్ద ఉన్న ప్రకాష్ రాజ్ మరియు మంచు మనోజ్ లతో పవన్ కళ్యాణ్ కాసేపు సరదాగా ముచ్చటించారు, మంచు మనోజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం ని చూస్తే వాళ్లిదరు ఎంత క్లోజ్ గా ఉన్నారో అర్థం అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles