మీకు వచ్చే కలల వెనుక నమ్మలేని రహస్యం

మనలో చాలా మందికి కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని శుభఫలితాలను సూచిస్తుంటే మరికొన్ని అశుభాన్ని సూచిస్తుంటాయి. కానీ ఏ కలలు ఏ ఫలితాన్ని సూచిస్తాయో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అందుకే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. కలలు నిజమేనా? అసలు కలలు ఎందుకు వస్తాయి? కలలో ఏం వస్తే ఏం లాభం? ఏం నష్టం? ఏ కల వస్తే ఏ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది? కలల వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం.

విపరీతంగా కష్టపడి, అలసిపోయినవారు నిద్రిస్తే కలన్నదే రాదు. ధనమెక్కువైన వారికి, అశాంతి ఉన్నవారికి, అనారోగ్యంతోనూ, మానసిక సమస్యలతోనూ, ఒంటరితనంతో బాధపడేవారికి కలలొస్తాయి. వారి భయాలకి తీరని కోరికలకీ వారి వారి ఆలోచనల ప్రతిరూపమే కలలు. కొన్ని కలలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. దీంతో ఠక్కున లేచి కూర్చుంటారు. ఏమైంది.. ఎక్కడున్నా అని ఒకటికి రెండుసార్లు చూసుకొని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. మరికొందరు నీళ్లు తాగి.. ఇంకొందరు దేవుని దండకం చదువుకొని నిద్రపోతారు. అయితే ఇలాంటి కలలు రావడానికి నిత్య జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దారి తప్పినట్లు కల వస్తే.. నిత్యం వెళ్తున్న దారిలోనే తప్పిపోవడం, ఓ గదిలో బందీ అయినట్లు మీకు కల వచ్చిందా?… అయితే మీరు నిజ జీవితంలో ఒకరి బలవంతంపై పని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని అర్థమట. ఇలాంటి కల వస్తే పరిస్థితి మీ చేయి జారిపోతోందని ముందుగా గుర్తించాలంటున్నాయి అధ్యయనాలు. నీళ్లలో మునిగిపోతున్నట్లు.. ఎత్తు నుంచి జారి పడిపోతున్నట్లు మీకెప్పుడైనా కల వచ్చిందా? ఒకవేళ అలా వచ్చిందంటే.. మీకు ఎదురైన పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అధ్యయనం చెబుతోంది. అంటే మీరు ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. అయితే ఇలాంటి కల వచ్చినప్పుడు ఠక్కున లేచి మీకు మీరుగా తేలిపోతున్నట్లుగా భావిస్తే ఇది నిజ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపించగలదు.

కంప్యూటర్‌పై పని చేస్తుండగా ఒక్కసారిగా అది పాడవడం.. ఎవరికైనా ఫోన్‌ చేస్తే వాళ్లు కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడం లాంటి కలలు వచ్చాయా? ఈ ఆధునిక యుగంలో ఇలాంటి కలలు ఎక్కువమందికి వస్తున్నాయని చెబుతున్నారు. వీటికీ మరో అర్థం కూడా ఉంది. నిజ జీవితంలో మీకు బాగా నచ్చిన వ్యక్తులకు మీరు దూరమవుతున్నారని… మీ బంధం బీటలు వారుతోందని ఆ కలల సారం. ఇలాంటప్పుడు ఒక్కసారి వారితో మాట్లాడి చూడండి.. మళ్లీ అలాంటి కల కచ్చితంగా రాదని అంటున్నాయి అధ్యయనాలు. అందరూ ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశంలో నగ్నంగా ఉన్నట్లు కొందరికి కలలు వస్తుంటాయి. నిజాన్ని దాచడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి కలలు వస్తాయని అధ్యయనం చెబుతోంది. కలలో నగ్నంగా ఉన్నారంటే… ఆ నిజాన్ని నిజ జీవితంలో కాకుండా కలలో అలా నగ్నంగా ప్రదర్శిస్తున్నట్లు అర్థం. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నట్లు కలలో కనిపిస్తే.. అది మీ మానసిక స్థితిని తెలియజేస్తుంది. విపత్తు ఎంత పెద్దగా ఉంటుందో మీ మానసిక స్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయని అధ్యయనంలో తెలుస్తోంది. మీరు మీ బలహీనతలను గుర్తించి.. వాటిని అధిగమించినప్పుడు ఇలాంటి కలలు రాకుండా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నాయి అధ్యయానాలు

విద్యార్థి దశలో చాలా మందికి వచ్చే కల.. పరీక్షల్లో తప్పడం. అలాంటి కలలు ఆ తర్వాత కూడా వచ్చాయంటే దానికి ఓ కారణముంది. జీవితంలో మీరు సాధించిన విజయాలకు నిజంగా మీరు అర్హులేనా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అనే సందేశం ఈ కలలో ఉంది. గతంలో మీరు చేసిన పనులను ఒక్కసారి సమీక్షించుకోవాలని ఈ కల చెబుతోంది. ఇల్లు కూలిపోయినట్లు.. ఇంటిని ఎవరో ధ్వంసం చేస్తున్నట్లు కొందరికి కలలు వస్తుంటాయి. ఇలాంటి కల వస్తే ఇంటికి ఏమీ అవ్వదు కానీ.. మీరో విషయం అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లు. మీ విలువైన వస్తువులను నిర్లక్ష్యం చేస్తున్నారని.. అవి ఆపదలో ఉన్నాయని ఆ కల అర్థం. బంధువులు చనిపోయినట్లు లేదా తనే కన్నుమూసినట్లు కలలు వస్తుంటాయి. అయితే అలాంటి కలలు వచ్చినప్పుడు నిజంగానే అలా జరుగుతుందేమోనని భయపడుతుంటారు. కానీ, ఆ అవసరం లేదు. నిజానికి మరణించినట్లు కల వస్తే.. నిజ జీవితంలో ఇకపై కొత్త దశను చూడబోతున్నట్లు అర్థం. జీవితంలో ఒత్తిడిని భరించలేని వాళ్లకి, సమస్యలతో సతమతమవుతున్నవారికి తనను ఎవరో వెంబడిస్తున్నట్లు కలలు వస్తుంటాయి. పరిస్థితి ఎదుర్కోలేక భయపడుతూ జీవించే వారికి తరచూ ఇలాంటి కలలు వస్తాయని అధ్యయనం చెబుతోంది. వెంటపడటమే కాదు.. ఆ తర్వాత దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది.

కలల ఫలితాల గురించి తాళపత్ర గ్రంధాలు ఏ విధంగా వివరిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కలలో వైశ్యుడిని చూసినట్లయితే అధిక సౌఖ్యం కలుగుతుంది. ఆకాశంలో నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఎక్కువగా ఉన్నట్లు కలలో కనిపిస్తే మిత్రుల వలన, సన్నిహితుల వలన కార్యజయము కలుగును. కలలో తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు కనబడితే ధనలాభం కలుగును. అధికారులు, పదవిలో ఉన్న మంత్రులు కనబడితే అభివృద్ధి, క్షేమము కలుగును. బట్టతలతో ఉన్నవారు కలలో కనబడితే ధనలాభం కలుగును. ఏనుగు కలలో కనబడితే నూతన వస్తుప్రాప్తి మరియు మీరు తలపెట్టిన కార్యం విజయవంతమౌతుంది. చీమలు వరుసలో వెళుతూ కనబడినట్లైతే ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, కీర్తిప్రతిష్టలు, ధనలాభం కలుగుతాయి. గుఱ్ఱము, గాడిద కనబడితే ధనలాభం కలగడమే కాకుండా కష్టాలు కూడా తొలగుతాయి. కలలో మాంత్రికులు కనబడితే నమ్మినవారిచే మోసగింపబడతారు అని అర్ధం. కలలో సూర్యుడు తన ఇంటిపైకి వచ్చినట్టు కనబడితే వారి ఇల్లు అగ్నికి ఆహుతి అగునని అర్ధం. కామధేనువు కనబడితే లాభం చేకూరుతుందని అర్ధం. బంగారు వర్ణంలో ఏ వస్తువులైనా కనబడితే అదృష్టం వెన్ను తట్టి వస్తుందని అర్ధం. పితృదేవతలు కనబడితే పుత్రసంతానం కలుగుతుంది. చిల్లర, డబ్బు కనబడితే దారిద్య్రం అనుభవించబోతున్నారని అర్ధం.

బంగారం పుచ్చుకోవడం, దొరకడం వంటివి కలలో వస్తే దారిద్రయానికి సూచిక. జమ్మి చెట్టు కనిపిస్తే, విజయానికి సూచిక. పాము కలలో కనబటం లేదా కరవడం వంటివి వస్తే భయాన్ని మరియు చింతలను సూచిస్తున్నాయని అర్ధం. హత్య చేసినట్టు కల వస్తే, ఎవరో ఒకరిపై ఎక్కువ కోపం ఉన్నట్లు సూచన. ఇప్పుడు ఏ కల వస్తే ఏ వ్యాధి రావడానికి ఆస్కారం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం! భూత ప్రేత పిశాచులు వస్తే జ్వరం రావడానికీ, ఎర్రని పూలదండాలు వస్తే రక్త సంబంధిత రోగాలూ, దున్నపోతూ, కుక్క, గాడిద వంటివి దక్షిణ దిక్కుగా వెళుతున్నట్లు వస్తే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, రాక్షసులు, నీరు వంటివి రెండు కలిపి వస్తే, పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు వస్తాయి. చంద్ర, సూర్య గ్రహణాలు వస్తే కంటి వ్యాధులు వస్తాయి. నల్లని, భయంకరమైన ముఖాలు కలిగిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. అందుకే నిద్రించే ముందు ఐదుగురు దేవుళ్ళకు నమస్కరించాలి పురాణాలు చెబుతున్నాయి. వారు ఎవరంటే, రాముడు, సుబ్రహ్మణ్యుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, బీముడు. ప్రతిరోజు నిద్రించేముందు తప్పనిసరిగా వీరికి నమస్కరించాలి అనేక పురాణ గ్రంధాలు తెలుపుతున్నాయి. ఈ కలలు రావడానికి, వాస్తవానికీ మన జీవన ప్రవర్తనే కారణం. వచ్చే కలలన్నీ మన ఊహల్లో ఉన్నవే అని అర్ధం చేసుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles