మా ప్రెసిడెంట్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

దాదాపు నెల రోజులు నుండి మన టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు గురించి ఎలాంటి రగడ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,మా అసోసియేషన్ ప్రెసిడెంట్౫ గా నిలబడిన ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు లు నువ్వా నేనా అనే రేంజ్ తలపడ్డారు, గెలుపు నాది అంటే నాది అంటూ ఇద్దరు బహిరంగంగానే సవాలు విసురుకున్నారు,సోషల్ మీడియా లో అయితే ప్రకాష్ రాజ్ కి అద్భుతమైన సపోర్టు వచ్చింది, కానీ ఓట్లు వేసేది సామాన్య జనాలు కాదు కదా, ఇండస్ట్రీ లో నటీనటులు,అందుకే ప్రకాష్ రాజ్ ఓడిపోవాల్సి వచ్చింది, ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం మా ఎన్నికలలో కూడా ప్రాంతీయ వాదన తీసుకొని రావడమే, ప్రకాష్ రాజు మన తెలుగు బాషా వాడు కాదు, పరాయి బాషా కి చెందినవాడు,అందుకే మేము తెలుగు వాడైన మంచు విష్ణు కి ఓటు వేస్తాము అంటూ ఏకంగా ఇండస్ట్రీ లో లెజండరీ నటులు అయినా కోట శ్రీనివాస రావు వంటి వారెందరో బహిరంగంగా మంచు విష్ణు కి మద్దతు పలికారు, వాస్తవానికి ప్రాంతీయ వాదన తీసుకొని రావడం అనేది అత్యంత నీచమైన చర్య అని చెప్పక తప్పదు, ప్రకాష్ రాజ్ ని మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా పరాయి రాష్ట్రానికి చెందిన వాడు అని, ఆయన బాషా తెలుగు కాదు అని ఈనాడు అనుకోలేదు.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదు అని మంచు ప్యానల్ ఆలు చెప్పేంత వరుకు జనాలకు ఎవ్వరికి కూడా తెలియదు,ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదు మనకి అవసరం లేదు అని అనుకుంటే ఆయనకీ మా సభ్యత్వం ఇవ్వడం ఎందుకు అనేది ఇండస్ట్రీ పెద్దల నుండి వెలువడుతున్న ప్రశ్న,పోటీ చెయ్యడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రకాష్ రాజ్ లాంటి అంతర్జాత్యా నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే ఎన్నో అద్భుతమైన ఫండ్ రైసింగ్ కార్యక్రమాలను చేపట్టవచ్చు, ఎన్నో అద్భుతమైన ఆలోచనలతో మన టాలీవుడ్ ని ప్రగతి పదం లో నడిపించి ఉండవచ్చు, ప్రకాష్ రాజ్ మా ప్రెసిడెంట్ గా ఓడిపోతే ఆయనకీ జరిగే నష్టం ఏమి ఉండదు, ప్రతి ఏడాది ఆయన తెలుగు లో పాతిక సినిమాలు చేసేంత బిజీ ఉన్న ఆర్టిస్టు, ఇతర బాషలలో కూడా ఆయన స్థాయి అదే రేంజ్ లో ఉంటుంది, అలంటి ఒక్క గొప్ప నటుడు ప్రెసిడెంట్ అయితే మా కి అలంకారం లాంటిది, కానీ ఆ అవకాశం లేకుండా చేసారు, టాలీవుడ్ లో కూడా నీచమైన రాజకీయాలకు తెరలేపుతూ, ప్రాంతీయ వాదం ని తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ ని ఓడిపొయ్యేలా చేసారు, దీనితో తీవ్రమైన మనస్తాపానికి గురి అయినా ప్రకాష్ రాజ్ తన మా సభ్యత్వం కి రాజీనామా చేసాడు.

ఈరోజు ఆయన మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతూ ‘ మా ఎన్నికలలో ప్రాంతీయ వాదన తీసుకొచ్చారు, నన్ను తెలుగు వాడిని కాదు అని ఓడించారు, నేను తెలుగు వాడిని కానప్పుడు, మా అసోసియేషన్ లో కొనసాగడం లో ఎలాంటి అర్థం లేదు, అందుకే నేను నా సభ్యత్వం కి రాజీనామా చేస్తున్నాను’ అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడారు, మరి మీరు తెలుగు వారు అని నమ్మి 650 ఓట్లలో 300 ఓట్లు వేసిన నటీనటులకు ఏమి సమాధానం చెప్తారు అని ఒక్క విలేకరి అడిగిన ప్రశ్నకి ప్రకాష్ రాజ్ సమాధానం చెప్తూ ‘వాళ్లందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞుడినై ఉంటాను, వాళ్ళతో కలిసి నేను కచ్చితంగా పని చేస్తాను, అంటే కాకుండా మా కి ఎప్పుడు అవసరం వచ్చిన బయట నుండి పని చేస్తాను కానీ, మా సభ్యుడిగా మాత్రం నేను కొనసాగను, నాకు మాత్రం ఆత్మగౌరవం ఉండదా’ అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రెండు చోట్ల ఓడిపోయిన కూడా ఆయన ఇప్పటికి రాజకేయాల్లోనే కొనసాగుతూ పోరాడుతూనే ఉన్నారు, కానీ మీరు ఎందుకు ఆలా చెయ్యట్లేదు అని అడిగిన ప్రశ్న కి ప్రకాష్ రాజ్ సమాధానం చెప్తూ ‘ అది రాష్ట్ర రాజకీయాలు, ఇది చిన్న సంస్థ ఙకి చెందిన ఎన్నికలు, ఇలాంటి ఎన్నికలలో కూడా ఇలాంటి నీచపు రాజకీయాలు తీసుకొని రావడం నిజంగా దురదృష్టకరం,అందుకే నేను ఇక మా సభ్యుడైజ్ కొనసాగదల్చుకోలేదు’ఆ అంటూ ప్రకాష్ రాజ్ మీడియా ముఖంగా తెలియచేసాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles