మా ఎన్నికల ప్రక్రియ పై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ వ్యాప్తంగా సినీ హీరో గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా ఆయనని తన తోటి నటీనటులు ఎంతగానో అభిమానుస్తూ ఉంటారు, చిరంజీవి ప్రస్తావన వస్తే వాళ్ళు కూడా ఒక్క సెలబ్రిటీ అనే విషయం ని మర్చిపొయ్యి సాధారణ అభిమాని లాగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇండస్ట్రీ లో ఉండే అందరూ అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలుచుకునే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి గారిని విపరీతంగా అభిమానించే హీరోలలో ఒక్కరు శ్రీకాంత్, ఈయనకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,చిరంజీవి గారిని తన సొంత అన్నయ్య లాగ ఈయన భావిస్తూ ఉంటాడు, చిరంజీవి కూడా నాకు ఇద్దరు తమ్ముళ్లు కాదు, ముగ్గురు తమ్ములు, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు లతో పాటు శ్రీకాంత్ కూడా నా తమ్ముడే అని చిరంజీవి ఎన్నో సందర్బాలలో బహిరంగంగానే తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది.

ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ నిర్మల కాన్వెంట్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయినా సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న రెండవ సినిమా పెళ్లి సందడి,హీరో శ్రీకాంత్ పాతికేళ్ల క్రితం రాఘవేంద్ర రావు గారి దర్శకత్వం లో తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రం ఎంత పేద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మల్లి ఆయన కొడుకు అదే పేరు తో సినిమా తియ్యడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి, ఆ అంచనాలకు తగ్గట్టు గానే శ్రీకాంత్ తన కొడుకు సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ ని ముఖ్య అతిధులుగా పిలిచాడు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది , ఇటీవల మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన గొడవల పై మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆయన మాట్లాడుతూ ‘మా తరం హీరోలు అయినా మేము ఎంత అన్యోయంగా, స్నేహ భావంగా ఉంటాం అనే విషయం మీ అందరికి తెలిసిందే, కానీ ఇటీవల కేవలం ఒక్క పదవి కోసం ఇంతలా గొడవ పడడం నిజంగా నాకు ఎంతో బాధని కలిగించింది, పదవులు ఇవి అన్ని కేవలం తాత్కాలికం మాత్రమే,బంధాలే కదా శాశ్వతమైనది, దయచేసి మన ఇండస్ట్రీ పరువుని తియ్యకండి,ఈ గొడవలకు కారణం ఎవ్వరో వాళ్లని ఇప్పటికైనా దూరం పెట్టండి’ఆ అంటూ చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు, నిన్న జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, ఇక హీరో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి దాదాపు 375 ఓట్లతో ప్రత్యర్థి బాబు మోహన్ పై ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా భారీ మెజారిటీ తో గెలిచాడు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 11 మంది గెలవగా, మంచు ప్యానల్ నుండి కేవలం 7 మంది మాత్రమే గెలిచారు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి అత్యధిక మంది గెలుపొందిన, క్రోస్ వోటింగ్ భారీగా జరగడం తో అయన ఓడిపోవాల్సి వచ్చింది, నాన్ లోకల్ నినాదమే ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles